Dev Tv
Dev Tv
March 1, 2025 at 12:55 PM
*ఛాతి నొప్పి అని పోసాని డ్రామ ఆడారు- సీఐ వెంకటేశ్వర్లు* కడప మార్చి 01,2025: కడప రిమ్స్‌లో పోసాని ఆరోగ్య పరీక్షలు పూర్తి కాగా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు వెల్లడించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన తర్వాత, మెరుగైన వైద్య సేవల కోసం అతన్ని కడప రిమ్స్‌కు తరలించారు. పోసాని ఆరోగ్యంపై అన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించామని, రిపోర్టులు సాధారణంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, ఉదయం నుంచి పోసాని నాటకానికి పాల్పడ్డాడని రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. "కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో వైద్య పరీక్షలు చేయించాం, కానీ ఎలాంటి అసాధారణతలు గుర్తించలేదు" అని ఆయన తెలిపారు. పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
Image from Dev Tv: *ఛాతి నొప్పి అని పోసాని డ్రామ ఆడారు-  సీఐ వెంకటేశ్వర్లు*   కడప మార్చి ...

Comments