CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
January 31, 2025 at 07:12 AM
వరంగల్ జిల్లా: కొమ్మాలలో హల్ చల్ చేసిన అఘోరి.. స్థానికులు తిరగబడడంతో అక్కడి నుండి వెళ్లిపోయిన అఘోరి.. అఘోరి అని చెప్పుకుంటూ తిరుగుతున్న మహిళ నిన్న(గురువారం) రోజున కొమ్మాల గ్రామంలో ప్రత్యక్షమై హల్ చల్ చేసింది. స్థానికులు చుట్టూ ముట్టగా ఓ వ్యక్తి అఘోరివైన నువ్వు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని అడగగా అఘోరి అతడిపై దాడికి చేయడానికి ప్రయత్నించింది. స్థానికులు ప్రతిఘటించడంతో కారులో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

Comments