
గోడపత్రిక
February 26, 2025 at 01:00 AM
మహా శివరాత్రి ప్రాశస్త్యం చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.
జీర్ణశక్తికి కొత్త శక్తి..
శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణ మానవ శరీరం మీద ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపుతాయి. మనస్సంతా భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. రోజంతా ఉపవాసం చేయడం వల్ల మనసులోకి నెగిటివ్ ఆలోచనలు దరిచేరవు. ఇది మైండ్ కి కూడా ఒక రకమైన డీటాక్సిఫికేషన్ లా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. ఉపవాసం రోజున కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల శరీరం నూతనోత్సాహం సంతరించుకుంటుంది. పొట్టలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.