Sri Datta Prasaram
Sri Datta Prasaram
February 3, 2025 at 02:13 AM
*శ్రీ దత్త ప్రసాదం - 41 - పుణ్య క్షేత్ర యాత్రికులను ఆకలి బాధ నుండి తప్పించిన శ్రీ దత్తాత్రేయ స్వామి* "ఎవరు మాట్లాడేది?..ప్రసాద్ గారేనా..నమస్కారమండీ..మేము యాభై మందిమి వున్నాము..మా బస్సులో వస్తున్నాము..ప్రస్తుతం పామూరు వద్ద వున్నాము..మరో గంట లోపల మొగిలిచెర్ల కు వస్తాము..దత్తాత్రేయ స్వామివారి మందిరం ఆ సమయానికి తెరచి ఉంటారా?..స్వామివారి దర్శనం చేసుకొని మేము ఈ రాత్రికే తిరిగి వెళ్లిపోవాలండీ..కొద్దిగా మాకు దర్శనాన్ని ఏర్పాటు చేయండి.." అని ఒక ఆదివారం సాయంత్రం 7 గంటల సమయం లో ఫోన్ చేశారు..సహజంగా మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ఉదయం 6గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకూ తెరచి ఉంటుంది.. ఆ తరువాత మందిరం మూసివేస్తారు..ఫోన్ చేసిన వాళ్ళు రావడానికి మరో గంట సమయం పడుతుందని తెలిపారు..అంటే సుమారుగా వాళ్ళు రావడానికి రాత్రి 8 గంటలు దాటి పోవొచ్చు..మా అర్చకులతో అదే మాట చెప్పి..వాళ్ళ అభిప్రాయం అడిగాను.."పర్లేదులేండి.. వాళ్ళు వచ్చేదాకా మేము ఉంటాము..వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్లిన తరువాతే...మేము కార్యక్రమాలు పూర్తి చేసుకొని..వెళతాము.." అన్నారు.. యాభై మంది వస్తున్నారు..వాళ్లకు భోజనం ఏర్పాట్లు ఉన్నాయో లేదో తెలియదు..ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేద్దామని ఫోన్ చేసాను..ఫోన్ కలవడం లేదు..అలా ఐదారు నిమిషాల వ్యవధిలో రెండు మూడు సార్లు ప్రయత్నం చేసాను..ఫలితం లేదు..తీరా వాళ్ళు వచ్చాక..ఆహారం కావాలంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం కష్టం కనుక..వంటవాళ్లను పిలిచి..యాభై మందికి సరిపడా ఆహారం (అన్నం సాంబారు, కూర )తయారు చేయమని చెప్పాను.."అయ్యా..వాళ్ళు ఇక్కడికి రానీయండి.. వచ్చిన తరువాత వాళ్ళు స్వామివారి సమాధి దర్శించుకోవడానికి మరో అరగంట పైనే పడుతుంది..అప్పుడు వాళ్ళు అడిగితే..వండి పెడదాము..కొద్దిసేపు వేచి వుంటారు.." అని మా సిబ్బంది చెప్పారు..నిజానికి అది పాటించదగ్గ సూచనే..పదార్ధం వృధా కాకుండా వుంటుంది.. కానీ..నా మనసులో ఏదో ఒక తపన మొదలైంది..వాళ్ళ కొరకు ఆహారం ఏర్పాటు చేయమని ఎవరో నన్ను ఆదేశిస్తున్నటు అనిపించింది..ఓ పదినిమిషాలు స్థిమితంగా ఒకచోట కూర్చోలేక పోయాను..స్వామివారి సమాధి గదికి ఇవతల నిలబడి.."స్వామీ..యాభై మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నాము..వృధా కాకుండా చూడు తండ్రీ.." అనుకున్నాను..ఆ మాట అనుకున్న తరువాత..మనసులోని వేదన తగ్గింది.. సిబ్బందికి, వంటవాళ్లను ఆహారం వండమని చెప్పేసాను.. ఎనిమిది గంటలకు వస్తామని చెప్పిన ఆ యాభై మంది మరో అరగంట ఆలస్యంగా వచ్చారు..అందరూ కాళ్ళూ చేతులూ కడుక్కొని..లోపలికి వచ్చారు..స్వామివారి సమాధి దర్శనానికి టికెట్ కొనుక్కొని..ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళసాగారు.. ఈలోపల వాళ్లలో ఉన్న ఒకతను నా దగ్గరకు వచ్చి.."అయ్యా..మీరేనా ప్రసాద్ గారు.." అని అడిగారు..అవును అన్నాను.."మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకోవద్దు..మా వాళ్లకు ఈ రాత్రికి భోజనం ఏర్పాటు చేయగలరా..అందుకు అయ్యే ఖర్చు ఏదైనా ఉంటే..నేను భరిస్తాను..మేము యాత్రలు ఏర్పాటు చేస్తుంటాము.. మా వద్ద యాత్రీకులందరికీ భోజనం మేమే ఏర్పాటు చేయాలి..అదేమిటో నండీ..ఈరోజు మధ్యాహ్నం మేము భోజనం చేసి బయలుదేరిన తరువాత..భైరవకోన కు వచ్చాము..అక్కడ రాత్రికి ఏర్పాటు చేద్దామని చూస్తే..మా పనివాళ్ళు వంట సరుకులు బస్సులో పెట్టటం మర్చిపోయారు.. తీరా భైరవకోన చేరిన తరువాతే ఆ సంగతి తెలిసింది..పామూరులో హోటల్ వాళ్ళను అడగాలని అనుకున్నాము..చిత్రంగా పామూరు లో ఈ పూట ఒక్క హోటల్ కూడా తెరచి లేదు..ఎవరో అధికారులు తనిఖీ కి వస్తున్నారని అందరూ మూసివేశారు..అప్పుడు అక్కడ ఒక వ్యక్తి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నాడు..కానీ ఫోన్ లో మీతో ఈ విషయం చెప్పలేదు..ఆ తరువాత మీతో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా ఫోన్ కలవలేదు..దైవం మీద భారం వేసి ఇలా వచ్చాము..ఇప్పుడు అడుగుతున్నాను.." అన్నాడు.. "మీరేమీ కంగారు పడవద్దు..మీకోసం ఆహారం సిద్ధంగా ఉంది..నిజానికి మీరే మేలు చేశారు..మీరు ఇక్కడ భోజనం చేయకపోతే..మీకోసం వండినది వృధా అయ్యేది.." అన్నాను..అతని ముఖం విప్పారింది..ఒక్కసారిగా నా చేతులు పట్టుకొని.." నన్ను రక్షించారు.." అన్నాడు.."నేను కాదు..స్వామివారు మీకు ఏర్పాటు చేశారు..దత్తుడి దర్శనానికి వచ్చే ఏ భక్తుడూ ఆకలితో ఉండకూడదని దత్తాత్రేయుడి మందిరాలలో ఒక నియమం ఉంది..అది ఇక్కడ కూడా అమలు అవుతుంది..ఒకవేళ మేము అలసత్వం చూపినా..స్వామివారు ఒప్పుకోరు.." అన్నాను..మరో అరగంటకు అందరూ భోజనాలు చేశారు..ఆరోజే వెళ్లిపోతామని చెప్పిన ఆ యాత్రీకులు..ఆ రాత్రికి స్వామివారి మందిరం లోనే నిద్ర చేసి..ఉదయం మళ్లీ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్లారు.. స్వామివారు సమాధి లో నిశ్చలంగా వున్నా.. ఒక్కొక్కసారి చిన్న చిన్న అనుభవాల ద్వారా పెద్ద పాఠం నేర్పుతూ..మనసుకు ఆనందాన్ని కలిగిస్తారు.. సర్వం.. శ్రీ దత్తకృప!! రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్ (మందిర వివరముల కొరకు : పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699) ---- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 ----
Image from Sri Datta Prasaram: *శ్రీ దత్త ప్రసాదం - 41 - పుణ్య క్షేత్ర యాత్రికులను ఆకలి బాధ నుండి తప్...
🙏 ❤️ 15

Comments