Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
February 16, 2025 at 07:15 AM
హృదయ విదారక ఘటన ఆధార్ కార్డు లేదని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా మహిళను బయటికి గెంటేయడం తీవ్రంగా ఖండించదగినది. మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లి చెందిన ప్రమీల ఇప్పటికే భర్త, కుమారుడిని కోల్పోయి దయనీయ స్థితిలో ఉంది. హైదరాబాద్ వచ్చిన ఆమె అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉండగా, ఆసుపత్రి సిబ్బంది కనీస మానవత్వం లేకుండా వైద్యం నిరాకరించడం బాధాకరం. తన తల్లిని వడిలో పెట్టుకుని చిన్నారి అనూష ఆసరా కోసం ఎదురుచూసే ఈ దృశ్యం మనసును కలిచివేస్తోంది. బాధితురాలికి తక్షణ వైద్యం అందించడంతో పాటు, ఇటువంటి అమానవీయ ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలుపుతూ, ప్రమీల కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. • కేశబోయిన శ్రీధర్ హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ #osmaniahospital #justiceforprameela #healthcareforall #humanityfirst
Image from Keshaboina Sridhar BJP : హృదయ విదారక ఘటన  ఆధార్ కార్డు లేదని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది వైద్యం...
😢 1

Comments