
Harish Balayogi
February 10, 2025 at 12:10 PM
డా. బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో సహా, రాష్ట్రంలో వివిధ విద్య, నైపుణ్యాభివృద్ది కేంద్రాల ఏర్పాటుపై చర్చించేందుకు, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ది శాఖ సహాయ మంత్రి(ఇండిపెండెంట్ ఛార్జ్) శ్రీ జయంత్ చౌదరి గారిని కలిశాను. కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వారిని కోరాను.అదే సమయంలో తక్షణమే జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందించాను. ఐటీఐ కాలేజీల ఆధునికీకరణ త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులు పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలను పెంచుకునేలా తయారు చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించాను. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ది, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాల్సిన అంశాన్ని ప్రస్తావించాను. నా వినతులు, విజ్ఞప్తులు సావధానంగా విన్న మంత్రి అన్ని విషయాలకు సానుకూలంగా స్పందించారు.

❤️
✌️
👍
7