అంతర్యామి WhatsApp Channel

అంతర్యామి

310 subscribers

About అంతర్యామి

ప్రతి కదలిక ఈశ్వరనిదే. జరిగేది జరుగుతుంది. జరగనిది జరుగదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండడం ఉత్తమం. ~శ్రీరమణ మహర్షి

Similar Channels

Swipe to see more

Posts

అంతర్యామి
అంతర్యామి
5/27/2025, 8:00:37 AM

*అపరోక్షానుభూతి-23* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము* 143 _ఏ భిరంగైః సమాయుక్తో రాజయోగ ఉదాహృతః కించిత్ పక్వ కషాయాణాం హఠయోగేన సంయుతః ॥_ 15 అంగాలతో కూడిన రాజయోగమనే ఈ సర్వోత్కృష్టమైన జ్ఞానయుక్త సాధనానుష్ఠానం పైన వివరింపబడిన విధంగా చెప్పబడింది. ప్రాపంచక విషయ వాసనలు ఇంకా మిగిలి వుండడం వల్ల కొద్దిగా పరిపక్వమైన మనస్సు కల సాధకులకు ఈ తత్వవిచార సాధనాక్రమాన్ని హఠయోగాభ్యాసంతో కూడా కలిపి చేసుకోవడం అత్యంత ఫలప్రదమై పరమార్థ ప్రాప్తికి దోహదమౌతుంది. (144) _పరిపక్వం మనో యేషాం కేవలోచ సిద్ధిదః గురుదైవత భక్తానాం సర్వేషాం సులభో జవాత్ ॥_ చిత్త శుద్ధితో పూర్ణంగా మనస్సు పరిపక్వం పొందిన సాధకమహాశయులకు, ఈ రాజయోగ సాధ నము శీఘ్రంగా ఫలప్రదమై సిద్ధిని కలుగ జేస్తుంది. అన్య మొల్లని గురుభక్తి, దైవభక్తి కలవారందరికీ కూడా, వారు ఏకుల, మతస్తులైనా స్త్రీ పురుష బేధం లేకుండా, చిత్తసుద్ధి కలిగించి ఈ రాజయోగ సాధన ఫలప్రదము, సులభసాధ్యము అవుతుంది.(సమాప్తం)

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/27/2025, 7:57:31 AM

*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో మా అనుభవాలు..* *పటమూ..పరివర్తన..* "స్వామివారి పల్లకీసేవ లో నా పేరు నమోదు చేయండి..నేను పాల్గొంటాను.." అంటూ నా వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకతను అడిగాడు.."మీ పేరు..?" అన్నాను నేను.."తిరుపయ్యండి..ఇతను నా స్నేహితుడు, గురుమూర్తి.."అన్నాడు..మా సిబ్బంది వద్దకు వెళ్లి, తన పేరు నమోదు చేయించుకోమని చెప్పి పంపాను..ఇద్దరూ వెళ్లారు..మరి కొద్దిసేపటికి ఆ ఇద్దరిలో గురుమూర్తి అనే అతను నాదగ్గరకు వచ్చి, "నేను ఈ ప్రాంతానికి కొత్త..ఈ క్షేత్రం గురించి వివరాలు తెలుపగలరా..?" అని అడిగాడు..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే నాటి నుంచి, కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా జరిగిన చరిత్రను అతి క్లుప్తంగా చెప్పాను..శ్రద్ధగా విన్నాడు.. "ఈరోజుల్లో కూడా ఇలాటి సిద్ధులు, అవధూతలు, సాధకులు ఉన్నారా?..మీరంటే ఈ స్వామివారిని చూసారు కాబట్టి మీరు నమ్మడం లో అర్ధం ఉంది..మాలాంటి వారికి ఏదైనా దృష్టాంతరం కనబడితే..అప్పుడు విశ్వసిస్తాము..నా వరకూ నేను కళ్ళతో చూసేదాకా ఏదీ నమ్మనండీ..అది తప్పో ఒప్పో తెలీదు..నా పద్ధతి అలాంటిది.." అన్నాడు.."మిమ్మల్ని నమ్మించాలని నేను ప్రయత్నం చేయటం లేదండీ..మీరు అడిగారు కాబట్టి స్వామివారి గురించి చెప్పాను..నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం.." అన్నాను..ఇక అతనితో ఎక్కువ సంభాషణ చేయదల్చుకోలేదు..అతనూ తన స్నేహితుడి వద్దకు వెళ్ళిపోయాడు.. ఆరోజు సాయంత్రం పల్లకీసేవలో తిరుపతయ్య ఒక్కడే పాల్గొన్నాడు..గురుమూర్తి పల్లకీసేవ జరిగే విధానాన్ని చూస్తూ దూరంగా నిలబడ్డాడు..పల్లకీ స్వామివారి మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని, ముఖద్వారం వద్దకు వచ్చింది..అక్కడ పల్లకీ మోసే వాళ్ళు, పల్లకీని పైకెత్తి పట్టుకుంటారు..అప్పటిదాకా పల్లకీ తో పాటు ప్రదక్షిణాలు చేసిన భక్తులు ఒక వరుసలో నిలబడి..ఒక్కొక్కరుగా పైకెత్తి పట్టుకున్న పల్లకీ క్రింద నుంచి, నమస్కారం చేసుకుంటూ ఇవతలికి వస్తారు..అలా పల్లకీ క్రింద నుంచి వస్తే..తమకు మేలు జరుగుతుందనే భావన ఎప్పటినుంచో భక్తుల మనస్సులో నాటుకొని ఉన్న సాంప్రదాయం..తిరుపతయ్య తాను కూడా పల్లకీ క్రింద నుంచి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చాడు..గురుమూర్తి దూరంగా వున్నాడు.. ప్రక్కరోజు ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధికి అర్చక స్వాములచే అభిషేకము, హారతులు పూర్తయ్యాక..తిరుపతయ్య స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లి వచ్చాడు..ఆ తరువాత ఇద్దరు మిత్రులూ స్వామివారి ముందున్న మంటపం లో కూర్చున్నారు..కొద్దిసేపటి తరువాత..ఇద్దరూ నాదగ్గరకు వచ్చి, తాము తమ ఊరికి తిరిగి వెళుతున్నామని చెప్పారు..తిరుపతయ్య అత్యంత భక్తితో.."ఈరోజు స్వామివారి సమాధి దర్శనం చాలా బాగా జరిగిందనీ..వీలైతే త్వరలో మళ్లీ వస్తాననీ " చెప్పాడు..ఇద్దరూ వెళ్లిపోయారు.. సరిగ్గా ఆరు రోజుల తరువాత.."ప్రసాద్ గారూ..నా పేరు గురుమూర్తి అండీ..పోయినవారం నేనూ, నా స్నేహితుడు తిరుపతయ్య స్వామివారి వద్దకు వచ్చాము..రేపు శనివారం నాడు నేను వస్తున్నాను..నేను స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని, సమాధి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను.." అని ఫోన్ లో చెప్పాడు..నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది..తనకు ఏదైనా ఋజువు కనబడితేనే నమ్ముతానని చెప్పిన వాడు, ఇలా హఠాత్తుగా ఫోన్ చేసి స్వామివారి వద్దకు వస్తానని చెప్పడానికి ఏదో ఒక కారణం ఉంటుందని అనుకున్నాను.. ఆ ప్రక్కరోజు శనివారం నాటి సాయంత్రం గురుమూర్తి తన కుటుంబం తో సహా మందిరానికి వచ్చాడు..నేరుగా నేను కూర్చున్న చోటుకే వచ్చి, "ప్రసాద్ గారూ..పోయినవారం నేను స్వామివారి సన్నిధికి వచ్చి కూడా దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళాను..ఇంటికి వెళ్ళేసరికి మా ఇంట్లో స్వామివారి పటం వుందండీ..నాకు విపరీతంగా ఆశ్చర్యం వేసింది..ఈ పటం ఎలా వచ్చింది అని మా భార్యను ఆడిగానండీ..ఆదివారం ఉదయం మా వీధిలో ఒక సాధువు వచ్చాడట..మా యింటి ముందు నిలబడితే మా ఆడవాళ్లు భిక్షకో..డబ్బులు అడగడానికో వచ్చాడనుకొని ఓ పదిరూపాయలు ఆయన చేతిలో పెట్టిందట..ఆయన తన సంచీలోంచి, స్వామివారి చిత్ర పటం మా వాళ్ళ చేతిలో పెట్టి, ఇంట్లో పెట్టుకొని రోజూ నమస్కారం చెయ్యి..మంచి జరుగుతుందని చెప్పి వెళ్లిపోయాడట..ఆ పటం ఇంటికొచ్చిన కొద్దిసేపటి కే మా అబ్బాయికి బెంగుళూరు లో ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు మెయిల్ వచ్చింది..సాక్షాత్తు స్వామివారే నడిచి మా యింటికి వచ్చారని మా ఆవిడ అన్నది..నాకూ నిజమనిపించింది..నేను పొరపాటు చేశానని అర్ధం చేసుకొని, ఈరోజు ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని, క్షమాపణ చెప్పుకొని వెళదామని వచ్చాను..నాతో పాటు ఆమెనూ పిల్లలనూ తీసుకొని వచ్చాను.." అన్నాడు..ఆ మాటలు అతను చెప్పేటప్పుడు గురుమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి..అతని స్వరం లో పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తోంది.. అతనిలో పరివర్తన రావడానికి స్వామివారే చొరవ తీసుకున్నారు..ఇక నేను వివరించడానికి ఏమీ మిగలలేదు..గురుమూర్తి తో పాటు స్వామివారికి నేనూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను.. సర్వం.. శ్రీ దత్తకృప! ~పవని నాగేంద్ర ప్రసాద్..

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/28/2025, 8:20:18 PM

రమణాశ్రమ లేఖలు 2 (22_11_45) *ఏది స్పురణ* 'హృషీకేశానంద ' అనే ఒక బెంగాలి కాషాయాంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు ఎనిమిదిన్నర మొదలు పదకొండు గంటల వరుకూ భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేసారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం.ఆ మహా ప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేత  అవుతుందా? ఆ అమృతం , భక్తి అనే దోసిలితో తృప్తి తీర తాగాల్సిందే కానీ కాగితంలో పోసి కట్టగలనా ?    శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణభయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెపుతూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ రెండు కళ్ళు,ఆ మాటలు వినడానికి ఈ రెండు చెవులూ చాలలేదు. వినేవారి యోగ్యత ననుసరించి చెప్పేవారి ఉత్సాహం పెరగటం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాటా విపులంగా రాయాల్సిందే కానీ, ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ళ స్థలం కొంచెం దూరంగా ఉండటం వల్ల అందులోనూ నేను చివర కూర్చుని ఉండటం వల్ల, సరిగా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడ్డది " మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణిగినా అహంస్పురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అందుకే 'నేను' కానీ జడశరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్పురణ  ఎప్పుడూ చెడిపోవనిది దేనికీ చెందనిది, తానుగా ప్రకాశించునది . ఈ శరీరం దహించినా ఇది చెడదు. కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకొంటిని." అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలెన్నో జరిగినవి.ఎన్నెన్ని రత్నాలు, మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడనిపిస్తోంది.  ఎన్నాళ్ళనుంచో నీవు రాయమంటున్నా కూడా లక్ష్యపెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ ! ~సూరినాగమ్మ

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/27/2025, 11:51:21 PM

*భయాందోళనలు ఎలా పోతాయి ?* స్వామి రామా కు పాములంటే విపరీతమైన భయం . హిమాలయాలలో గంగా తీర అరణ్యాలలో నిర్భయం గా పులులు సింహాలమధ్య తిరిగినా పాములంటే భయం ఉండేది . 1939 సెప్టెంబర్ లో రుషీ కేష్ నుంచి వీరభద్ర కు గురువు బెంగాలీ బాబా తో వెడుతూ తెల్లవారుజామునే గంగలో స్నానించి ఒడ్డున ధ్యానమగ్నమయ్యాడు దాదాపు మూడుగంటలు సమాధిలో ఉండిపోయాడు ఉదయం ఏడున్నర అయ్యేసరికి కళ్ళు తెరిచి చూడగా పెద్ద నాగుబాము పడగా విప్పి రెండు అడుగుల దూరం లో స్వామిరామాపై తీవ్ర దృష్టి పెట్టి కనిపించింది .భయపడ్డాడు ఏం చేయాలో తోచక మళ్ళీ ధ్యానం లో పడ్డాడు .మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పాము అక్కడే అదే పొజిషన్ లో ఉంది .ఇక లాభం లేదనుకొని భయపడి పరిగెత్తాడు అదీ వెంటబడి పొదల్లో దూరింది ..గుహకు వెళ్లి గురువుకు చెప్పాడు .ఆయన నవ్వుతూ ”బ్రతికి ఉన్న ఏ జంతువుకైనా ధ్యాన మగ్నమైన వాని ముందు ధ్యానం స్థితిలో ఉండి పోతుంది ”అని సత్యం చెప్పాడు . మరో వింత అనుభవం ఆయనకు ఎదురైంది .గురువు దక్షిణభారత దేశం లో కొంతకాలం గడిపి రమ్మని ఆదేశిస్తే వెళ్లి ఒకరోజు ఒక దేవాలయం కు లో రాత్రి పడుకోవటానికి ఆశ్రయం ఇవ్వమని కోరాడు .అప్పుడు పూజారి ”నువ్వు స్వామీజీవి అయితే ఆశ్రయం ఎందుకు ”?అని అడిగాడు .ఇంతలో ఒక స్త్రీ తన వెంట వస్తే ఉండటానికి చోటు చూపిస్తానన్నది ..ఆమె రామా ను ఆరడుగుల గుడిసె చూపించి ఉండమన్నది .అప్పడు ఆయనవద్ద ఉన్నవి కూర్చోటానికి జింక చర్మం ,ఒక శాలువా ఒక అంగోస్త్రం మాత్రమే ..ఆ గుడిసెలో తలుపులాంటి ఖాళీ నుంచి వెలుగే తప్ప ఏదీ లేదు .కాసేపటికి ఒక నాగుబాము ముందు పాకుతూ కన్పించింది .తర్వాత ప్రక్కన ఒకటి ,మరికాసేపటికి గుడిసె నిండా పాములే పాములు .ఒళ్ళు జలద రించింది స్వామికి .అది సర్ప దేవాలయమేమో నను కున్నాడు ..చాలా భయమేసింది బహుశా ఆ అమ్మాయి తాను నిజమైన స్వామో కాదో పరీక్షకోసం ఈ గుడిసెకు పంపించి ఉంటుంది అనుకున్నాడు ..అప్పటికి రామా పూర్తిగా స్వామి కాలేదు .అప్పుడప్పుడే అభ్యాసం లో ఉన్నాడు . భయపడి పారిపోతే ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలి ?పారిపోతే ఇక ఆఊళ్లో ఏ సాధకుడికి ఎవరూ భిక్ష పెట్టరు .కనుక చావో రేవో పాములమధ్య గుడిసెలోనే ఉండి పోవాలను కొన్నాడు ..తనను ఇక్కడకు తీసుకొచ్చిన ఆవిడ జ్ఞాని కాదు కానీ ధైర్యంగా పాముల గుడిసెలోకి రా గలిగింది .కనుక తానూ అక్కడే పాముల మధ్యనే రాత్రి గడపాలని కొని ఉండి పోయాడు ..అలానే ఉన్నాడు .కానీ తన ధ్యానం మర్చి పోయి పాముల ధ్యానం లో ఉన్నాడు పాములు ఆయన జోలికే రాలేదు . ..తెల్లవారాక బయటికి వెళ్ళాడు ఆయనను పాములు ఏమీ చేయలేదు కానీ భయం మాత్రం పోలేదు .తర్వాత మనసులో వితర్కించుకొన్నాడు .తాను బ్రహ్మ సూత్ర భాష్యం తేలికగా బోధిస్తున్నాడు కానీ మనసులో పిరికి తనం పోలేదు ..ఈ భయం ఎలా ఉందంటే ధ్యానం పూర్తి చేసి కళ్ళు తెరిచి చుట్టూ పాములున్నాయేమో నని వెదికేవాడు .భయాన్ని పోగొట్టుకోవాల్సిందే అనుకున్నాడు ..గురువును చేరి దీనికి మార్గమేమిటో తెలుసుకొందామన్నాడు .ఆయన రామాను చూడగానే ”నీకేమి కావాలో నాకు తెలుసు .నీకు పాములంటే భయం కదా ”అన్నాడు మనసులో మాటకనిపెట్టి .”నీకు భయమని నా కెప్పుడూ చెప్పలేదే అన్నీ నాకు చెప్పేవాడివి దీన్ని ఎందుకు దాచావు ?”అన్నాడు .ఎందుకో కానీ గురువుకు తనకున్న పాముభయం గురించి చెప్పలేదు . అడవిలోకి తీసుకు వెళ్లి ”రేపు ఉదయం నుంచి మనం మౌనం పాటిస్తున్నాం .తెల్లవారు జామున మూడున్నరకే లేచి నువ్వు అడవి ఆకులు పూలు ఏరి తేవాలి .వాటితో మనం ప్రత్యేక పూజ చేద్దాం ”అని చెప్పాడు .అలాగే లేచిచీకటిలోనే అక్కడ పోగుపడిన ఆకులు చూసి వాటిని చేతిలో పట్టుకున్నాడు ఆకులతోపాటు ఒక నాగు పాము చేతికి చుట్టుకు పోయింది .చెమటలుపట్టాయి భయం తో తప్పించుకొనే అవకాశం లేదు .ఇంతలో గురువు చూసి దాన్ని తనదగ్గరకు తీసుకురమ్మన్నాడు ..అసలే వణికి పోతున్నాడు భయం తో .గుర్వాజ్ఞ తో మరీ భయం పెరిగింది ”అది నిన్ను కరవదు తీసుకురా ”అన్నాడు .రామాకు చేతిలో మృత్యువే ఉందనిపించింది నమ్మకం కంటే భయం బలీయమైంది .గురువును చేరగా ”నువ్వు పాములను ఎందుకు ప్రేమించలేవు ?”అని అడిగాడు . ”భయం తో చస్తుంటే ప్రేమ ఏమిటి నా బొంద ”అన్నాడు .భయపెట్టే వారిని మనం ప్రేమించలేము ఆదిలోకసహాజం . అప్పడు గురువు ”ఇది అందమైన జంతువు . అన్ని చోట్ల తిరుగుతుంది .అయినా చూడు అది ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉందొ .ప్రపంచ జీవులలో పాము ఒక్కటే అత్యున్నత స్వచ్ఛమైన జీవి . ”అన్నాడు .అందం సరే ప్రమాదం సంగతి ?”అన్నాడు స్వామిరామా .మనిషి పాముకంటె అతి మురికి ,విష జంతువూ కూడా .ప్రతిక్షణం కోపం పగలతో రగిలి అవతలివారికి హాని చేస్తూ ఉంటాడు .పాము ఆత్మ రక్షణకు మాత్రమే కాటేస్తుంది ..నువ్వు నిద్రలో ఉంటె నీ వ్రేళ్ళు కళ్ళను పొడుస్తాయా ,నీ నాలుకను పళ్ళు కొరుకుతాయా ?లేదే .శరీర భాగాలన్నిటికి ఒక చక్కని అవగాహన ఉంటుంది .అలాగే సకల చరాచరం ఒకటే అన్న భావన కలిగితే ఏ జంతువూ వలనా భయమనేది ఉండదు . ”అన్నాడు గురువు చెప్పిన0తసేపు నాగుపాము స్వామి చేతిలోనే ఉంది క్రమంగా భయం తగ్గింది .మనసు లో ”నేను పామును ఏమీ చేయక పొతే పాము నన్నేం చేస్తుంది ?అనే ఎరుక కలిగింది .అంతే పాము నెమ్మదిగా జారీ ఎటో వెళ్ళిపోయింది .అప్పటి నుంచి పాము అంటే భయం పోయింది .ఏ జంతువైనా తనకు అపకారం జరిగితే తప్ప మీద పడవు .వాల్మీకి ,సెయింట్ ఫ్రాన్సిస్ బుద్ధుడు మొదలైన వారందరూ జీవ ప్రేమికులే ..యోగ సూత్రాలలో మొదటిది అహింస .అహింస అంటే చంపక పోవటం ,హాని చేయకపోవటం ,గాయం చేయకపోవటం.ఆత్మ శక్తికి మించిన బలం లేదు . ”నేను హిమాలయాలలో ,అరణ్యాలలో ఎన్నో చోట్ల తిరిగాను..నాకు తెలిసినంతవరకూ నేను వున్నంతవరకు ఏ సాధువు, యోగి, స్వామిలపై ఏ క్రూర జంతువూ దాడి చేసినట్లు చూడలేదు వినలేదు ఈ మహానుభావులు తమను తాము రక్షించుకోవటానికి ఏ సాధనాలు లేనివారు ..వీరిని హిమపాతాలు,ప్రక్రుతి ప్రళయాలు కూడా ఏమీ చేయలేదు . వారి బలీయమైన ఆత్మ శక్తికి అన్నీ తలవంచుతాయి . ఈ నిర్భయత్వమే వ్యక్తిగత చేతన ను అధిగమించి విశ్వ చేతనలో చేరటానికి దారి చూపిస్తుంది .ఎవరు ఎవరిని చంపుతారు ?ఆత్మ అనంతమైనది .శరీరం ఎప్పుడోఅప్పడు మట్టిలో కలిసిపోయేదే .హిమాలయ యోగులు ఏ శాఖ వారైనా ఈ గొప్ప భావం తోనే జీవించి తరించారు ”అంటాడు స్వామిరామ . స్వామి రామ తారై భవాల్ నుండి నేపాల్ లోని ఖాట్మాండుకు ఒక్కడే నడుచుకుంటూ బయలుదేరాడు ..రోజుకు సుమారు ముప్ఫయి మైళ్ళు నడిచేవాడు .సాయంత్రం సూర్యాస్తమయం కాగానే చితులు పేర్చి మంట వేసుకొని ,ధ్యానం చేసి విశ్రాంతి తీసుకొని, మళ్ళీ తెల్లవారుజామున నాలుగింటికి లేచి నడక సాగించిపది గంటల వరకు నడిచి ఏదో చెట్టుకింద ఆగి మధ్యాహ్నం మళ్ళీ బయల్దేరి సాయ0త్రం ఏడు దాకా నడిచేవాడు .చెప్పులు లేకుండా ఒక దుప్పటి ,పులిచర్మం ,చిన్న కుండలో నీళ్లు ఇవే ఆయన సామాగ్రి ..ఒక రోజు సాయంత్రం ఆరింటికి అలసి పోయి చిన్న గుహలో విశ్రాంతి కి వెళ్ళాడు .అది చీకటి గుయ్యారం .లోపల మూడు పులిపిల్లలు కనిపించాయి అవి పుట్టి 15 రోజులు మాత్రమే అయి ఉంటుంది .అవి స్వామి దగ్గరకు వాళ్ళ అమ్మ ఏమో ననుకొని వచ్చి నాకుతున్నాయి .భయపడకుండా వాటిని మచ్చిక చేసుకున్నాడు .కూర్చోగానే గుహ ద్వారం దగ్గర వాటి తల్లి వచ్చి నుంచుని ఉండటం చూశాడు .మొదట్లో అది లోపలికొచ్చి తనమీద పడి చంపేస్తుందేమో ననుకొన్నాడు .తర్వాత మనసులో ”నేను ఈ పులి కూనలకు ఏఅపకారం చేయలేదు .పులి దారిఇస్తే నేను బయటికి వెళ్ళిపోతాను ”అని అనుకోని దుప్పటి నీళ్లకుండా తీసుకొని లేచి నిలబడ్డాడు .ఈయన్ను చూసిన పులి దారి ఇస్తున్నట్లుగా గుహ ద్వారం నుండి పక్కకు తప్పుకున్నది ..స్వామి రామ గుహ లోంచి బయటికి వచ్చి పదడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే పులి నెమ్మదిగా గుహలోకి ప్రవేశించి పిల్లలను చేరినట్లు గమనించాడు .దీన్ని బట్టి జంతువులూ అతి తేలికగా హింసను భయాన్ని వాసన చూడగలవు .అప్పుడే అవి అతి తీవ్రంగా ఆత్మ రక్షణకు ఎదురు దాడి చేస్తాయి .సాధారణంగా జంతువులు చాలా రక్షణ నిచ్చి సహాయం చేస్తాయి మనుషులు ప్రమాద సమయాలలో ఒకరిని ఒకరు వదిలేసి పారిపోతారు .కానీ జంతువులూ అలా ప్రవర్తించవు .ఆత్మా రక్షణ సకల జీవులకు ఉంటుంది .కానీ మనుషులకంటే జంతువులు ప్రేమకు అంకితమై ఉంటాయి వాటి మిత్రత్వం నమ్మదగినదే .,షరతులు లేనిదే .మానవుడు అలాకాదు -- గబ్బిట దుర్గా ప్రసాద్

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/23/2025, 7:08:42 PM

*అపరోక్షానుభూతి-21* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము* 131) _యేహి వృత్తిం విజానంతి జ్ఞాత్వాపి వర్ణయాతి, మేః తేవై సత్పురుషా ధన్యా వంద్యాస్తే భువనత్రయే॥_ ఈ పరమార్థ వృత్తిని ఎవరు మొదట అవ గాహన చేసుకుని, తరువాత దాన్ని క్రమ క్రమంగా వృద్ధి పొందించు కొంటున్నారో, వారే సత్పురుషులు, ధన్యాత్ములు. అటువంటి వారు మూడు లోకాలలో అందరి చేతా నమస్కరింప తగినవారు. (132) _ఏషాం వృత్తిం సమావృద్ధా పరిపక్వా చసా పునః॥ తేవై సద్బ్రహ్మతాం ప్రాప్తా నేతరే శబ్దవాడిన ||_ ఎవరియందీ పరమార్థ వృత్తి నిలకడగా, ఎప్పుడూ వుంటూ, సమంగా వృద్ధి పొందుతూ పరి పక్వ మౌతుందో అటువంటి మహానుభావులు సదా బ్రహ్మ స్వరూపులే అయి భాసిస్తారు. కాని, కేవలం మాటలు పలికే వాచా వేదాంతులు అటువంటి బ్రహ్మానుభవం పొంద లేరు. 133) _కుశలా బ్రహ్మ వార్తాయాం వృత్తి హీనాః సురాగిణః తేజప్య జ్ఞానతయా నూనం పునరాయాంతి యాంతిచ॥_ బ్రహ్మాను సంధానం చేస్తూ బ్రహ్మానుభవాన్ని పొందే సక్రమమైన సాధన చెయ్యక, కేవలం బ్రహ్మ విద్యని గురించి బాగా వివరిస్తూ నేర్పుగా ఉపన్యా సాలూ, ప్రవచనాలూ చేసే పండితులు, అజ్ఞానులే కనుక, అటువంటివారు మళ్ళీ మళ్ళీ జనన మర ణాల్ని పొందుతూంటారే కాని, మోక్ష పథానికి అర్హులు ఆవరు. 134 _నిమేషార్థం న తిష్ఠంతి వృత్తిం బ్రహ్మమయీం వినా॥ యథా తిష్టన్తి బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకాదయః_|| బ్రహ్మాను సంధాన పరులైన మహనీయులు, బ్రహ్మాది దేవతలు, సనక సనందనాదులు, శుకాదులు, మొదలైనవారిలా ఒక్క అరనిముషమేనా బ్రహ్మాకార వృత్తిని విడిచి ఉండరు. (135) _కార్యే కారణతా యాతా కారణే నహి కార్యతా। కారణత్వం తతో గచ్ఛేత్ కార్యభావే విచారతః_ కార్యమందు కారణం యొక్క స్వభావం కనిపిస్తుంది. కాని కారణం యందు కార్యత్వం కనిపించదు. కాబట్టి తత్వవిచారం వల్ల కార్యం లేన ప్పుడు కారణం అదృశ్యమౌతుంది. (136) _అథ శుద్ధం భవేద్వస్తు యద్వై వాచామ గోచరమ్! ద్రవ్యం మృద్ధబేనైవ దృష్టాంతేన పునః పునః॥_ పైన తెలియజేసిన ప్రకారం కారణత్వం నశించినంతనే, శుద్ధము, అవాజ్మానస గోచరము అయిన సద్వస్తువు (బ్రహ్మము) కార్య కారణ విలక్షణమై భాసిస్తుంది. ఈ సత్యస్వరూప పర బ్రహ్మతత్వాన్ని, మృద్ఘట దృష్టాంతాన్ని దృష్టిలో వుంచుకొని, పదే పదే దృఢంగా అవగాహన చేసుకోవాలి.(సశేషం)

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/28/2025, 12:17:24 PM

*బంగారం లాంటి మనసు..* పరమాచార్య వారు పదమూడు సంవత్సరాల వయస్సులోనే సన్యసించారు. వారు వ్యాఖ్యాత పరీక్ష పూర్తి చెయ్యటం కోసం తిరువానై మఠం లో బస చేసారు.అక్కడ విశేషం గా విధ్వత్ సభలు జరిగేవి. పండితులు, విద్వాంసులు, వేద విదులు అక్కడ చర్చలు జరిపేవారు. అనేక శాస్ట్రాలలో నిష్ణాతులు ఎంతో కఠిన మైన ప్రశ్నలకు సరియైన జవాబులు చెప్పి సందేహ నివృత్తి చేసేవారు. వారందరిని చూసి స్వామి వారు ఎంతో ఆనంద భరితులు అయ్యేవారు. స్వామి వారికి ఒక్క కొరవ ఉండేది. వారందరికి కనకాభిషేకం చెయ్యాలని కోరుకునేవారు. కానీ ఆ పండితులు మాత్రం స్వామి వారి బంగారు చేతులతో అక్షతలు ఇచ్చి దీవిస్తే 'చాలు ', అని మాత్రమే కోరుకునేవారు. స్వామి వారి సంకల్పాన్ని మఠం యొక్క ఆర్ధిక పరిస్థితి ఆపలేక పోయింది. పురాతనంగా మఠం లో ఒక బంగారు కిరీటం ఉండేది. స్వామి వారి ఆదేశాల మేరకు ఆ కిరీటాన్ని కరిగించి 500 కర్ణాభరణాలు చేయించారు. పండితుల విధ్వత్ ను బట్టి కర్ణాభరణాలను బహుకరించ దలచి వారి వారి జ్ఞానాన్ని బట్టి స్వామి వారు వాటిని బహుకరించి తమ బంగారు మనస్సును చాటుకున్నారు. *** యజుర్వేదాంతర్గత నమకం లో "నమో హిరణ్య బాహవే"అని మహాదేవుణ్ణి కీర్తించే మంత్రం ఉన్నది. అంటే బంగారు మయమైన బాహువులు కలవాడు. అని స్టూలార్ధం. స్వామి వారు అపర శంకరులు కాబట్టి వారి మనస్సు, అనుగ్రహించే చేతులు బంగారు మయమే.~Gurucharan Das

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/29/2025, 12:41:30 AM

*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో మా అనుభవాలు..* *ఫలించిన కోరికలు..* 2004 వ సంవత్సరం సంక్రాంతి పండుగ కు రెండురోజుల ముందు మా నాన్నగారు శ్రీ పవని శ్రీధరరావు గారికి పక్షవాతం జబ్బు చేసింది..హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి, మరో పదిరోజులకు కొద్దిగా స్వస్థత చేకూరిన తరువాత మొగలిచెర్ల కు తీసుకొని వచ్చాము..నాన్నగారికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించి, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర నిర్వహణ నన్ను చూసుకోమని అమ్మ, అన్నయ్య ఇద్దరూ చెప్పారు..సరే అన్నాను.. ఒక నెలరోజులు గడచిన తరువాత, ఒక ఆదివారం ఉదయం 11 గంటల వేళ, సుమారు మా నాన్నగారి వయసున్న ఒక పెద్దమనిషి శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."ఇక్కడ శ్రీధరరావు కుమారుడు ప్రసాద్ అంటే ఎవరు?" అంటూ మా సిబ్బందిని అడుగుతున్నారు..మా వాళ్ళు నా వైపు చూపించారు..నేరుగా నేను కూర్చున్న చోటికి వచ్చారు..నేను లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేసాను..సరే అన్నట్లు తలవూపి..ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.. "నా పేరు జగన్నాధ రావు..నెల్లూరు లో మీ నాన్న VR కాలేజీ లో చదువుకునే రోజుల్లో నేనూ అక్కడే చదువుకున్నాను..స్నేహితంగా వుండేవాళ్ళము..చదువు అయిన తరువాత మీ నాన్న టీచర్ ఉద్యోగం కొన్నాళ్ళు చేశారు..నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం మద్రాస్ లో వచ్చింది..అక్కడికి వెళ్ళిపోయాను..నేను నెల్లూరు వచ్చినప్పుడు, ఇద్దరమూ కలిసే వాళ్ళము..ఉత్తరాల ద్వారా బాగా సాన్నిహిత్యం ఉండేది మాకు..స్వామివారి సంగతి కూడా వ్రాసారు..ఒకసారి మాలకొండకు వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కూడా మీ అమ్మా నాన్న ల పుణ్యమా అని నాకు కలిగింది..మీ నాన్న కు ఆరోగ్యం బాగాలేదని తెలిసి, చూసిపోదామని వచ్చాను.." అన్నారు..వారిని నేనెప్పుడూ చూసి ఉండలేదు కనుక, ఆయన చెప్పిన మాటలు వింటూ వున్నాను.. "స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లి రండి.." అని చెప్పాను..మందిరం లోపలికి వెళ్లి, సమాధి దర్శనం చేసుకొని, నమస్కారం చేసుకున్నారు..స్వామివారి సమాధి వద్దే నిలబడి, నన్ను కూడా లోపలికి రమ్మని అర్చక స్వామి ద్వారా చెప్పిపంపారు..నేనూ వెళ్ళాను..స్వామివారు ఏ విధంగా సిద్ధిపొందినదీ..స్వామివారి దేహాన్ని ఏ వైపు లోపల కూర్చోబెట్టిందీ..అన్నీ అడిగి తెలుసుకున్నారు.."ప్రసాద్..ఇక్కడ మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటే జరుగుతుందా.."? అన్నారు.. "ముందు మీరు స్వామివారి మీద భక్తి విశ్వాసాలతో వుండండి..మీ కోరిక తప్పక నెరవేరుతుంది..సమయం మాత్రం నేను చెప్పలేను..నా స్వీయ అనుభవాలు కూడా ఉన్నాయి.." అని చెప్పాను.."అలాగా.." అన్నారు..నేను ఇవతలికి వచ్చేసాను..వారు మరో ఐదు నిమిషాల పాటు శ్రీ స్వామివారి సమాధి వద్దే గడిపి ఇవతలికి వచ్చేసారు..కొద్దిసేపు నాతో ఇతరత్రా ముచ్చట్లు మాట్లాడి, భోజనం చేసి..మధ్యాహ్నం బస్ కు వెళ్లిపోయారు.. మరో మూడు నెలల తరువాత..ఆదివారం నాడే..సరిగ్గా అంతకుముందు లాగానే ఉదయం 11 గంటల వేళ, జగన్నాధ రావుగారు మందిరం లోకి వచ్చారు..ఈసారి నేరుగా నా వద్దకు వచ్చి, "ప్రసాద్..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళొస్తానయ్యా.." అన్నారు..సరే అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, ఐదు నిమిషాల పాటు నిలబడి మౌనంగా కళ్ళుమూసుకుని ప్రార్ధన చేసుకొని ఇవతలికి వచ్చారు..నా వద్దకు వచ్చి, ప్రక్కనే కూర్చుని.."మా అబ్బాయికి వివాహం జరిగి 11 సంవత్సరాలు గడిచాయి..సంతానం లేదు..వాడి ఉద్యోగం కూడా అస్సాం లో..నేను స్వామివారిని రెండే కోరికలు కోరాను..మావాడికి సంతాన ప్రాప్తి కలుగచేయమనీ..ఉద్యోగం ఇటువైపు కు బదిలీ అయ్యేటట్లు చూడమనీ..కోరుకున్నాను..ఇదేమాట నేను వెళుతూ వెళుతూ మీ తల్లిదండ్రుల కూ చెప్పుకొని వెళ్ళాను..ఇద్దరూ ఆశీర్వదించారు..ఈ దత్తాత్రేయ స్వామిని నమ్ముకొని ఉండమని మీ అమ్మగారు నాకు చెప్పి, స్వామివారి విభూతి ని పొట్లం కట్టించి..మా కొడుకు, కోడలు కు ఇవ్వమని నా చేతికి ఇచ్చారు..నేను వాళ్లకు పోస్టులో పంపాను..సరిగ్గా వారం క్రితం మా అబ్బాయి వద్దనుంచి ఉత్తరం వచ్చింది..కోడలు గర్భవతి అయిందని..వాడికి మద్రాస్ కు బదిలీ అయిందనీ..ఇంకొక పదిరోజుల్లో వస్తున్నాననీ వ్రాశాడు..మొన్న ఫోన్ కూడా చేసాడు..క్షణం ఆలస్యం చేయకుండా నేరుగా మొగలిచెర్ల వచ్చి, మీ అమ్మా నాన్న గార్ల కు విషయం చెప్పాను..వెంటనే స్వామివారి మందిరానికి వెళ్లి, సమాధి వద్ద కృతజ్ఞతలు చెప్పుకోమని ఇద్దరూ చెప్పారు..పరుగున వచ్చాను..సందేహం లేదు..స్వామివారు మహిమాన్వితుడు..ఆయన్ను ప్రత్యక్షంగా సేవించుకున్న మీ తల్లిదండ్రులు ధన్యులు..నీకూ ఈ స్వామిని సేవించుకునే అదృష్టం కలిగింది నాయనా..నమ్ముకొని ఉండు.." అంటూ ఉద్వేగంతో చెప్పారు..ఆరోజు అక్కడే నిద్ర చేసి..ప్రక్కరోజు పొద్దున్నే బస్ కు వెళ్లిపోయారు.. శ్రీ జగన్నాధ రావు గారు 2014 లో తాను మరణించేదాకా..ప్రతి ఆరు నెలలకు కుటుంబ సమేతంగా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వస్తూనే ఉండేవారు..శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా చూడడమే కాదు, స్వామివారి కృపను కూడా పొందిన ధన్యజీవి జగన్నాధరావు గారు. సర్వం.. శ్రీ దత్తకృప! ~పవని నాగేంద్ర ప్రసాద్..

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/28/2025, 8:43:07 PM

*రమణాశ్రమ‌‌‌ లేఖలు 3* (23_11_45) *ఉమా మహేశుల కలహం*   ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాధులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో కానీ ఒక వృధ్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు ( ఆమె కీలూరు అగ్రహారం లో భగవానునికి అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ల భాగవతార్ చెల్లెలని తరువాత తెలిసింది). ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన సాక్ష్యాలు కొన్ని పొట్లం గట్టి 'నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను. ' అని ప్రేమతో ఇచ్చింది. ' నాయనా , ఇలా ఇక్కడున్నావా ? బంగారం వంటి శరీరమే, గుడ్డ అయినా కప్పుకోవే' అనేది" అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెపుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. కంఠం గద్గదిక  వహించింది. ఆ దృశ్యం చూస్తే ' జ్ఞానుల హృదయం వెన్న వంటిదని,పూర్ణ ప్రేమయే జ్ఞానమని ' అనెడి పెద్ధల వొక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాటరాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు.ప్రేమపూరితమైన సంఘటనలు జరిగినా భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివినా భగవంతులిట్లా ప్రేమ రసభరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా ప్రేమ, భక్తి,జ్ఞానరూపాంతరాలన్న భావం ధృడపడుతున్నది. దాదాపు ఒక వారం క్రిందట హిందూసుందరి పత్రికలో 'పాచికలు' అనే కధ వచ్చింది. అది స్కాంద పురాణంలో భాగం. ఒకప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట. "లక్ష్మీ విష్ణువులు పాచికలాడుతారే , మీరెందుకు ఆడరు? " అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందరపెట్టగా  ఆడి పరమేశ్వరుడు ఓడుటయు ,పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి,గేలి సేయుటయు , ఆదిగా గల వృత్తాంతం అది. భగవానులది చదివి భక్తి పూరిత హృదయులై  "ఈ కధ చదివేరా "? అని నన్నడిగారు. చదివాననగానే  సంక్రాంతికి  ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయే' నని డగ్గుత్తిక వహించారు భగవాన్ .ఈ తిరువూడల్ ఉత్సవంలో ఉమామహేశుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వడమే.అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుని తానొక్కడే గిరిప్రదక్షిణం వస్తాడీశ్వరుడు . ఆశ్రమం వద్దకు వచ్ఛేసరికి అర్థరాత్రి అవుతుంది. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళటం ,ఉణ్ణాముల తీర్ధం దాటిన తరువాత దొంగలదోపు మొదలగునవి జరుగుతవి. ఈ కధలన్నీ ఆయా సందర్భాల్లో భగవాన్ సెలవిస్తూ భక్తిపూరితులవుతారు.   అరుణాచలేశుని ఏటేటా కల్యాణోత్సవం  జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే , వారు హర్షంతో  " అప్పకు అమ్మకు కల్యాణం "  అని అనటం కద్దు. మహిత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా.ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలను ఏకంచేసే అఖండ విజ్ఞానరసమే రూపం ధరించినపుడు ఇక చెప్పవలసింది ఏముంది ?                     ___ సూరి నాగమ్మ

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/25/2025, 2:24:42 AM

*అపరోక్షానుభూతి-22* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము* (137) _అనేనైవ ప్రకారేణ వృత్తిం బ్రహ్మాత్మికా భవేత్| ఉదేతి శుద్ధ చిత్తానాం వృత్తి జ్ఞానం తతః పరమ్॥_ ఈ ప్రకారంగా చేసే తత్వ విచార సాధన వల్ల, బ్రహ్మాను సంధానం సంప్రాప్తమయే సమర్థ వంతమైన వృత్తి కలుగుతుంది. ఇలా పాధన కొన సాగిస్తే, శుద్ధ చిత్తులైన సాధక మహాశయులకువృత్తి జ్ఞానం (బ్రహ్మానుభవ జ్ఞానం) ఉదయిస్తుంది. (138) _కారణం వ్యతిరేకేణ పుమనాదౌ విలోకయేత్। అన్యయేన పునః తద్ది కార్యే నిత్యం ప్రపశ్యతి॥_ ఇలాచేసే తత్వ విచార సాధనలో, ముందు కారణాల్ని వ్యతిరేక భావంతో అవగాహన చేసు కోవాలి. తరువాత దాన్ని అన్వయ దృష్టితో గ్రహించుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ఎల్లప్పుడూ కారణం కార్యంలో అనుభూతమై వుండేదే అని తెలుసుకుంటాడు. (139) _కార్యేహి కారణం పశ్యేత్ పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం తతో గచ్చే దవశిష్టం భవేన్మునిః॥_ సాధకుడు ఎల్లప్పుడూ కార్యంలో కారణాన్నే చూస్తూ, దానిమీదే దృష్టిని వుంచుతూ కార్యాన్ని పూర్తిగా విసర్జించాలి. ఇలా కార్యాన్నంతటినీ విడిచి పెడితే, కారణత్వం కూడా అదృశ్యమై ఇక శేషించి వుండే తానే బ్రహ్మస్వరూపుడై భాసిస్తాడు. (140) _భావితం తీవ్ర వేగేన యద్వసు నిశ్చయాత్మనా! పుమాన్ తద్ది భవేత్ శీఘ్రం జ్ఞేయం భ్రమర కీటవత్ ॥_ నిశ్చయమైన గట్టి నమ్మకం కలిగిన సాధకుడు తీవ్రతరమైన వేగంతో ఏ వస్తువును నిలకడగా భావిస్తూంటాడో, శీఘ్రకాలంలో తానే ఆ జ్ఞేయ వస్తువు అవుతాడు. భ్రమర కీటక న్యాయం దీనికి దృష్టాంతం. (భ్రమరము ఒక రకమైన కీటకాన్ని తెచ్చి తన గూటిలో ఉంచి, దాని చుట్టూ రొద చేస్తూంటే, ఆ కీటకం భయంతో నిరంతరం ఆ భ్రమరాన్నే భావిస్తూ. చివరికి అది భ్రమరంగా మారుతుంది.) (141) _అదృశ్యం భావరూపం చ సర్వమేవ చి దాత్మకం | సావధానతయా నిత్యం స్వాత్మానం భావయేత్ బుధః ॥_ వివేకమతులైన సాధక మహాశయులు ద్రష్ట, దృక్కు, దృశ్యము అనే మూడింటితో కూడిన ఈ గోచరాగోచర సర్వ జగత్తూ ఆత్మ స్వరూప మేనని సావధాన చిత్తంతో జాగ్రత్తగా నిత్యమూ భావించు కొనుచూ ధ్యాన నిమగ్నులై వుండాలి. (142) _దృశ్యం హ్యాదృశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్ | విద్వాన్నిత్య సుఖే తిషేద్ధియా చిద్ర సపూర్ణ యా ॥_ ఇంద్రియాలకు, మనస్సుకు గోచరించే దృశ్య ప్రపంచం యొక్క నామ రూపాదులన్నింటినీ మిథ్యాగా విస్మరిస్తూ, అదంతా ఆకార సూన్యమైన అద్వయానంద బ్రహ్మ స్వరూపమేనని నిశ్చయించు కొనుచూ, ధ్యాన నిష్ఠలో నిమగ్నుడై వుండే సాధక మాహానుభావుడు నిత్యమూ మహా సుఖసంపన్న మైన పరిపూర్ణ బ్రహ్మానందానుభూతితో ఓలలాడుతూ ఉండగలడు.(సశేషం)

Post image
Image
అంతర్యామి
అంతర్యామి
5/22/2025, 10:13:57 PM

*అపరోక్షానుభూతి-20* *శంకర భగవత్పాద విరచిత* *బ్రహ్మవిద్యా విధానము* 125) _ఇమం చాకృతి మానందం తావత్ సాధు సమభ్య సేత్ వశ్యో యావత్ క్షణాత్ పుంసః ప్రయుక్తః సక్ భవేత్ స్వయమ్||_ స్వయం స్వభావ సిద్ధమైన ఈ ఆనందాను భూతిని కలుగజేసే, పదిహేను అంగాలుకల ఈ నిధిధ్యాస అనే స్వస్వరూపాను సంధానమైన సాధ నను అభ్యసిస్తూ, క్రమేణా తాను తలచిన క్షణంలో ఆ ఆనందం తనకు స్వయం స్ఫురణమై ప్రస్ఫుటంగా అనుభూతి అయేవరకూ జాగ్రత్తగా అభ్యసిస్తుండాలి 126 _తతః సాధన నిర్ముక్తః సిద్దో భవతి యోగిరాట్ | తత్ స్వరూపం న చైతస్య విషయో మనసో గిరామ్ ॥_ అలా సాధన చేసి సిద్ధి పొందడం వల్ల యోగు లలో అత్యంత శ్రేష్ఠుడైన యోగిరాజు, ఇక తాను చేయ వలసిన సాధనలేవీ లేనివాడై సాధనా నిర్ముక్తుడౌతు న్నాడు. తానే బ్రహ్మ స్వరూపుడై వుండడం వల్ల, మనస్సుకు, వాక్కుకు అవిషయుడై, ఎలాటి సాధన కర్తవ్యం లేనివాడై వుంటాడు. (127) (128) _సమాధౌ క్రియమాణేతు విఘ్నా న్యాయాంతివై బలాత్! అనుసంధాన రాహిత్యం అలస్యం భోగలాలసమ్॥_ _లయస్తమశ్చ విశేపో రసాస్వాదశ్చ శూన్యతా। ఏవం యద్విఘ్న బాహుల్యం త్యాజ్యం బ్రహ్మవిదా శనైః॥_ సమాధిస్థితి పొందడానికి సాధనా అభ్యాసం చేసే సమయంలో బలాత్కారంగా అనేక అవరోధాలు, విఘ్నాలు వస్తూంటాయి. అవేవంటే: తత్వ విచారణ తొలగిపోయి మనస్సు వేరే లౌకిక విషయాలలో తగు ల్కొనటం, సోమరితనం, భోగాను భవాలను గూర్చిన చింతన, నిద్ర, సాధనమీద ఉత్సాహం క్షీణించి మందబుద్ధికలగడం. ఏదిచేయ్యాలో, చెయ్య కూడదో తెలియకపోవడం, లౌకిక విషయానుభవాల మీద ఆకాంక్ష, శూన్యత్వం మొదలైనవి. బ్రహ్మజ్ఞా నాన్ని సత్వరంగా పొందాలని కోరికతోవున్న ముముక్షువు ఇలాంటి అనేక రకాలైన అవరోధాల్నీ, విఘ్నాల్నీ నెమ్మనెమ్మదిగా తొలగించు కోవాలి, (129) _భావ వృత్యాహి భావత్వం శూన్యవృత్యాహి శూన్యత్వ। బ్రహ్మ వృత్యాహి పూర్ణత్వం తథా పూర్ణత్వ మభ్య సేత్॥_ మనస్సు దేన్ని గురించి భావిస్తూంటుందో దాని వృత్తిలో భావలయత్వం పొందుతుంది, అలాగే దేనినీ భావించక, శూన్యవృత్తితో వుంటే, శూన్యత్వంతో వుఁటుంది. నిరంతరం బ్రహ్మనిష్ఠలోవుంటే, పూర్ణత్వం సిద్ధించి బ్రహ్మానుభూతి పొందుతుంది. కనుక, ఎల్ల ప్పుడూ పూర్ణత్వమనే బ్రహ్మానుభూతికోసం సక్రమ సాధనాభ్యాసం చేస్తూ వుండాలి. (130) _యేహి వృత్తిం జహత్యేనాం బ్రహ్మాఖ్యాం పావనీంపరామ్ వృదైవ తేతు జీవంతీ పశుభిశ్చ సమా నరాః॥_ అలాకాక, పావనమూ, పరమూ అయిన బ్రహ్మ భావాన్ని విడిచి, పూర్ణత్వం కోసం ఎలాంటి సాధనా చెయ్యని వాళ్ళు, వాళ్ళకి ప్రాప్తించిన, అతి దుర్లభమైన మానవజన్మనీ వ్యర్థం చేసుకున్న వాళ్ళై, కేవలం పశు సమానులే అవుతారు.(సశేషం)

Post image
Image
Link copied to clipboard!