Sri Datta Prasaram
February 12, 2025 at 11:45 AM
*వీలుంటే మన దత్త మందిరానికి ఒక పూల మొక్క తో రండి*
ఓం శ్రీ గురుభ్యోనమః,
మన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్ల లో శ్రీ స్వామి వారి అలంకార మరియు వారి అంతరాలయ అలంకార పుష్పాల కోసమని ఒక చిన్నపాటి ఉద్యానవనాన్ని తీర్చి దిద్దుతున్నాము.
అందుకుగాను, ఈ క్రింద వ్రాసిన పూల మొక్కలు అవసరం పడతాయి. వీటిని మందిరము వారే క్రోడీకరించుకోగలరు కానీ, భక్తులకు ఆ అవకాశాన్ని అందిస్తే, అటు భగవంతుడు ఇటు భక్తులు కూడా ఎంతో సంతృప్తి చెందుతారనే భావనతో మీ అందరి ముందుకు ఈ ప్రతి పాదనను తీసుకొని వస్తున్నాను.
కావలసిన పూల మొక్కల వివరాలు :
1) *గులాబీ మొక్కలు - ముద్దవి - ఏవైనా మూడు రంగులలో*
2) *నందివర్ధనాలు*
3) *కనకాంబరాలు - ఏవైనా రెండు రకములు*
4) *బంతి పూల మొక్కలు - పసుపు మరియు ఆరెంజ్ రంగులు*
5) *ముద్ద మందారం మొక్కలు : ఏదైనా 4 రంగులవి*
6) *శంకు పూల మొక్కలు : నీలం మరియు గులాబి రంగు*
7) *జినియం పూల మొక్కలు*
8) *నూరు వరహాల మొక్కలు*
*గమనిక:*
* ఇది కేవలం భగవవంతుని సేవలో భక్తులని భాగం చేసే ప్రయత్నమే. ఇందులో, ఎటువంటి ప్రోద్బలం లేదు. అలానే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు.
* కేవలం మొక్కలు మాత్రమే తీసుకుంటాము కానీ, ధన రూపములో తీసుకొము
* పైన తెలిపిన రకాలు చాలు - మరే ఇతర నీడ నిచ్చే మొక్కలు (వేప, రావి, గానుగ, మర్రి ) ఇటువంటివి వద్దు
* చివరిగా, రకానికి 10 మొక్కలు మించి వద్దు.
* మీరు ప్రత్యక్షంగా తీసుకొని వస్తే, మందిరము వద్ద మీ స్వహస్తాలతోనే నాటిస్తాము
*మరిన్ని వివరాలకు : 9652429852 ను సంప్రదించండి*
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
🙏
❤️
👍
10