
Dev Tv
March 1, 2025 at 06:51 AM
*రాజంపేట సబ్ జైలులో పోసాని కృష్ణమురళి*
రాజంపేట మార్చి 01,2025: సినీ నటుడు, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో ఉన్నారు. జైలులో ఆయనకు ప్రత్యేక గది కేటాయించిన అధికారులు, నిన్న రాత్రి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.
పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు కాగా, పలు జిల్లాల్లో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. పోసానికి బెయిల్ మంజూరు చేయాలంటూ రైల్వేకోడూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఇవాళ, రేపు కోర్టు సెలవుల కారణంగా విచారణ సోమవారం బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. అయితే, పోసానికి బెయిల్ మంజూరైనా మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
