Sri Datta Prasaram WhatsApp Channel

Sri Datta Prasaram

445 subscribers

About Sri Datta Prasaram

This channel gives all the updates and information related to Sri Dattatreya Swamy Mandiram, Mogilicherla - 523114 Sarvam, Sri Datta Krupa 🙏 Google Maps Link for Location of the Temple : *https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A* You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details  Follow us on other social media as well *Youtube :* https://youtu.be/kMusvu1727M *Spotify :* https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA *Amazon Music :* https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9 *Gaana :* https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro Facebook Link :  https://www.facebook.com/profile.php?id=100064850780400&mibextid=ZbWKwL Twitter id :  @dattaprasaram Twitter Link : https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Similar Channels

Swipe to see more

Posts

Sri Datta Prasaram
Sri Datta Prasaram
6/2/2025, 12:24:12 PM

https://www.facebook.com/share/p/1RvydrmHWY/?mibextid=kFxxJD

🙏 6
Sri Datta Prasaram
Sri Datta Prasaram
6/2/2025, 1:02:31 AM

*ఓం తత్ ఆత్మానాం, ఆత్మానందాం, ఆత్మనందనవానాం* *ఓం తత్ భవానాం, భవేశాం, భవానందాం* *ఓం తత్ సహవాసం, సర్వేశాం, సర్వవందయానాం* *ఓం తత్ నిర్మలాం, నిర్మసంక్తం, నిత్యావసంతాం* *ఓం తత్ సత్యం, సర్వం, సంపూర్ణం* *మొగిలిచెర్ల అవధూత, శ్రీ దత్త కరుణప్రదాత* ---- (మందిర వివరముల కొరకు : పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699) ---- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 Mn ----

🙏 10
Image
Sri Datta Prasaram
Sri Datta Prasaram
6/4/2025, 11:52:03 AM

https://www.facebook.com/share/p/16jJ7svKYf/?mibextid=kFxxJD

🙏 8
Sri Datta Prasaram
Sri Datta Prasaram
6/3/2025, 1:18:20 AM

*బృందావనార్చన సేవ ఆహ్వానం* ఓం శ్రీ గురుభ్యోనమః మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి శక్తి కేంద్రమైన బృందావనాన్ని మీ స్వహస్తాలతో అభిషేకించే అద్భుత అవకాశం ఇది. వినియోగించుకొని, తరించ ప్రార్ధన. *గమనిక:* * ఈ సేవలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేదు, ఇది పూర్తిగా ఉచిత సేవ * శ్రీ స్వామి వారు నైష్ఠిక బ్రహ్మచారి కనుక బృందావన అభిషేకానికి కేవలం పురుషలకు మాత్రమే అనుమతి * మహిళలకు మందిరంలోని నిత్య పూజాకైంకర్యాలకు వాడే వస్తువులను శుభ్రపరిచే అవకాశం అందించబడును సర్వం, శ్రీ దత్త కృప ధన్యోస్మి ----- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 Mn ----

🙏 💐 12
Image
Sri Datta Prasaram
Sri Datta Prasaram
5/31/2025, 11:51:43 PM

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి భజన కీర్తనలు - 19 - దత్తుని దయలే నా జీవన గమ్యం* *పల్లవి*: దత్తుని దయలే నా జీవన గమ్యం మొగిలిచెర్లలో వెలిసిన పరబ్రహ్మం! --- *చరణం 1*: కన్నతండ్రిలా కాపాడే కరుణామయుడవు కన్నీటి బాటలో వెలుగునివి నీవే వేదాంతవాక్యమై పలికే పరమాత్మ వేదనలో భక్తికి ఆధార మీవే --- *చరణం 2*: చెయ్యిని పట్టి నడిపించే చిన్మయమణి చెల్లని చేతులు ఆశ్రయించు తేజోమణి మాటలకందని మౌనాంతర స్వరూప మనసు మరవని మాధుర్య మూర్తి --- *చరణం 3*: భక్తి వనములో మొలిచిన బ్రహ్మపుష్పం నిలువెల్లా ప్రేమను వర్షించు దివ్యస్వరూపం పిలిచిన చాలు పలుమారు చేరే జ్యోతిరూపం నిదురులేని నయనాల్లో మెదిలే దివ్యతర దైవం --- *పల్లవి (పునః): దత్తుని దయలే నా జీవన గమ్యం మొగిలిచెర్ల లో వెలిసిన పరబ్రహ్మం! --- *రచన:* శ్రీ అనంతైశ్వర్య శర్మ *గమనిక:* • రాగం కట్టి పాడగలలిగిన వారు, తప్పక పాడి పంపగలరు • రాగాణుగంగా సాహితీ మార్పులు చేసుకునే స్వేచ్ఛ తప్పక మీకున్నది --- సర్వం, శ్రీ దత్త కృప (మందిర వివరముల కొరకు : పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699) ---- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 Mn ----

🙏 13
Image
Sri Datta Prasaram
Sri Datta Prasaram
6/4/2025, 2:09:40 AM

*శ్రీ దత్త ప్రసాదం - 67 - తెలివైన విద్యార్థినికి తొలగిన మానసిక వేదన* పాఠకులకు నమస్కారం, ఆ వ్యక్తి పేరు మల్లేశ్వర రావు, వారిది గుడివాడ, వారి కూతురు విద్య నేర్చుకోవటంలో చిన్నతనం నుంచి చూపిన ప్రతిభ రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులో చేర్పించడం జరిగింది. ఛార్టర్డ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్ష అన్నది మన దేశములో జరిగే ప్రతిభా పరీక్షలలో చాలా క్లిష్టమైన పరీక్ష అని పేరు. అయినా తమ కూతురి విద్యాబుద్ధులు తెలిసిన మల్లేశ్వర రావు గారు, తమ కూతురు ఆ పరీక్షను సులువుగా దాటగలరు అని నిశ్చింతగా వుండేవారు. కానీ, సరిగ్గా ఇక ఫైనల్ పరీక్షలు 6 నెలలు వుందనగా, కారణం తెలియకుండా వారి కూతురు కృంగిపోవటం మొదలుపెట్టారు. మానసికంగా తన ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోయింది. దానితో ఒక్కసారిగా మల్లేశ్వర రావు దంపతులు ఆందోళన చెందారు. ఒకటి రెండు నెలలు గుడివాడ మరియు ఆ చుట్టుపక్కల ఉన్న మానసిక నిపుణులకు అమ్మాయిని చూపించారు. ఆ వైద్యులు చెప్పిన మందులను సైతం వాడారు కానీ, ఫలితం కనపడలేదు. అదే సమయములో మన మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలను, మన మందిర వ్యవస్థాపక ధర్మకర్త అయిన నాగేంద్రప్రసాద్ గారు ప్రచురిస్తున్న సామాజిక మాధ్యమాల ద్వారా చదవడం ప్రారంభించారు. ఎందుకనో మల్లేశ్వర రావు గారికి మన శ్రీ స్వామి వారి క్షేత్రాన్ని దర్శిస్తే వారి అమ్మాయి జీవితం తిరిగి గాడిలో పడుతుంది అని అనిపించింది. అప్పటికే మన దత్త క్షేత్రాన్ని సందర్శించిన వారి స్నేహితుడి దగ్గర వివరాలు తీసుకొని ఒక గురువారం పొద్దున బయలుదేరి, మందిరానికి చేసురుకున్నారు. మందిరములోకి అడుగు పెట్టిన తరువాత ముందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకొని, నాగేంద్రప్రసాద్ గారితో మన మందిరము దగ్గర ఒక నాలుగు రోజులు వుండబోతున్నాని, మరే ఎటువంటి ఏర్పాట్లు వద్దని చెప్పారు. ఆ తరువాత మండపములో కూర్చొని మన శ్రీ స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేశారు. ఆ సాయంత్రం మందిరము చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు. పక్కరోజు శుక్రవారం నాడు బృందావనార్చన సేవలో, అలానే శనివారం నాటి పల్లకిసేవలో ఆదివారం నాడు అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. ఈ నాలుగు రోజులు కూడా ప్రతి రోజు 108 ప్రదక్షిణలు చేశారు. ఎందుకనో ఇక్కడ చేసిన సేవలు, వాతావరణం మన మల్లేశ్వర రావు గారికి వారి కూతురి కష్టం తొలిగేలా చేస్తాయి అని బలంగా అనిపించింది. దానితో వారి కష్టం తీరేవరకు, ప్రతీ నెలా ఒక నాలుగు రోజులు ఇక్కడ సంపూర్ణంగా సేవలలో పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. అదే విషయాన్ని నాగేంద్రప్రసాద్ గారికి విన్నవించి వారి సుముఖత కూడా పొందారు. ఇక అది మొదలు వరసగా మూడు నెలలపాటు, ప్రతి నెల, నాలుగు రోజుల పాటు మన శ్రీ దత్తాత్రేయుని మందిరము వద్దకు రావటం, సేవలలో పాల్గొనడం, మళ్ళీ తిరిగి ఆదివారం సాయంత్రం గుడివాడకు వెళ్లిపోవటం చేశారు. మూడో నెల మన దత్త క్షేత్రము నుంచి బాయలుదేరిన ఒక 15 రోజులలోనే మల్లేశ్వర గారు వారి యావత్ కుటుంబముతో మందిరాన్ని దర్శించుకున్నారు. కారణం, వారి కూతురుకి సమస్య తీరిపోయి చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలు అయ్యింది. ఆరోజు మందిరములో మన శ్రీ స్వామి వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని వారి వూరికి తిరిగి వెళ్లిపోయారు. చూసారు కదా పాఠకులారా, వారి కూతురి కష్టం తీర్చమని మన మందిరము వద్ద మనస్ఫూర్తిగా సేవ చేసిన ఆ తండ్రి కోరికను శ్రీ స్వామి వారు ఎలా తీర్చేసారో. ఇక, మరొక అందమైన శ్రీ దత్త ప్రసాదంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అలానే, మీరందరూ కూడా ఆ భగవంతుని ప్రత్యక్షంగా దర్శించి, తరించాలని నా వ్యక్తిగత విన్నపము. అందుకొరకు, అంతవరకు మరియు అటుపైన... సర్వం, శ్రీ దత్త కృప ధన్యోస్మి 🙏 మూల రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్ (మందిర వివరముల కొరకు : పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699) ---- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 Mn ----

🙏 15
Image
Sri Datta Prasaram
Sri Datta Prasaram
6/5/2025, 12:12:46 PM

https://www.facebook.com/share/p/16gaFCjHYo/?mibextid=kFxxJD

🙏 6
Sri Datta Prasaram
Sri Datta Prasaram
6/5/2025, 2:30:14 AM

*ఓం శ్రీ గురుభ్యోనమః* భగవంతుడి గురించి తెలుసుకోవాలి. వారి లీలలు, కరుణ, భక్తుల పట్ల వారు కురిపించే ప్రేమానురాగాల గురించి అందరూ తెలుసుకొని ఆస్వాదించగలగాలి. అందుకనే మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి, ఆ భగవంతుని ఆశీస్సుల వలన మేము ఈ సమాజానికి ఎల్లప్పుడూ తెలుపుతూనే ఉంటాము. అది మాట ద్వారా కానీ, వ్రాత ద్వారా కానీ, పాట ద్వారా కానీ లేదా ఒక దృశ్యరూపములో కానీ. అందులో భాగముగానే, నేడు మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద మా యధాశక్తి రూపుదిద్దుకున్న మొదటి భజన గీతాన్ని, *యూట్యూబ్, spotify మరియు అమెజాన్ మ్యూజిక్ మాధ్యమాల ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాం.* ఈ పాట యొక్క రచన శ్రీ. ఆనంత ఐశ్వర్య శర్మ గారు చేయగా, శ్రీ. రామకృష్ణ ఉపాధ్యాయులు గారు స్వరపరిచి, పాడి ఈ గీతానికి జీవం పోశారు. శ్రీ. N.V. శాస్త్రి గారు దీనికి వాద్య సహకారం అందించారు. మీరందరూ కూడా ఈ గీతాన్ని విని, మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారు అని ఆశిస్తూ... సర్వం, శ్రీ దత్త కృప. Youtube : https://youtu.be/nkjt28nWhPU Spotify : https://open.spotify.com/episode/7aqyOdDsmlcNzo6J1BEZ29 Amazon Music : https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_BPSZHjKoqpUd0aAE2Gob29jXV దయచేసి *like* చెయ్యండి, *share* చెయ్యండి మరియు *subscribe* చేసుకొన ప్రార్ధన. *గమనిక : ఈసరికే subscribe చేసుకున్న వారు, దయచేసి *notification* లను *activate* చేయ ప్రార్ధన. సర్వం శ్రీ దత్త కృప 🙏 పవని శ్రీ విష్ణు కౌశిక్ (@sridattaprasaram) మందిర వివరముల కొరకు సంప్రదించవలసిన వారి వివరాలు: శ్రీ పవని శ్రీ విష్ణు కౌశిక్, శ్రీ దత్తత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల సెల్ no:*9182882632* ధన్యోస్మి 🙏 ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏* Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 ----

🙏 9
Sri Datta Prasaram
Sri Datta Prasaram
6/1/2025, 1:33:32 PM

https://www.facebook.com/share/p/1KqSoVjPvj/?mibextid=kFxxJD

🙏 5
Sri Datta Prasaram
Sri Datta Prasaram
5/31/2025, 11:31:25 AM

https://www.facebook.com/share/p/1XbJhu8fHs/?mibextid=kFxxJD

🙏 5
Link copied to clipboard!