
Dev Tv
March 1, 2025 at 04:35 AM
*కొత్త మోటార్ వాహన నిబంధనలు అమలు*
మార్చ్ 01,2025: ఈ రోజు నుండి కొత్త మోటార్ వాహన చట్టం అమలు ప్రారంభమైంది. ఈ చట్టం కఠినమైన ట్రాఫిక్ నిబంధనలతో పాటు, వాటి ఉల్లంఘనలకు అధికంగా జరిమానాలు విధించే విధంగా రూపొందించబడింది.
*కొత్త నిబంధనల ప్రకారం:*
*హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే:* ₹1,000 జరిమానా.
*సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే:* ₹1,000 జరిమానా.
*డ్రంక్ అండ్ డ్రైవ్:* ఆల్కహాల్ లేదా మద్యం సేవించి వాహనం నడిపితే ₹10,000 జరిమానా విధించబడుతుంది. అదనంగా, డ్రైవర్ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది.
*ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్ లేదా రాంగ్ రూట్ లో వెళ్ళడం:* ₹1,000 జరిమానా.
*లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే:* ₹5,000 జరిమానా. మరియూ, వాహనాన్ని సీజ్ చేయబడుతుంది.
అంతేకాక ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలపై మరింత కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday

👍
1