
Harish Balayogi
February 25, 2025 at 03:06 PM
ఉప్పలగుప్తం మండలం, చల్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గరాజుపేట ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారన్న వార్త ఆందోళన కలిగించింది. వార్త తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, విద్య, వైద్య అధికారులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. చిన్నారులు అందరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకుని సంతోషించాను. జరిగిన ఘటనపై తక్షణం స్పందించి బాద్యులపై వెంటనే చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను.

❤️
✊
👍
👏
🙏
8