CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
February 1, 2025 at 05:34 AM
మహా కుంభమేళలో యువతి రచ్చ రచ్చ*
హైదరాబాద్:ఈ రోజు ప్రపంచం మొత్తం ఈ కుంభమేళా వైపే చూస్తోంది. ఇప్పటికే త్రివేణి సంగమం లో భక్తులు స్నానాలు చేస్తున్నారు. హిందువులు జరుపుకునే అతిపెద్ద వేడుకల్లో ఇది ఒకటి.
144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా జరుగు తోంది. దీంతో చాలామంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తున్నారు.మహాకుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
ఈ తరుణంలో త్రివేణి సంగమంలో తలస్నానం చేసి పాపాలు పోగొట్టుకునేం దుకు వివిధ ప్రాంతాల నుం చి వృద్ధులు, మహిళలు, సాధువులు, సన్యాసులు వస్తున్నారు.
అయితే ఓ యువతి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీల్స్ పిచ్చితో ఆ యువతి టవల్ కట్టుకుని పవిత్ర స్నానం చేయడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తు న్నాయి.
అర్ధనగ్నంగా ఉన్న తనను వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది.