Dev Tv
Dev Tv
March 1, 2025 at 12:15 PM
*పరీక్ష లేకుండా పోస్టల్ ఉద్యోగాలు – మార్చి 3 చివరి తేదీ* మార్చి 01,2025: పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. మొత్తం 21,413 ఖాళీలు ఉన్న ఈ నియామకంలో ఆంధ్రప్రదేశ్‌లో 1,215, తెలంగాణలో 519 ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. *ఎంపిక విధానం:* ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. *దరఖాస్తుకు చివరి తేది:* మార్చి 3, 2025 దరఖాస్తుకు చివరి తేదీ కాగా, మార్చి 6 నుండి 8 వరకు తప్పుల సవరణకు అవకాశం ఉంది. *అర్హతలు:* అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కోటా ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు & వివరాల కోసం వెబ్‌సైట్: indiapostgdsonline.gov.in Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *పరీక్ష లేకుండా పోస్టల్ ఉద్యోగాలు – మార్చి 3 చివరి తేదీ*   మార్చి 01,2...

Comments