
Keshaboina Sridhar BJP
February 12, 2025 at 07:02 AM
11-02-1968 పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి
ఏకాత్మ మానవతా దర్శనం" ప్రవక్త, (మానవులందరిలో ఒకే ఆత్మను దర్శించిన వారు) భారతీయ జనసంఘ్ అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులూ అయిన శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారు పరమపదించిన రోజున వారి దివ్యాత్మకు అంజలి ఘటిస్తూ..
ఇది 11-02-1968 రోజున రైలులో కిరాయి హంతకులు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారిని దారుణంగా హత్యచేసి మొఘల్‌సరాయ్ జంక్షన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 673/1276 వద్ద ట్రాక్‌పై పడేసిపోయారు.... ఈ పిల్లర్ దీన్‌దయాళ్ గారి దారుణ హత్యకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేటికీ అలాగే ఉంది...ఇలాంటి ధీరుల దీనమైనా గాథలను చరిత్రలో లేకుండా చేశారు
1968వ సం. దీనదయాల్ ఉపాధ్యాయ గారి మరణానంతరం వారి రచనలు మరియు జీవితం అధ్యయనం చేయడానికి వచ్చిన విదేశీ జర్నలిస్టులు వారు నివసించిన ప్రాంతాలలో విషయ సేకరణలో భాగంగా ఢిల్లీలోని అప్పటి వారి గదిలోకి వెళ్లి, వారు ఉపయోగించిన వస్తువులు, కళ్లద్దాలు, రిస్ట్ వాచ్, బట్టలు మొదలైనవి పరిశీలిస్తూ..., వారి బీరువా అందులో మిగతా బట్టలు ఏవి అని.., ముఖ్యంగా వారు ధరించే 'కోటు' ఏది అని అడిగారు...? అంతేకాకుండా వారు నిద్రించే మంచం ఏది అని కూడా అడిగారు....,
ఆ సమయంలో అక్కడే ఉన్న అటల్ బిహారీ వాజపేయి గారు సమాధానం ఇస్తూ దీనదయాల్ గారికి సంఘ గణవేష తో పాటు ఉన్న మూడు జతల బట్టలు (శరీరంపై ఒకటి, ఉతికి ఆరవేసినది రెండవది, రేపటి కోసం మడత పెట్టి ఉంచిన జత మూడవది.) తనతో పాటు తీసుకెళ్లారనీ చెప్పి వారు చనిపోయిన సమయంలో వారి చేతి బ్రీఫ్ కేసులో ఇవన్నీ ఉన్నాయని వివరించారు..., ఇక వారి కోటు అంటారా... ఈ గదిలో ఉండే ముగ్గురు అఖిల భారతీయ అధికారులలో ఎవరు ఉపన్యాసానికి వెళితే వారే ధరించి వెళ్తుంటారని చెప్పారు ఈరోజు మరొక అఖిల భారతీయ అధికారి ధర్మవీర్ గారు ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తూ ఆ కోటు ధరించి వెళ్లారని చెప్పారు.
ముగ్గురు ఉన్న ఆ గదిలో రెండు చెక్కలతో చేసిన బల్లలు పడక టేబుల్స్ ఉండడాన్ని వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుండగా ఈ రెండింటి పై ఎవరు ముందుగా గదికి చేరుకుంటే వాళ్లు నిద్రిస్తారని, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అదిగో ఆ మూలనున్న చాప వేసుకుని పడుకుంటారని చెప్పడంతోని విని.., అవాక్కయ్యారు.
అప్పటికే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండీ మరికొన్ని రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షంగా, కేంద్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షుడు కార్యదర్శి ఆ రకంగా సాధారణ జీవితాన్ని గడపడం చూసి ఆశ్చర్యపోవడం విలేకరుల వంతయ్యింది.
ఆ గదిలో టీ చేసుకోవడానికి తప్ప భోజనానికై వంటచేసు కోవడానికి వస్తువులు లేని విషయాన్ని కూడా వాళ్ళు గమనించారు.
కార్యకర్తల ఇళ్లలోనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకులు భోజనం ఏర్పాటు ఉంటుంది అని అప్పుడే వారికి తెలిసింది
(రైలులో ప్రయాణం చేస్తున్న శ్రీ దీనదయాల్ ఉపాధ్యాయ గారిని ఉత్తరప్రదేశ్ లోని, మొగల్ సరాయ్ అనే చోట తమ దుష్ట పరిపాలనకు అడ్డు తగులుతున్నారని నాటి పాలకులు దారుణంగా హత్య చేయించారు.)
ఆ మహానుబావునికి వర్ధంతి నివాళులు
