గోడపత్రిక
February 25, 2025 at 02:30 AM
దృష్టిలోపం పిల్లల్లో రోజు రోజుకి పెరుగుతుంది, గమనిస్తున్నాం
దీనికి కారణం ఏమిటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేస్తుంది
రోజుకి చదువుకునే పిల్లలు కనీసం 90 నిమిషాలు ఆరు బయట ఉండాలి, ఆరు బయట ఉండడం అంటే ఆటలు ఆడుకోవాలి, సూర్యరశ్మి తగలాలి, మేడ మీదకెక్కి ఉదయం సాయంత్రం చదువుకున్నా మంచిదే
సెల్ ఫోన్ కి అతుక్కోవడం వలన, పిల్లలలో దృష్టి మాధ్యం పెరుగుతుంది
మీ పిల్లలతో చర్చించి స్క్రీన్ టైం రోజుకి ఒక అరగంట తగ్గించే మార్గం వారినే అడగండి ఏ టైం లో స్క్రీన్ చూడకుండా ఉంటావు
అలా పెంచుతూ పోండి ఒకేరోజు ఈ రోజు నుంచి నువ్వు ఫోన్ ముట్టుకోవడానికి వీల్లేదు అంటే వారిలో తీవ్రభావం పెరుగుతుంది
అలాకాకుండా నయానా భయానా చెప్పి చూడండి