Chunduri Ravanna Connects
February 16, 2025 at 02:24 PM
ఈ రోజు ప్రకాశం జిల్లా వైయస్‌ఆర్‌సిపి పార్టీ కార్యాలయంలో జిల్లా వైయస్‌ఆర్‌సిపి లీగల్ సెల్ ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జ్ శ్రీ చుండూరి రవి బాబు గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ గారు, ప్రవీణ్ గారు, బోట్లా సుబ్బారావు గారు, అలాగే జిల్లా స్థాయి న్యాయవాదులు, ఒంగోలు నియోజకవర్గానికి చెందిన వైయస్‌ఆర్‌సిపి లాయర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అందరితో పరిచయం ఏర్పరుచుకుంటూ వారికీ ధన్యవాదాలు తెలియజేశారు. చుండూరి రవి బాబు గారు ప్రసంగిస్తూ, కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలపై జరుగుతున్న అక్రమ దాడులు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదు అవుతున్న అక్రమ కేసులను వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో లీగల్ సెల్ కీలక భూమిక పోషించాలని, పార్టీ కార్యకర్తలకు న్యాయ పరంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో లీగల్ సెల్ మరింత ప్రభావవంతంగా పనిచేసి, పార్టీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు.
👏
🙏
2