అంతర్యామి
అంతర్యామి
February 9, 2025 at 03:24 AM
*ప్రేమావతారి శ్రీ సత్యసాయి* _*ఆదర్శ భట్ దంపతులు*_ ప్రపంచవ్యాప్తంగా ఈ శతాబ్దంలో ఒక గొప్ప యూరాలజీ సర్జన్ గా ప్రఖ్యాతి గాంచి 30 సం||లు అనుభవం గడించి, వెల్లూరు క్రిస్టియన్ హాస్పిటల్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటుగా డా॥ హెచ్.ఎస్. భట్ 1975లో పదవీ విరమణ చేశారు. ఆయన సతీమణి డా|| ప్రేమ భట్ మైక్రోబయోలజిస్టుగా ప్రసిద్ది చెందింది. 1978లో ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ లో పాల్గొని తిరిగి వచ్చిన తరువాత కాళ్ళ సలుపులతో ప్రారంభమైన వింత వ్యాధికి గురై, చివరకు నడుము క్రింద నుండి అరికాళ్ళవరకు పక్షవాతం సంభవించింది. ఎందరో సుప్రసిద్ధ వైద్యులు ఆమెను పరీక్ష చేసినా ఆ వ్యాధి అంతుబట్టలేదు, చికిత్సకి లొంగలేదు. ఆ సమయంలో భగవాన్ వైట్ ఫీల్డులో ఉండగా డా|| భట్ స్వామిని దర్శించి తన భార్య పరిస్థితి విన్నవించేరు. స్వామి స్వామిచిత్రమున్న ఒక వెండి లాకెట్ ను, విభూతిని సృష్టించి ఇచ్చి, “ఏమీ భయం లేదు. మూడు రోజుల్లో ఆమె తనంతకు తాను లేచి నిలబడగలుగుతుంది, రెండు నెలల్లో డ్యూటీలో జాయిన్ అవుతుంది” అని అభయమిచ్చి పంపేరు. సరిగ్గా స్వామి చెప్పిన గడువులో ఆమె సంపూర్ణ స్వస్థత పొంది తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయింది. 1990లో ఆ దంపతులిద్దరూ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరి 20 సంవత్సరాలు తమ వైద్యానుభవంతోపాటు స్వామియొక్క అద్భుత చికిత్సా విధానాలలో విజయవంతంగా వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఎందరో జూనియర్ డాక్టర్లకు శిక్షణ ఇచ్చేరు. 2009లో ప్రేమ భట్ గారు, 2010లో హెచ్.ఎస్. భట్ గారు అనాయాస మరణం పొందేరు.
Image from అంతర్యామి: *ప్రేమావతారి శ్రీ సత్యసాయి*   _*ఆదర్శ భట్ దంపతులు*_  ప్రపంచవ్యాప్తంగా ...
🙏 2

Comments