Kazipet Swetharka Ganapati Temple
Kazipet Swetharka Ganapati Temple
February 1, 2025 at 01:47 PM
*శ్వేతార్కాలో వసంత పంచమి (శ్రీ పంచమి) వేడుకలు* 03.02.2025 సోమవారం రోజున కాజీపేట శ్వేతార్క గణపతి క్షేత్రంలో శ్రీపంచమి వేడుకల సందర్భంగా శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు. తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్న కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి క్షేత్ర నిలయంలో కొలువుదీరిన శ్రీ జ్ఞానముద్రాసరస్వతి అమ్మవారి సన్నిథిలో శ్రీపంచమి/మదన పంచమి అనగా శ్రీసరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా విశేష పూజలు జరుగును. కార్యక్రమ వివరాలు. *ఉదయం 8 గంటలకు అమ్మవారికి ప్రత్యేక మేథా సూక్త, సరస్వతీ సూక్తములతో పంచామృత, హరిద్రోదకాభిషేకం జరుగును. ఉ.9నుండి 12గం వరకు సామూహిక అక్షరాభ్యాస పూజలు.ఉ.10 గంటల నుండి విద్యాగణపతి,నిత్యసహస్రమోదక హోమం, సరస్వతీమూల మంత్ర హోమములు జరుగును. ప:12 గంటల నుండి దేవాలయ అన్నపూర్ణ భవనంలో భక్తులకు అన్నప్రసాదా వితరణ జరుగును.* గోత్రనామలు చదివించుకొనువారు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సరస్వతీ అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. పూర్తి వివరాలకు సమాచారకేంద్రంలో సంప్రదించగలరు. 9347080055 *అక్షరభ్యాసం పుజలోపాల్గొనే వారు 301/- చెల్లించి పూజలో పాల్గొనవచ్చు. పూజలో మరియు హోమంలో గోత్రనామాలు చదివించుకొనే భక్తులు 501/- చెల్లించగలరు. గోత్రనామాలు చదివించుకోవాలి అనుకునేవారు 9347080055 నంబర్ణకు gpay లేదా ఫోన్ పే చేయగలరు* *ఇట్లు* *శ్వేతార్క టెంపుల్ నిర్వాహకులు*

Comments