
Keshaboina Sridhar BJP
February 12, 2025 at 06:05 PM
సంస్కృతం భారతీయ సంస్కృతి ప్రాథమిక మూలం
తలా తోకలేని ద్రవిడ వాదాన్ని పట్టుకొని వేళ్లాడే డీఎంకే నాయకులు సంస్కృతాన్ని వ్యతిరేకించడం కొత్తేమీ కాదు. వీళ్ల నాయకుల పేర్లేమో.. కరుణానిధి, దయానిధి, ఉదయనిధి.. ఈ పార్టీ ఛానళ్ల పేరు సూర్య, ఉదయ, ఆదిత్య, తేజ.. ఇవన్నీ ఏ భాషవో సన్ నెట్వర్క్ యజమాని, డీఎంకే ఎంపీ దయానిధి మారీచు వారే చెప్పాలి.
తాజాగా లోక్‌సభ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సంస్కృతంలోకి అనువదించడంపై దయానిధి మారన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో కేవలం 73వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారని తేలింది. సంస్కృతం ఎవరికీ అర్థం కాదు. ఇది కేవలం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో చేస్తున్న పని. సంస్కృతంలోకి అనువదించడం వల్ల ప్రజలు కష్టపడి కడుతున్న పన్నులు వృథా అవుతున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా స్పందించారు. ‘లోక్‌సభలో కేవలం సంస్కృతమే కాదు హిందీ సహా పలు భాషల్లో అనువాదం జరుగుతోంది. మీ సమస్య ఏంటో అర్థం కావడం లేదు. మీరు ఏ దేశంలో నివసిస్తున్నారు? ఇది భారతదేశం. భారతదేశ ప్రాథమిక భాష సంస్కృతం’ అని కుండబద్దలు కొట్టారు. బోడో, డోగ్రి, మైథిలి, మణిపురి, సంస్కృతం, ఉర్దూ భాషల్లో కూడా ఏకకాలంలో అనువాదం జరుగుతోందని స్పష్టం చేశారు.
దయానిధి మారన్ భారతీయ భాషల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారుని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. తాము అన్ని భాషలనూ గౌరవిస్తామని, కానీ సంస్కృతంపై అనుచిత వ్యాఖ్యలు మాత్రం సరికావని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు.
భారతదేశానికి సంస్కృతం ఒక మూలస్తంభం. సంస్కృతాన్ని వ్యతిరేకించడం అంటే భారతీయ సంస్కృతిని వ్యతిరేకించినట్లే. సంస్కృత భాషను అవహేళన చేయడం తగదు!
- కేశబోయిన శ్రీధర్
జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ BJP OBC మోర్చా
