Sri Datta Prasaram
Sri Datta Prasaram
February 19, 2025 at 01:23 AM
*శ్రీ దత్త ప్రసాదం - 49 - అవధూత పరిష్కరించిన అన్నదమ్ముల ఆస్తి వివాదం* పాఠకులకు నమస్కారము! ఆ రైతు పేరు లక్ష్మీనరసింహ రెడ్డి, కష్టాన్ని నమ్ముకున్న కర్షకులు వారు. తండ్రి నుంచి సంక్రమించిన 5 ఎకరాల పొలాన్ని వారి కాయకష్టం చేత 25 ఎకరాలకు పెంచారు. అంతేకాదు, మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తులు లక్ష్మీనరసింహ రెడ్డి గారు. నరసింహా రెడ్డి గారికి వివాహం అయ్యి 7 సంవత్సరాలు సంతానం కలగకపోతే, మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి బృందావనం దగ్గర దంపత్సమేతంగా మొక్కుకోగా, మరొక రెండు సంవత్సరాలలో 2 మొగ పిల్లలు కలిగారు. మొదటి బిడ్డకు వేణుగోపాల్ అని రెండవ కుమారుడికి రాజ గోపాల్ అని పేర్లు పెట్టుకొని మన శ్రీ దత్తాత్రేయుని మీద వారి భక్తిని చాటుకున్నారు లక్ష్మీనరసింహ రెడ్డి గారు. సంపదనే కాదు, సంతానాన్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నారు లక్ష్మీనరసింహ రెడ్డి గారు. ఇద్దరు పిల్లల్ని చక్కగా చదివించి, వివాహాలు చేసి, ప్రయోజకులుగా తీర్చిదిదరు. లక్ష్మీనరసింహ రెడ్డి గారు వారి వార్ధక్యములో తమ సంపాదనను, భాగాలుగా పంచుతూ ఒక భాగాన్ని వారికి మరియు వారి భార్యకు ఉంచుకొని, మిగితా రెండు భాగాలను ఇద్దరి పిల్లలకు చెందేలా వీలునామా వ్రాసారు. అయితే, వీలునామాను గమనించిన తరువాత, రెండవ బిడ్డ అయిన రాజగోపాల్, తన వాటా భూమిని అన్నయ్యకు చెందేలా అలానే అన్నయ్య వాటా భూమిని తనకు చెందేలా వీలునామా మార్చి వ్రాయాలని పట్టుబట్టారు. ఆ పట్టు ఎంతకీ వీడకపోవటంతో ఒకే కుటుంబంగా వుండే వారి మధ్య చీలిక ఏర్పడింది. దీనితో లక్ష్మీనరసింహ రెడ్డి గారి మనసు వేదనకు గురి అయ్యింది. ఆ సమయములో లక్ష్మీనరసింహ రెడ్డి గారికి గుర్తొచ్చింది కేవలం మన మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారే. అందుకనే ఆలస్యము చేయకుండా ఒక ఆదివారం నాడు బయుదేరి మన మందిరానికి చేరుకున్నారు. మందిరానికి చేరుకున్న తరువాత, లక్ష్మీనరసింహ రెడ్డి గారు మొదట మందిర వ్యవస్థాపక ధర్మకర్త గారైన నాగేంద్రప్రసాద్ గారిని కలిశారు. నాగేంద్రప్రసాద్ గారికి నరసింహా రెడ్డి గారితో మంచి స్నేహం ఉంది. అందుకనే, నరసింహారెడ్డి గారు నాగేంద్రప్రసాద్ గారికి వారు మందిరానికి రావడానికి గల కారణాన్ని తెలిపి "ఒకసారి బృందావన దర్శనం చేసుకొని నా మొర స్వామి వారికి చెప్పుకుంటా ప్రసాద్" అని చెప్పి. శ్రీ స్వామి వారి అంతరాలయంలోనికి వెళ్లి దత్తాత్రేయ స్వామి వారికి ఒక ఐదు నిమిషాల పాటు నమస్కరించుకొని బయటకు వచ్చి, మళ్ళీ నాగేంద్రప్రసాద్ గారితో , "ఇక అంతా స్వామి వారిదే భారం ప్రసాద్, నాకు సంతానాన్ని ప్రసాదించిన ఆ స్వామే నా సంతానం వలన కలుగుతున్న ఈ మనోవేదనను కూడా తొలగించాలి" అని నాగేంద్రప్రసాద్ గారికి వీడుకోలు చెపి వారి ఊరికి తిరిగి వెళ్లిపోయారు. మరలా ఒక వారం తరువాత నరసింహారెడ్డి గారు, వారి యావత్ కుటుంబముతో అది కూడా అందరూ ఒకేసారి మందిరములోకి వచ్చారు. నరసింహా రెడ్డి గారు నాగేంద్రప్రసాద్ గారితో, "శ్రీ స్వామి వారు కరుణించారు ప్రసాద్. ఉండు, ముందు శ్రీ స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చి అంతా నీకు చెప్తాను" అని వారి కుటుంబము అందరూ మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అంతరాలయ దర్శనము చేసుకొని, శ్రీ స్వామి వారి వద్ద పూజ చేయించుకొని నాగేంద్రప్రసాద్ గారి వద్దకు వచ్చి, "ఈ బుధవారం, చిన్నవాడు మన రాజగోపాల్ వాడంటత వాడే ఫోన్ చేసి, నాన్న మీ ఇష్టమొచ్చిన విధంగానే పంపకాలు చెయ్యండి, నాకు అభ్యంతరం ఏమి లేదు, మిమ్మల్ని బాధపెట్టుంటే క్షమించండి" అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయి "ఏమైంది రా!, అంత పట్టుబట్టావు, ఇప్పుడేంటి ఇలా" అని అడగగా, "ఎందుకో సోమవారం రాత్రి నుంచి నేను తప్పు చేస్తున్నాను అని ఒకటే అశాంతి నాలో, ఇదిగో ఇప్పుడు నీతో విషయం చెప్పిన తరువాత నాకు కొంచెం మనసు శాంతిచింది" అని అన్నాడు. "ఆ అశాంతికి గల కారణం నీకు నాకు తెలుసులే ప్రసాద్" అని ఒక చిరునవ్వు నవ్వి, వారింటికి వెళ్లిపోయారు నరసింహా రెడ్డి గారు. పాఠకులారా! నరసింహా రెడ్డి గారి చిన్న కుమారుడిలో వచ్చిన మార్పుకు కారణం ఇంకెవరు! మన మోగిలిచెర్ల అవధూత శ్రీ దాత్తత్రేయ స్వామి వారే. ఇంతటి భక్త సులభులైన మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని మీరందరూ తప్పక దర్శించి, తరించాలని నా వ్యక్తిగత విన్నపము. అందుకొరకు, అంతవరకు మరియు అటుపైన..... సర్వం, శ్రీ దత్త కృప ధన్యోస్మి రచన : పవని శ్రీ విష్ణు కౌశిక్ (మందిర వివరముల కొరకు : పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699) ---- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Image from Sri Datta Prasaram: *శ్రీ దత్త ప్రసాదం - 49 - అవధూత పరిష్కరించిన అన్నదమ్ముల ఆస్తి వివాదం* ...
🙏 ❤️ 13

Comments