Sri Datta Prasaram
Sri Datta Prasaram
February 10, 2025 at 01:29 AM
*శ్రీ దత్త ప్రసాదం - 45 - మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కోరికలు - మూడవ భాగము* పాఠకులకు నమస్కారము! వచ్చిన భక్తులందరికీ కూడా ఆకలి బాధ నుంచి తప్పించాలని మొదటి కోరిక, అలానే బాధలతో వచ్చిన వారందరికీ కూడా మనోవేదన తగ్గేలా వారి జీవితాలను ఒక క్రమంలో పెట్టేలా సూచనలు ఇవ్వాలని రెండవ కోరిక. ఇక మూడవ కోరిక ఏమిటో తెలుసా....నీకు ఆకలి తీరింది, నీ మనోవేదన కూడా చిన్నగా తరిగిపోతోంది. కానీ, మందిరానికి కానీ ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ కొలువై ఉన్న భగవంతుడు భక్తుల నుంచి ఆశించేది ఏమిటో తెలుసా!....భగవంతుని మీద ఏకాగ్రత, శ్రద్ధ లేదా స్థిర చిత్తము. ఇది ఒక భక్తినిలో కనపడితేనే భగవంతుడు ప్రసన్నం అయ్యేది. అదేంటి, భగవంతుడు తన మీద శ్రద్ధ పెట్టి గౌరవిస్తే కానీ, ప్రసన్నుడు కాకపోవడం ఏంటి? ఆయన ఏమన్నా మనలా మాములు మనీషా! పొగిడితే కానీ, పనులు జరగవు అనడానికి. కాదు, అలా కాదు...భగవంతుని మీద దృష్టి నిలిపిన వారికే భగవంతుడు ఏమన్నా చెపితే కదా వినేది, అప్పుడు కదా ఆ మనిషి సంస్కరించబడేది. సాక్షాత్తు ఈ బ్రహ్మాండాన్ని అంతా నడిపే భగవంతునికి తన మీద కనీస శ్రద్ధ లేక, జీవితములో అసలు దేని యందు రాణించాలని ఆసక్తి లేనివారి మీద ఇక సమయం ఎందుకు వృథా చేసుకుంటారు చెప్పండి. అందుకనే భగవంతుడు ఎప్పుడూ కూడా బాగుపడటంలో భక్తుని యొక్క శ్రద్ధను ఎప్పుడూ కోరుకుంటారు. మరి, వచ్చిన ప్రతి భక్తుడు మిగిలిన విషయాలలో జరిగే ఇబ్బందుల వలన భగవంతుని మీద స్థిరదృష్టిని నిలుపలేక పోతే, అన్ని అవాంతరాలు దాటుకొని అసలు మందిరానికి రావటమే నిరర్ధకమైపోతుంది. అలా జరగకుండా ఉండేందుకే ఇక్కడ మందిర అభివృద్ధి లో భాగస్వామ్యులు అయ్యేందుకు ఉత్సాహ పడే భక్తులను మందిర సిబ్బంది తో, "ఇలా నేను ఇచ్చేది, ఈ మందిరములో ఒక భాగమై పోయి ఎన్నో ఏళ్లు నిలిచిపోవాలి" అని ఆడిగేలా ప్రేరేపిస్తారు. అప్పుడు మందిర సిబ్బంది ఇచ్చే సమాధానం , "అలా అయితే ఏదైనా వసతిని కానీ, నీటి వ్యవస్థ కానీ మరేదన్నా భక్తులకు కొంచెం ఆలంబనగా నిలిచేది చెయ్యండి" అని. మదిలో ఉంది అలాంటి మాటలాడించిన మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కోరిక మీదనే ఈ క్షేత్రములో కట్టబడిన ఆవాశాలు కానీ, ఏర్పడిన నీటి వసతి కానీ, బాత్రూములు కానీ, మందిర ప్రాంగణంలో వుండే విద్యుత్ పరికరాలు కానీ...ఈ వసతులు అన్ని. వీటి కారణంగానే మన దత్త క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా మరే ఇబ్బంది లేకుండా భగవంతుని మీదనే వారి నిరంతర దృష్టిని నిలిపేల చేసి, మన శ్రీ స్వామివారి కరుణకు పాత్రులయ్యేలా దోహద పడుతున్నాయి. అవును మందిరము నానాటికి పెరుగుతోంది, తద్వారా కావాల్సిన వ్యవస్థలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి వాటిని శ్రీ స్వామి వారి వాక్కు మీద ఏర్పాటు చేసే భక్తులు తరలివస్తారని ఆశిస్తూ..... సర్వం, శ్రీ దత్త కృప రచన : పవని శ్రీ విష్ణు కౌశిక్ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 ----
🙏 ❤️ 10

Comments