Sri Datta Prasaram
February 17, 2025 at 01:55 AM
*శ్రీ దత్త ప్రసాదం – 48 – అగ్ని మరియు ఆకలి – శాంతి, శాంతి, శాంతిః*
మొగలిచెర్ల గ్రామంలో సిద్ధిపొందిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద శ్రావణ మాసం పౌర్ణమి నాడు చండీహోమము నిర్వహించాలని సంకల్పించాము.. మా అర్చకస్వాములతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నాము..మా అంచనా ప్రకారం ప్రధాన హోమగుండం కాకుండా..భక్తులు పాల్గొనడానికి మరో ఎనిమిది హోమ గుండాలను నిర్మిస్తే సరిపోతుందని భావించాము..అందుకు తగ్గ ప్రణాళిక తయారు చేసుకున్నాము..హోమములో పాల్గొనే భక్తులకు ఇవ్వవలసిన పూజ సామాగ్రి, పూర్ణాహుతికి కావాల్సిన పదార్ధాలూ..ఇత్యాదులన్నీ ఒక పట్టిక వ్రాసుకొని..ఎంత ఖర్చు అవుతుందో లెక్క గట్టుకొని..ఇక ఏర్పాట్లు మొదలు పెట్టాము..ఇద్దరు ఋత్వికుల ను వేరే ప్రాంతం నుంచి పిలిపించాలి..సహాయ పరిచారికలు కావాలి..వాళ్లకు ఇవ్వాల్సిన దక్షిణ..దారి ఖర్చులూ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి..ఆరోజు అన్నదానం కూడా జరపాలని నిశ్చయించాము..ఖర్చు చాలానే అవుతున్నది..హోమము లో పాల్గొనే దంపతులకు హోమ సామాగ్రి కి అయ్యే వ్యయం తెలిపి..వారి వద్దనుంచి ఆ వ్యయాన్ని మాత్రం తీసుకోవాలని అనుకున్నాము..అందరూ ఈ ప్రతిపాదనకు సమ్మతించారు..
అనుకున్న విధంగానే శ్రావణ పౌర్ణమి నాడు చండీహోమము నిర్వహించడానికి మా పరంగా అన్ని ఏర్పాట్లూ చేసాము..హోమములో పాల్గొనడానికి ముందుగానే తెలిపిన వారు దంపత్సమేతంగా వచ్చారు..ఆనాటి హోమము చాలా బాగా జరిగింది..హోమము పూర్తి అయిన తరువాత మధ్యాహ్నం అందరూ భోజనం చేసి మళ్లీ శ్రీ స్వామివారి మందిరంలో చేరారు..
"ప్రసాద్ గారూ..ఈరోజు ఈ చండీహోమము చాలా బాగా జరిగిందండీ..మాకు తృప్తిగావుంది..హోమ సామాగ్రి వరకూ అయ్యే ఖర్చును మా వద్ద నుంచి తీసుకున్నారు..బాగానే ఉంది..మరి ఇతర ఖర్చులు ఎలా భరించారు..?" అని ఒక భక్తుడు అడిగాడు.."మేమే భరించాము.." అన్నాను..ఆయన ఒక్కనిమిషం పాటు మౌనంగా వున్నారు..ఇక నేనూ ఆ విషయాన్ని పొడిగించలేదు.."సరే ప్రసాద్ గారూ..నేనూ నా భార్యా..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వస్తాము.."అన్నాడు..
హోమములో పాల్గొన్న ఇతర భక్తులు భోజనం చేసి, తమ తమ ఊళ్లకు వెళ్లిపోయారు..ఈ దంపతులు మాత్రం ఆరోజు సాయంత్రం దాకా స్వామివారి మందిరంలోనే గడిపారు..సాయంత్రం హారతి అయిపోయిన తరువాత..నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..మధ్యాహ్నం మిమ్మల్ని ఇతర ఖర్చులు ఎంత అయ్యాయి..అని అడిగాను..మీరు చెప్పలేదు..కాకుంటే..నా భార్యా నేనూ ఒక నిర్ణయనికి వచ్చాము..ఈరోజు అన్నదానం ఖర్చు మేము ఇవ్వదల్చుకున్నాము.." అని కొంత నగదు తీసి నా ముందున్న టేబుల్ మీద పెట్టారు..నాకు ఆశ్చర్యం వేసింది..ఆరోజు అన్నదానం ఖర్చు శ్రీ స్వామివారి మందిరం తరఫున పెట్టాలని అనుకున్నాము..కానీ ఈ దంపతులు ఆ భారం తాము స్వీకరించారు..స్వామివారు చేసిన ఏర్పాటుగా భావించాము..
ఆనాటి నుంచి మందిరము వద్ద నిర్వహించే ప్రతీ హోమనికి కూడా కేవలం హోమద్రవ్యాల ఖర్చు వరకు మాత్రమే భక్తుల నుంచి తీసుకునేలా నియమం ఏర్పాటు చేసుకున్నాము. అలానే హోమము నాటి అన్నదానం కూడా అంతే శ్రద్ధగా చేస్తున్నాము..ఎందుకంటే..ఈ మొత్తం కార్యక్రమ నిర్వహణ మేము చేస్తున్నామని భావిస్తాము కానీ..అది స్వామివారి చేతుల్లోకి వెళ్ళిపోయి చాలా కాలం అయింది..కేవలం మేము నిమిత్తమాత్రులం..
సర్వం..
శ్రీ దత్తకృప!
రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్
(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
----
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM
-----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :
Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
----
🙏
❤️
12