Dev Tv
                                
                            
                            
                    
                                
                                
                                February 25, 2025 at 10:47 AM
                               
                            
                        
                            *రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలివీస్తోంది – కేటీఆర్*
తెలంగాణ ఫిబ్రవరి 25,2025: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలివీస్తున్నదని కేటీఆర్ అన్నారు. కొడంగల్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని, 14 నెలల్లో కాంగ్రెస్‌పై రైతుల మధ్య వ్యతిరేకత పెరిగిందని చెప్పారు.
రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా, కాంగ్రెస్ నాయకులు పట్టించుకోడంలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. SLBC టన్నెల్‌లో 8 మంది చిక్కుకున్నా, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం పై ఆయన విమర్శలు చేశారు.
అలాగే, సీఎం రేవంత్ "నీరో చక్రవర్తి" లా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌పై కోపంతో కాంగ్రెస్ తమ కరవు తెచ్చిందని చెప్పారు.
రేవంత్‌కు బీజేపీ రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. మోదీ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్ చివరగా, కాంగ్రెస్, BJPలు BRS పార్టీని ఖతం చేయాలని చూస్తున్నాయని, అందులో కొంతవరకు సక్సెస్ అయినట్టు తెలిపారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday