
Dev Tv
175 subscribers
About Dev Tv
*Dev Tv నిష్పక్షపాతంగా, సూటిగా సుత్తి లేకుండా, రోజంతా ఒకే వార్తను తిరిగేసి చెప్తూ విసిగించకుండా, ముఖ్యమైన వార్తలు షార్ట్ గా మీకు అందిస్తుంది. భవిష్యత్తులో వార్తలతో పాటు మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను అందించడమే మా లక్ష్యం.* Dynamic and innovative media production company specializing in creating engaging, interactive and high-quality content.
Similar Channels
Swipe to see more
Posts

*కాసేపట్లో ఏసీబీ విచారణకు మాజీమంత్రి కేటీఆర్* హైదరాబాద్ జూన్ 16,2025: ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ కాసేపట్లో విచారించనుంది. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదని, 6 గ్యారంటీల మోసాన్ని ఎండగడతానని కేటీఆర్ స్పష్టం చేశారు. 420 హామీల డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తాం ప్రజలకు వివరిస్తానన్నారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద* శ్రీశైలం జూన్ 16,2025: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్‌ఫ్లో 22,860 క్యూసెక్కులకు చేరుకుంది. జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం 841.50 అడుగులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 885 అడుగులు. అధికారులు వరద పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*నేడు గుజరాత్ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు* గుజరాత్ జూన్ 16,2025: మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు నేడు రాజ్‌కోట్‌లో జరగనున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో రూపానీ మృతి చెందగా. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా భౌతికకాయాన్ని గుర్తించిన అధికారులు. ఈ ఘటనపై గుజరాత్ వ్యాప్తంగా నేడు అధికారిక సంతాప దినంగా ప్రకటించారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్ ట్రైనర్* హైదరాబాద్ జూన్ 16,2025: జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమ పేరుతో మోసగించిన జిమ్ ట్రైనర్ మహేష్ అరెస్ట్. రెండు సంవత్సరాల పాటు సహజీవనం చేసిన మహేష్ రూ.15 లక్షలు తీసుకుని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత మహేష్‌కు ఇప్పటికే పెళ్లి అయిన విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*గద్దర్ అవార్డుల వేడుక విజయవంతం: దిల్‌రాజు* హైదరాబాద్ జూన్ 15,2025: గద్దర్ అవార్డుల వేడుక ఘనంగా ముగిసిందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి మరియు మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా గద్దర్ అవార్డులను ప్రారంభిస్తామని చెప్పారు. అవార్డు విజేతలు ఎంత పనిలో ఉన్నా, తప్పకుండా హాజరై అవార్డు స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు* శ్రీహరికోట జూన్ 16,2025: షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు కలకలం. చెన్నైలోని CISF కమాండెంట్ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు కాల్‌తో భద్రతా బలగాలు అప్రమత్తం. శ్రీహరికోట షార్ కేంద్రంలో గాలింపు చేపట్టిన అధికారులు. తుదకు ఫేక్ కాల్‌గా నిర్ధారించి ఊపిరిపీల్చుకున్న అధికారులు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*లక్నోలో సౌదీ విమానానికి తప్పిన ప్రమాదం* లక్నో జూన్ 16,2025: లక్నోలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో వచ్చిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ నుంచి పొగలు రావడం కలకలం రేపింది. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ పరిస్థితిని సమర్ధవంతంగా అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులు క్షణాలపాటు భయంతో గడిపారు. తర్వాత పరిస్థితి ప్రశాంతంగా మారడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు-కేటీఆర్* హైదరాబాద్ జూన్ 16,2025: బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదు అని అన్నారు. అంతేకాక 420 హామీలు, డిక్లరేషన్లపై నిలదీస్తూనే ఉంటాం. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని. వందసార్లు విచారణకు పిలిచినా వస్తా. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్‌ఎస్సే అని అన్నారు. ప్రజలపక్షాన పోరాటం కొనసాగిస్తామని, బీజేపీ మాయా హామీలను ఎండగడతామని స్పష్టం చేశారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన* విశాఖపట్నం జూన్ 16,2025: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన సమీక్షించనున్నారు. బీచ్ రోడ్‌లో జరిగే యోగా డే ప్రధాన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్న చంద్రబాబు, మంత్రుల కమిటీతో పాటు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష జరగనుంది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన* తెలంగాణ జూన్ 15,2025: తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీసే సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday
