
Dhulipalla Narendra Kumar
February 19, 2025 at 03:13 PM
• గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంపై అంబటి మురళి అన్నీ వాస్తవాలు మాట్లాడుతున్నాని చెబుతున్నాడు
•వాస్తవాలు మాట్లాడే అంబటి మురళి రైల్వే ఎన్ ఓసి లేదని చెప్పిన మాట వాస్తవమే కదా
• అంబటి మురళి ఎన్విరాన్మెంట్ ఒక రకం ప్లాన్, ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకొరకం ప్లాన్ ఇవ్వడం వాస్తవం కాదా
• భజరంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ అంబటి ఎలా అయ్యాడో చెప్పే ధైర్యం ఉందాని సవాల్ చేస్తున్నాం
• 20-5-2015న ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఇచ్చిన రైల్వే ఎన్ ఓ సి రద్దు చేసిన సంగతి గుర్తుందా ??
• ప్రాజెక్టు ఓనర్ అయిన అంబటి మురళి రాజకీయ అధికార మదంతో నేడు అసలు ఓనర్లను సైతం బెదిరించి ప్రాజెక్ట్ స్వాధీనం చేసుకున్నారు
• ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మార్పు చేసుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్నారా??
• నాడు అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఏదైనా చేయొచ్చుఏదైనా కట్టచ్చు అనే మితిమీరి వ్యవహరించారు
• కోట్ల విలువైన భూమి అంబటి మురళి సొంతం కానప్పటికీ ఎక్కువ భాగం ఎలా సొంతం చేసుకున్నాడో చెప్పే ధైర్యం ఉందా??
• వైసీపీ అధికారంలో ఉండగా మునిసిపల్ అధికారులను,పొల్యూషన్ అధికారులను, రైల్వే అధికారులును సైతం బెదిరించిన సంఘటనలు మరచిపోయావా అంబటి??
• కూటమి ప్రభుత్వం అధికారంలో వుందని నాపై అసత్య ఆరోపణలు చేయడం అంబటికి పరిపాటిగా మారింది
• మునిసిపాలిటీ కార్యాలయంలో కావాల్సిన అన్ని పేపర్లు నీకు అనుకూలంగా ఎలా తెచ్చుకుంటున్నావు?!
• మునిసిపల్ అధికారులు పనులు నిర్వహించవద్దని నోటీసులు జారీచేసినా ఇంకా గ్రీన్ గ్రేస్ అపార్ట్ మెంట్ పనులు పూర్తి చేశారు, గృహప్రవేశం చేయడం కూడా జరిగింది
• కొంతమంది మునిసిపల్ అధికారులు సైతం ప్రలోభాలకు లొంగటం వల్లే ఇదంతా జరుగుతున్నదనే అనుమానం కలుగుతోంది
• నావి ఆరోపణలు కావు వాస్తవాలను చట్టం దృష్టికి తెస్తున్నాను
• రేరా సంస్థలో ఉన్న చందు సాంబశివరావు, కామేశ్వరరావు అనే ఇరువురిని అడ్డుపెట్టుకొని చేసిన నిభంధనల ఉల్లంఘనలు గుర్తులేదా??
• సంఘం డెయిరీ విషయంలో కానీ తన కుటుంబం పై చేసిన ఆరోపణలు విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడటం, రాజకీయంగా వత్తిడులు తెచ్చిన సంగతిమరచిపోయి వ్యవరించడం చూస్తే ఏమనాలో అర్థం కాలేదు...
• అంబటి రాంబాబు ను అడ్డుపెట్టుకొని గ్రీన్ గ్రేస్ నుంచి షాడో ఎమ్మెల్యే గా చేసిన దోపిడీ తీరుపై మాత్రమే ఎన్నికల సమయంలో మాట్లాడటం జరిగింది
• ఏపీ ప్రభుత్వ నికి తక్షణమే ఒక ఉత్తరం రాసి విచారణ జరిపించాలని కోరే దమ్ముందా !?
• మంత్రి నారాయణ చర్యలు తీసుకోవాలి అని అడిగే ముందు ప్రత్యేక విచారణ చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాయాలి
• నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి నక్క వినాయలు ప్రదర్శించడం చూస్తే వినియోగదారులను మరోసారి మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతుంది
• ప్రభుత్వ పరిపాలనలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది అధికారులు ఉండటం మూలంగానే ఇలాంటి ఘటనలకు చోటు
• డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సహకారంతోనే అంబటి మురళి మునిసిపల్ కార్యాలయంలో తన పనులు చక్కబెడుతున్నారు
👍
2