CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం WhatsApp Channel

CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం

155 subscribers

About CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో📡📡📡📡 కామన్ మ్యాన్ టివి న్యూస్ ఛానల్ నంద పనిచేయుటకు చీప్ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్స్, రీజినల్ కోఆర్డినేటర్స్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్, జిల్లా కెమెరామాన్స్, నియోజకవర్గాల వారీగా రిపోర్టర్లు, మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూట్,etc... కావలెను ఆసక్తిగల అభ్యర్థులు ,తమ బయోడేటా ఆధార్, ఫోటో, క్వాలిఫికేషన్ జిరాక్స్, పూర్తి వివరాలను ఈ మెయిల్ కి పంపండి.email: [email protected] 📡📡📡📡 కామన్ మ్యాన్ టివి న్యూస్ ఛానల్ ఆఫీసు లోపనిచేయుటకు ....ఇన్ _ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్స్, వీడియో ఎడిటర్స్ ,సబ్ ఎడిటర్స్, కెమెరామాన్స్, యాంకర్స్, న్యూస్ రీడర్, గ్రాఫిక్స్ డిజైనర్స్ , డిటిపి ఆపరేటర్స్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ , టెక్నికల్ ఇంచార్జ్, సోషల్ మీడియా నెట్వర్క్స్ ప్రమోషన్స్ , మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూట్, డెస్క్  ఇన్చార్జెస్ , డెస్క్ జర్నలిస్టులు ,ఆఫీస్ ఇంచార్జ్ హెచ్ ఆర్ , రిసెప్షన్ డ్రైవర్స్ etc కావలెను... more ...etc... : [ మూడు సంవత్సరాల (ఆపై)  అనుభవం తప్పనిసరి] 📱 దయచేసి ఫోన్ చేయకండి

Similar Channels

Swipe to see more

Posts

CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
5/19/2025, 3:37:19 PM
Post image
Image
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
5/29/2025, 4:18:34 AM

*లోకాసమస్తఃస్సుఖినోభవంతు🕉️*మనిషి తప్పు చేశాక**సరిదిద్దుకుంటాడా లేదా అని**చూస్తాడు దేవుడు.**అందుకే వెంటనే శిక్షించడు**తీరుమార్చుకోకపోతే**దారుణంగా ఆ లెక్క సరి చేస్తాడు**అప్పుడు మనం ప్రస్తుతం**గురించేప్రస్తావిస్తాం**కానీ.. దేవుడు**గతాన్ని కూడా లెక్కేసి**కొడతాడని మర్చిపోతాం*

CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
5/19/2025, 3:37:17 PM

తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు... హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్​ బాటిల్​ మద్యానికి రూ.10, హాఫ్​, ఫుల్​ బాటిళ్లపై రూ.20, 40 చొప్పున పెంచుతూ తెలంగాణ బెవరేజెస్​ కార్పొరేషన్ లిమిటెడ్​ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. డిపోలతో పాటు మద్యం దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది. బ్రూవరీల యాజమాన్యాల డిమాండ్ల మేరకు సర్కార్​ నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది. ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది. జస్టిస్‌ జైశ్వాల్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ ఫిబ్రవరి 11న సర్కార్‌ నిర్ణయం తీసుకుం ది. 2019 నుంచి రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగలేదు. ముడి పదార్ధాల రేట్లు పెరిగినా, అప్పటి ధరతోనే బ్రూవరీస్‌ కంపెనీలు సరఫరా చేస్తూ వచ్చాయి. వివిధ సంప్రదారులు, బేవరేజెస్ కంపెనీల విజ్ఞప్తుల మేరకు ఒక్కో బీరు బాటిల్‌పై కనీసం రూ.18 నుంచి గరిష్ఠంగా రూ.50 వరకు పెంచుతూ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది.

CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
5/11/2025, 12:05:38 PM

ఏ 'సిరా'తో, ఏ 'కలం' తో రాసినా.... చాలా తక్కువే అని నా భావన. తెలుగు జర్నలిజం పుట్టాక ఎంతో మంది జర్నలిస్ట్ లు తమ కలాలు ఉపయోగించి ఎన్నో అంశాలలో సమాజం కోసం పాటుబడి సర్వం కోల్పోయారు. కుటుంబా లను తాము నమ్మిన జర్నలిజం సిద్ధాంతాల కోసం త్యాగం చేశారు. ఎప్పటి నుండో సమాజం లో పాతుకుపోయి ఉన్న మూఢ,అంధ విశ్వాసాల నుండి ప్రజలను మేల్కొ ల్పారు.చైతన్యపరిచారు. సమాజాభివృద్ధిలో,మనిషిమనుగడకోసం,విద్యా,వైద్యం,కూడు,గుడ్డ,నివాసం,ఉపాధి-ఉద్యోగం వంటి అవసరాలు ప్రతి మనిషికి ప్రభుత్వాలు కల్పించేందు కు జర్నలిస్ట్ లు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా సుమారు రెండు శతాబ్దాలుగా పనిచేస్తు న్నారు. రెండు శతాబ్దాలు గా ప్రజల పక్షాన పలు అంశాల లో మా జర్నలిస్ట్ లు ప్రజల కు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలకు ఓ దశ-దిశా నిర్దేశం చేస్తూ చాలా వరకు మార్గదర్శిలా ఉంటున్నాం. ప్రసార మాధ్యమాలు అందులో పనిచేసే జర్నలిస్ట్ ల కృషితోనే ఆయా ప్రభు త్వాలు ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాయి. ఇందులో ప్రజలకు సంక్షేమ పథకాలు,ఆయా ప్రాంతాల అభివృద్ది, వెనుకబడిన ప్రాంతాల పురోగమనం, జరుగుతుంది.ఇదంతా ఎలా సాధ్యపడుతుంది ప్రజలు ఆలోచించాలి. ఒక మహానుభావుడు దేశంలో పత్రికలు లేని సమాజాన్ని ఏ మాత్రం ఊహించలేనని అన్నాడు ఇందుకేనేమో...! మరో విషయం ఏమంటే సమాజంలో బాధ్యతగా పనిచేసే ఏ విభాగం అయినా నాలుగు రోజులు విధులు మానివేస్తే పరి స్థితులు ఎంత అల్లకల్లోలం గా ఉంటాయో తెలుసా... అదే విధానంతో జర్నలిస్ట్ లు,ప్రసార మాధ్యమాలు కూడా విధులు బంద్ చేస్తే లోకంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటా యి. ఇది గ్రహించిన ఓ మహానుభావుడు అందుకే పత్రికలు లేని సమాజాన్ని ఊహించలేను అన్నాడు. అంటే ఇక్కడ జర్నలిస్ట్ లకు,మీడియా రంగానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. గుడ్డి రాతలు కాదు... అక్షర కురుక్షేత్రం మా జర్నలిస్ట్ లది.... సమాజాభివృద్ది కోసం నాటికి నేటికీ ఆలోచన చేస్తూ,కనీస కృషి చేస్తోంది ఈ సమాజంలో ఒక్క జర్నలిస్ట్ మాత్రమే. ఎన్నో రంగాలు ఉన్నాయి అన్ని రంగాలు ప్రజావ్యవస్థ ను దోచుకోవడం తప్ప ప్రజాసంక్షేమం కోసం ఏ రంగం కృషి చేస్తుందో ఆ రంగం గురించి గొప్పగా చెప్పే వ్యక్తులు గుండెల మీద చేయి వేసుకుని ముందుకు రావాలి. 1835లో ప్రారంభం అయిన తెలుగు జర్నలిజం ప్రజల్ని మూఢ-అంధ విశ్వాసాల నుండి ఆధునిక యుగంలో అంతరిక్షానికి చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల వరకు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్య పరచడంలో జర్నలిస్ట్ ల పాత్ర కూడా కొంతమేరకు ఉందని అందరూ గ్రహించాలి. సామాజిక,ఆర్ధిక,ఆధ్యాత్మిక, చారిత్రాత్మక, రాజకీయ,సాంస్కృతిక, పారిశ్రామిక,విద్యా-ఉద్యోగ,వ్యవసాయ, కార్మిక, సినిమా వంటి ఎన్నో రంగాలలో మార్పు లు, ఉద్యోగుల హక్కులు, సమాన అవకాశాలు ప్రజలకు రాజ్యాంగం కల్పించగా, వాటిని కాపాడే దిశగా మా జర్నలిస్ట్ ల కలాలు ఎక్కడా.. కుంటి- గుడ్డి రాతలు,జీవం లేని రాతలు రాయలేదు. నిత్యం ప్రజాక్షేమం కోరుతూ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఉపాధి,అంటూ పోరాట మార్గంలో నడిచిన మా జర్నలిస్ట్ ల కలాలు రాసిన అక్షరాలు నిప్పు కణాలుగా రగిలి ప్రజల పక్షాన నాడు- నేడు పోరాడుతూనే ఉన్నాయి. అక్షరాలను ఆయుధాలుగా చేసుకుని మా జర్నలిస్ట్ లు ఈ చెడిపోయిన సమాజాన్ని బాగు చేయడానికి, మేల్కొ లపడానికి అక్షర సైనికులు గా సుదీర్ఘ కాలం గా అక్షర సమరం చేస్తున్నారు. ఈ క్రమంలో మా జర్నలిస్ట్ లు ఏమి సాధిస్తున్నారు. ఏమి కోల్పోతున్నారో...ఎవరైనా...ఎప్పుడైనా... కనీస మనసు పెట్టి ఆలోచిం చారా...?మా అక్షరాల పాఠక దేవుళ్ళారా...వీలైతే ఈ కధనం పూర్తిగా చద వండి.మీకు నచ్చితే విలువలు కలిగిన జర్నలిస్ట్ లకు ఓ చిన్న సెల్యూట్ కొట్టండి.మీకు ఇంకా నచ్చితే మా జర్నలిస్ట్ లను అగౌరవ పరచకుండా మీరు గౌరవించే జర్నలిస్ట్ ల గురించి నలుగురికి గొప్పగా చెప్పండి. దొంగ జర్నలిస్ట్ లకు ఈ చాప్టర్ లో రాయబడిన ఏ చిన్న అక్షరం కూడా వర్తించదు అని పాఠకులకు మనవి. జర్నలిస్ట్ లు ఏమి కోల్పోతున్నారు... మా ఆస్తి పాస్తులు ఏమిటో మీకు తెలుసా.....? రూపాయి ఆదాయం లేక గజం స్థలం లేక, బిడ్డల భవిష్యత్ బాగుచేయలేక, కుటుంబానికి ఏ భరోసా కల్పించలేక, కుటుంబ బరువు- భాద్యతలు పక్కనబెట్టి, పిల్లల ఎదుగుదల కళ్లారా... చూడలేక, వృద్దులైన తల్లిదండ్రులు ఆరోగ్య పరిరక్షణకు కనీస భాద్యతలు నెరవేర్చలేక, కన్న కూతుళ్ళ పెళ్ళికి కట్నాలు చెల్లించలేక 24 గంటలు,360 రోజులు నమ్ముకున్న జర్నలిజం కోసం మా జీవితాలు ప్రజా సంక్షేమం,సమాజాభివృద్ది, సామాజిక భాద్యత, సామాజిక భద్రత,అంటూ పగలు-రాత్రి తేడా లేకుండా అహో రాత్రులు జర్నలిజానికి అంకితమై, మా మీడియా సంస్థలకు లక్షల లక్షలు యాడ్స్ టార్గెట్స్ చేస్తూ,పత్రికలైతే సంవత్సర చందాలు, ఛానల్స్ అయితే వార్షికోత్సవాలు,ఇవి చాలక వాడు పుట్టాడు- వీడు సచ్చిన రోజు,అలాగే ఉగాది పంచాంగం,నూతన సంవత్సర క్యాలెండర్, ఇలా ఒకటేమిటి... సమాజ సంక్షేమం అనే అంశాన్ని అడ్డుపెట్టుకుని దేవుడు- దేవతల కల్యాణం జరిపించే మీడియా సంస్థల బూటకపు భక్తి-అందులో దోపిడీ..,అలాగే ఇక రాజకీయ నాయకులు అయితే వారు తుమ్మినా... ఆహా....,దగ్గినా... ఓహో.... అంటూ వారు పదవిలో ఉన్నా..., లేకపోయినా.... వారి మెప్పుకోలు కోసం విషయం ఉన్నా.... లేకున్నా... వార్తలు వేసి వారి వద్ద యాడ్స్ తీసుకురండి అని యాడ్స్ తేలేక పోతే పత్రిక నుండి ఛానల్ నుండి వెళ్లిపోండి మీరు మాకు అవసరం లేదనే మీడియా సంస్థల నుండి మేము ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు ఎంత టెన్షన్ పడుతూ,ఎన్ని కష్టాలు పడతామో...ఆ కష్టాలు ఎవరైనా గమనించారా...? ఇలా మా జర్నలిస్ట్ లు ఏమి కోల్పోతున్నాం,ఏమి సాధిస్తున్నాం అంటే దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న మమ్మల్ని,మా కుటుంబాలను ఒకసారి పరిశీలించండి. చాలా మంది ప్రజలు అను కుంటునట్లు జర్నలిజం వృత్తిలో మేము సాధించిన, సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమిటో మీకు తెలుసా....? ఈ వృత్తికి అంకితమైన మేము శరీరాలు చెదలు పట్టి షుగర్,బీపీ వంటి రోగాలతో కుళ్ళి, కుశించి పోయే దేహాలతో చావలేక, బ్రతకలేక జీవనం సాగిస్తు న్నాం. మీకు దగ్గరగా ఉన్న మా సీనియర్ జర్నలిస్ట్ ల ఆరోగ్య సమస్యలపై సరదాగా ఓ చిన్న పరిశోధన చెయ్యండి అదీ మీకు వీలుపడితే తెలుసుకునే ప్రయత్నం మాత్రమే...పది మందిలో సగానికి పైగా మా జర్నలిస్ట్ లు దీర్ఘకాలిక వ్యాధులతో (షుగరు-బీపీ) వీటి ద్వారా వచ్చే వ్యాధుల తో భాద పడుతున్నారు. చాలా మంది అనుకుంటున్నట్లు వేలకు వేలు,లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు,ఎకరా లకు ఎకరాలు,లెక్కకు మించిన బ్యా0క్ బ్యాలెన్స్ లు కాదు మా ఆస్తులు. అమ్మలారా.. అయ్యాలా రా..మీకు ఓపిక ఉంటే... మా జర్నలిస్ట్ లని,మా కుటుంబాలను ఓ సారి పరిశీలించే ప్రయత్నం చేయండి. మా ఆస్తులు అంటే ఏమిటి అనేది మా దేహాలను పట్టి పీడిస్తున్న షుగర్,బీపీలు అని మీకు ఈజీగా అర్ధం అవుతుంది. వాటి వల్ల కలిగే ఇతర రోగాలు మా ఆస్తులు అని మీకు మా జర్నలిస్ట్ ల దేహాలు సజీవ సాక్ష్యాలుగా దర్శన మిస్తాయి. అప్పుడై నా మా ఆస్తులు ఏమిటి అనేది మీకు పూర్తిగా అర్ధం అవుతుంది.అలాగే ఇప్పుడు నేను చెప్పినది అంతా,మరి కొన్ని రంగాలలో ఉన్నప్పటికీ ఈ సమస్యలు 80% జర్నలిజం లో జర్నలిస్ట్ లు మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఈ వివరణ అంతా... జర్నలిజంలో విలువలు కలిగిన జర్నలిస్ట్ ల జీవి తాలు గురించే గానీ,జర్నలి జం ను అడ్డుపెట్టుకుని అపార ఆస్తులు సంపాదిం చిన దొంగ జర్నలిస్ట్ ల గురించి మాత్రం కాదని అందరూ అర్ధం చేసుకో వాలి.ఇక మా జర్నలిస్ట్ ల దీన గాధలు చెపితే ఎందుకురా.... ఈ బతుకు అనిపించకతప్పదు. అందుకే ఈ కధనం ఏ "సిరా"తో రాసినా, ఏ "కలం"తో రాసినా తక్కువే అని మొదలు పెట్టడం జరిగింది. *జర్నలిజంలో ప్రత్యేక హోదాల కోసం* ఈ జర్నలిజంలో జర్నలిస్ట్ అనే పదమే ఒక పెద్ద హోదా...నర్నలిస్ట్ అయ్యేందుకు విశ్వప్రయ త్నాలు....అయ్యాక జర్నలిస్ట్ గా పలు హోదాల కోసం వెంపర్లాట....ఇదండీ సరిగ్గా ఇక్కడ ప్రారంభం అవుతుంది. మా జర్నలిస్ట్ ల పతనం.ఇప్పటికే రెండు, మూడు చాప్టర్స్ లో చెప్పా ఒక వాఖ్యం. అయితే ఆ వాఖ్యానికి సరియైన అర్థం మీకు ఇక్కడ దొరుకు తుంది.ఆ వాఖ్యం ఇదే మనసు పెట్టి అర్ధం చేసుకోండి .. అందరికంటే ముందుండాలని జర్నలిజంలో పలు రకాల హోదాల కోసం ప్రయ త్నించి ఆ హోదాలు నిలుపుకోవడం కోసం మా జర్నలిస్ట్ లు పెట్టే అలుపెరుగని పరుగులు కేవలం స్మశానాల్లో అంతం అవుతున్నాయి.... ఇదీ అసలు కథ.జర్నలిస్ట్ ల కట్టె మిగిల్చిన కన్నీటి గాధలు కథనానికి మూలం పైన చెప్పబడిన ఈ వాఖ్యం. ఇది ఎంతమంది గ్రహించగలరు.... దీనికి మీకు పూర్తి వివరణ ఇస్తున్నాను. కావాలంటే మా జర్నలిస్ట్ లను పరిశీలించండి. సాధారణ జర్నలిస్ట్ హోదా మామూలే.అయితే హోదా అని చెప్పాను కదా...!అదే ఈ హోదాల కధ.సబ్ ఎడిటర్ ఇదో హోదా... కాపీ ఎడిటర్, స్టేట్ బ్యూరో, ఇంకా రీజనల్ కో-ఆర్డి నేటర్, బ్యూరో ఇన్ ఛార్జ్,స్టాఫ్ రిపోర్టర్,సిటీ రిపోర్టర్, ఆర్.సీ ఇన్ఛార్జ్, క్రైమ్ రిపోర్టర్,అగ్రి జర్నలిస్ట్, బిజినెస్ రిపోర్టర్, స్పోర్ట్, ఎడ్యుకేషన్, పొలిటికల్, సినిమా పలు రకాల బీట్ జర్నలిస్ట్ వంటి జర్నలిస్ట్ హోదాల కోసం ఉదయం కోడి కూతకు ముందు మొదలయ్యే పరుగు అర్థరాత్రి వరకు ఆగేది లేదు. కొంచెం, ఇంకొంచెం కష్టపడితే ప్రస్తుతం ఉన్న హోదాను దాటి మరో హోదాకు వెళతాం అనే ఆలోచనలో 24 గంటలు,360 రోజులు విరామం ఎరుగని పరుగులే తప్ప ఎంత పరుగులు పెట్టినా సాధించాలి అనుకున్న హోదా సాధ్య పడినా, పడకపోయినా రూపాయి ఆదాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెరిగే అవకాశం లేదు. అయినా మా జర్నలిస్ట్ ల పోరాటం ఎక్కడా ఆగదు... స్మశానంలోనే ఈ పరుగుకు ముగింపు అని తెలుసు కోలేని పోరాటం మా జర్నలిస్ట్ లది. వార్తా సేకరణకు పడిగాపులు..... ఈ పడిగాపులు ఏ పగవాడికి రాకూడదు.ఆ జర్నలిస్ట్, ఈ జర్నలిస్ట్ అనే హోదా కోసం ఒక్కో హోదా జర్నలిస్ట్ గా నియామకం ఆయిన మా విలేకరుల దినచర్య ఇలా ఉంటుంది. ఇందులో కొన్ని రకాల హోదా కలిగిన జర్నలిస్ట్ లు వార్తలు సేకరణకు కోడి కూత కంటే ముందు నిద్రలేచి తాను పనిచేస్తున్న ప్రాంతానికి చేరుకోవాలి. అలాగే మరి కొన్ని జర్నలిస్ట్ హోదాలో పని చేస్తున్న జర్నలిస్ట్ లు అర్ధరాత్రి దాటే వరకు నిద్రాహారాలు మాని వార్తా సేకరణకు కట్టుబడి ఉండాలి.... ఈ క్రమంలో ఉదయం వేకువజామున ఫీల్డ్ లోకి వచ్చే జర్నలిస్ట్, నుండి అర్ధరాత్రి అనంతరం ఇంటికి వెళ్ళే జర్నలిస్ట్ వరకు ఎవరికి వారిగా ఉదయం అల్పాహారం ఎక్కడ...?మధ్యాహ్నం భోజనం మాటేమిటి...?రాత్రికి డిన్నర్ ఎలా...?మా జర్నలిస్ట్ ల జేబులు ఎప్పుడూ చిల్లులు పడే ఉంటాయి కదా...!జేబులు ఎంత వెతికినా ఏదో తగులుతుంది గానీ...!ఏ జేబులోనూ,పావలా... బిళ్ళ దొరకదు. ఈ కారణంతో ఆఫ్ లీటర్ వాటర్,ఎవరో పరిచయ స్థులు ఇచ్చే టీ తప్ప నాలుకమీద పేరుకు పోయిన పాచి అంగిట్లోకి దిగి కడుపులోకి జారిపోతే అదే మాకు ఆహారం అయ్యేది. రోజు ఇదే పరి స్థితి సమయానికి ఒకటి రెండు ముద్దలైనా ఆహారం తీసుకోకపోతే షుగర్ వ్యాధి తప్పదు అని డాక్టర్స్ ఎన్ని సార్లు హెచ్చరించినా వృత్తి ధర్మం పాటించే మా జర్నలిస్ట్ లు ఎక్కడా ఈ పరుగులు ఆపటం లేదు. ఈ పడిగాపులకు ఒక కారణం ఉంది. ఏ హోదా లో పని చేసే జర్నలిస్ట్ అయినా ఉదయాన్నే నియోజకవర్గ కేంద్రానికి చేరుకోవాలి. ఇక ఉదయం నుండి రాత్రి వరకు 10 నిమిషాలు కూడా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడానికి లేదు. ఒక వేళ వెళ్ళామా...ఈ లోపు ఏదైనా సంఘటన జరిగితే దానికి సంబంధించిన వార్త విజువల్స్ కవర్ చేయలేక పోతే మా మీడియా సంస్థ ల పై స్థాయి వ్యక్తుల తో నీ యమ్మ...!వాడి...అమ్మ...!ఏం... పీకుతున్నావు....!ఏం పొడుతున్నావు....!అనే బూతు పురాణం మమ్మల్ని చెప్పుకోలేని ఆవేదనకు గురి చేస్తుంది. అందుకోసం ఉదయం వుండి అర్ధరాత్రి వరకు మమ్మల్ని నియామకం చేసిన ప్రాంతాల్లో ఏ చెట్టో, పుట్టో,షెడ్డో చూసుకుని గోతికాడ నక్కల్లా జీవి స్తున్నాం.ఈ క్రమంలోనే సరియైన సమయానికి ఆహారం లేక షుగర్ వ్యాధి కి,ఇక ఆ వార్త-ఈ వార్త, అదేమిటి...?ఇదేమిటి...?అంటూ సవాలక్ష ప్రశ్నలకు జవాబులు,ఏక్షణంలో ఏమడుగుతారో తెలియని టెన్షన్ మధ్య షుగర్ తో పాటు బీపీ ఈ రెండు వ్యాదుల వల్ల కలిగే ఇతర వ్యాధులు మా జర్నలిస్ట్ ల దేహాలను ఆవహించి మా శరీరాలను,అవయవాలను స్లో పాయిజన్ లా తినేస్తు న్నాయి. అంతుపట్టని వ్యాధులు- అల్లకల్లోలంగా జీవితాలు ఇప్పటి వరకు మా జర్నలిస్ట్ లకు షుగర్,బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావటానికి కారణం తెలుసుకున్నాం.షుగర్-బీపీలే కదా...!ఏముంది అను తేలిగ్గా తీసుకోకండి. అలాగే ఈ రోజున ఇవి సహజం అయినప్పటికీ ఇక్కడ సింహ భాగం ఈ వ్యాధుల కు గురై జీవితాలు అల్లకల్లోలమై అత్యధికంగా వేధనలకు, పీడనకు గురవుతున్న వ్యక్తుల్లో జర్నలిస్ట్ లే ఎక్కువమంది ఉన్నారు. వృత్తిపరంగా సమయానికి నిద్రాహారాలు లేక,వత్తిడి-టెన్షన్,అతిగా ఆలోచన వంటి విధానాల వల్ల మా జర్నలిస్ట్ లు ముందుగా షుగర్ వ్యాధికి గురవుతున్నారు. షుగర్- బీపీలు అన్న దమ్ముల వంటివి అని చాలామంది చెబుతారు. ఈ క్రమంలో షుగర్ వచ్చిన కొన్నాళ్ళకు బీపీ కూడా వస్తుంది. ఇక ఈ రెండు వ్యాధులు మా జర్నలిస్ట్ లను ఆవహించినప్పటికి వృత్తి పరంగా మా దిన చర్య మామూలే.దీని కారణంగా ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేని మా జర్నలిస్ట్ లు ఏమి త్యాగం చేసి ఏమి కొని తెచ్చుకుం టున్నారో చూడండి. షుగర్,బీపీల వల్ల క్రమ క్రమంగా శరీరంలో ఒక్కో భాగం పాడవుతాయి జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్స్ తో పాటు ఎందరు హెచ్చరించి నా జర్నలిజమే జీవితంగా, జర్నలిస్ట్ అనేదే..అతి పెద్ద హోదాగా మొదలు పెట్టిన పరుగులో ప్రాణాలు హరించే వ్యాధులకు గురయినప్పటికి గానీ తెలియటంలేదు. ఇక ఈ షుగర్, బీపీల వల్ల కిడ్నీలు ఫెయిల్,హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్, కంటి చూపు,పంటి సమస్యలు, ఒకటేమిటి... ఈ వ్యాధులు వచ్చిన జర్నలిస్ట్ లు నరకయాతన అనుభవి స్తున్నారు. ఇంతటి నరకయాతన ఏ పాపం చేసుకుంటే వస్తుందో మరి..! పడుకుంటే అటు-ఇటు కదలలేని పరిస్థితి, కూర్చుంటే లేవలేక-లేస్తే కూర్చోలేక, మల-మూత్రాలకు వెళితే అక్కడ కలిగే ఇబ్బందులు బయటకు చెప్పుకోలేక, ఒంటరిగా నాలుగు అడుగులు వేయలేక జీవంలేని నడక, ఏ మాత్రం పట్టులేని తుంటి చేతులు, బేల చూపులు ఇక వ్యాధుల నివారణకు అవసరమైన మెడిసిన్ కొనుగోలుకు కనీసం వంద రూపాయలు దొరక్క ఆసుపత్రి బెడ్డులపై, ఇంటిలో మంచాలపై ఓ మూల చెత్త-పేడ దిబ్బల్లో పురుగుల్లా అంతు చిక్కని రోగాలతో శరీరాలు కుశించి పోతూ,కుళ్ళిపోతుంటే కొందరు జర్నలిస్ట్ లు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. మరి కొందరు పైన చెప్పబడిన వ్యాధులతో పాటు సీనియర్ డాక్టర్స్ కి కూడా అంతుబట్టని మరి కొన్ని రకాల వ్యాధులతో కానరాని లోకాలకు చేరుతున్న మా జర్నలిస్ట్ కుటుంబాల కన్నీటి గాధలు చెప్పుకుంటే మామూలు వ్యధలు కాదు.సింపుల్ గా చెప్పాలి అంటే... కన్నీటి బొట్టు బరువుగా ఉండక పోవచ్చు కానీ ఆ కన్నీటి బొట్టు వెనుక మోయ లేనంత బరువైన బాధలు ఉన్నాయి. జర్నలిజంలో జర్నలిస్ట్ ల తపస్సు... జర్నలిజాన్ని...ప్రేమించారు...ప్రేమించారు....ప్రేమించారు...తస్సదియ్య!ఎట్టకేల కు జర్నలిస్ట్ గా ఎదిగి పోయారు మా వాళ్ళు. ఇక్కడ కూడా చెపుతున్నా....ఈ అంశం కూడా విలువలతో పనిచేసి,నీతి-నిజాయితీ గా జర్నలిజం విలువలకు కట్టుబడి పని చేసిన జర్నలిస్ట్ ల తపన ఎలా ఉంటుంది. జర్నలిజంలో వారు కొనసాగించిన తపస్సు నాలుగు ముక్కల్లో ఓ సారి అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి చాలు. ప్రతీరోజు తూరుపు తెల తెల వారుతుండగా మసక- మసక చీకట్లో సద్ది-బొద్ధి తినే సమయం కూడా ఉండదు మా జర్నలిస్ట్ లకు,లేచిందే లేడికి 'పరుగు' లా,వార్తలు సేకరణ కోసం ఉదయం ప్రారంభం అయ్యే పరుగులే అడుగులుగా చేసుకున్నాం. జర్నలిజమే మార్గంగా ఎంచుకున్నాం. రెండు గుక్కలు దాహం- నాలుగు మెతుకులు ఆహారం సమయానికి అందుకోలేక ఆకలి-దప్పులకు ఓర్చాం. కుటుంబ భాద్యతలు- జీవన స్థితిగతులు మరిచాం.జర్నలిస్ట్ లు దొంగలు-ఈజీ మనీ సంపాదకులు అనే ఎన్నో నిందలు మోసాం. అవి నీతి-అక్రమాలు బయట పెడుతున్న క్రమంలో బెదిరింపులు, దాడులకు, హత్యలకు గురవుతున్నాం. అలివి కాని రోగాలతో కుళ్ళి,కుశించిపోతున్నాం. నిలువ నీడలేని బ్రతుకులు రెంట్ హౌస్ లే భారంగా ఆవాసం.మగపిల్లలకు చదువులు-ఆడ కూతుళ్ళ కు పెళ్ళిళ్ళు చేయలేని బికారీ బ్రతుకులు ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీడు చాంతాడు అంత లిస్టు మా జర్నలిస్ట్ ల జీవితాల భాగోతం. జర్నలిజం...జర్నలిస్ట్ కి ఓ..సంకల్పం ఇక దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న కొందరు విలువలు కలిగిన జర్నలిస్ట్ లు ఎలా ఉన్నారో... తెలుసా...?మరో లోకం తెలియని వ్యక్తులుగా మారిపోయారు.అన్నీ మరిచారు. ఈ రోజు వార్తలు ఏమిటి...?ప్రత్యేక కథనాల కోసం అన్వేషణ, వార్తా కథనాలను అవసర మైన రిఫరెన్సు సాధన, పాఠకులకు ఆశక్తికరమైన అంశాలు అందించాలని కొత్త కొత్త విషయాలు వెంట పరుగులు, సామాజిక అంశాలు, సామాజిక భాద్యత, వెలివాడల్లో అణిచి వేయబడుతున్న బ్రతుకులను చైతన్య పరుస్తూ రాస్తున్న ప్రత్యేక కధనాలుతో పాటు అనేక విషయాలపై ఎక్కడెక్కడో అలుపెరగని అన్వేషణ ఈ క్రమంలో శారీరక శుభ్రత మరిచి, చీకిపోయిన, చిరిగిపోయిన వస్త్రధారణ, చింపిరి జుట్టు,మాసిన గడ్డం, మనిషి ప్రక్కనే ఉన్నా కంటి చూపుకు- మాట పలకరింపుకు అందనంత దూరంగా ఉన్నట్లుగా ఏదో ఎవరికి తెలియని లోకంలో ఉంటున్నారు. బహుశా ఈ విధానమే జర్నలిజం అనే లోకం అనుకుంటా...ఈ జర్నలిజం కోసం మా జర్నలిస్ట్ ల తపస్సు ఎలా ఉందో... తెలుసుకున్నారు గా...అదీ మరి జర్నలిస్టుల సంకల్పం అంటే... ఇవి కాదా...జర్నలిస్ట్ ల కట్టె మిగిల్చిన కన్నీటి గాధలు. పాఠకులకు ఇక్కడ కూడా మరోసారి చెపుతు న్నా...విలువలతో జర్నలిజం చేసిన జర్నలిస్ట్ ల గురించి మాత్రమే ఈ అంశం రాయబడింది.... జర్నలిజం మా ఇజం.....

CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
2/5/2025, 2:28:08 PM
Image
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
2/5/2025, 2:28:07 PM
Image
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
2/5/2025, 2:28:06 PM
Image
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
2/5/2025, 2:28:09 PM
Image
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
2/5/2025, 2:28:05 PM
Image
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
2/5/2025, 2:28:03 PM
Image
Link copied to clipboard!