Dhulipalla Narendra Kumar
Dhulipalla Narendra Kumar
February 4, 2025 at 08:36 AM
*పింఛను బదిలీ ఆప్షన్ ఓపెన్ అయింది :* ✓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలోని ఒక సచివాలయం నుండి మరొక సచివాలయానికి, ఒకే జిల్లాలోని ఒక మండలం నుండి మరో మండలానికి, రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పింఛను ట్రాన్స్ఫర్ పెన్షన్ బదిలీ చేసుకోవడానికి ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది. ✓ ఎవరైనా పింఛనుదారులు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఆ సచివాలయం పేరు, సచివాలయం కోడు , సచివాలయం మండలం, జిల్లాను ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులకు తెలియజేసినట్లయితే పింఛను ట్రాన్స్ఫర్ కొరకు దరఖాస్తు మొబైల్ యాప్ లో పెడతారు.
👍 4

Comments