Harish Balayogi
Harish Balayogi
February 14, 2025 at 03:25 PM
కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ గారితో సమావేశమయ్యాను. ఈ మధ్య కాలంలో విదేశాల్లో పనుల పేరుతో దళారుల చేతుల్లో చాలామంది మోసపోతున్నారు. అదే సమయంలో నకిలీ వీసా మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు అరికట్టడానికి అమరావతిలో ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (P O E) కేంద్రం ఏర్పాటు చేయాలని కోరాను. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క 2023 సంవత్సరంలోనే సుమారు 16 వేలమంది ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ మోసపోవడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రాష్ట్రం నుంచి వలస వెళుతున్న కార్మికుల హక్కులు కాపాడి, వారిని ఆదుకోవడానికి అమరావతిలో పిఓఈ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు ప్రతిపాదించిన విషయాన్ని వారికి గుర్తు చేశాను. వీలైనంత త్వరగా కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
❤️ 👍 🎉 9

Comments