CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
January 31, 2025 at 05:47 AM
*మృత్యువుతో పోరాడుతూనే పంజా విసిరిన చిరుతపులి.. పాపం చివరకు..కానరాని అనంత లోకాలకు...* తెలంగాణ మెదక్ జిల్లా... వల్లూరు అటవీ ప్రాంతం అదో చిరుతపులి. అందులోనూ గాయపడ్డ చిరుతపులి. నడిరోడ్డుపై తీవ్రగాయాలతో అవస్థ పడుతున్న దాన్ని చూసేందుకు జనం పెద్ద గుమ్మిగూడారు. అయితే గాయపడ్డ పులి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. తీవ్రంగా గాయపడి ఎక్కువగా నడవలేని పరిస్థితిల్లో ఉన్నప్పటికీ.. తనకు దగ్గరకు వచ్చే వారిపై పంజా విసిరేందుకు ఏ మాత్రం వెనకాడలేదు ఆ చిరుత. అలా ఎంతోసేపు తీవ్రమైన నొప్పిని భరిస్తూ రోడ్డుపైనే విల్లవిల్లాడిపోయింది. అలా తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడి చనిపోయింది.. పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు.. వల్లూరు అడవి ప్రాంతంలోనే మృతి చెందిన చిరుత పులికి పోస్టుమార్టం చేయించి పూడ్చి పెట్టనున్నట్టు తెలిపారు.

Comments