CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
February 6, 2025 at 04:23 AM
Air India: ఫ్లైట్ టికెట్ రూ.1,499 నుంచి..
ఎయిర్ఇండియా 'నమస్తే వరల్డ్' సేల్
నమస్తే వరల్డ్ సేల్ ఫిబ్రవరి 2-6వ తేదీ వరకు ఉంటుందని, ఫిబ్రవరి 21-అక్టోబర్ 31 మధ్య ప్రయాణాలకు టికెట్లను ఎంచుకోవచ్చు
Air India: ఫ్లైట్ టికెట్ రూ.1,499 నుంచి.. ఎయిర్ఇండియా నమస్తే వరల్డ్ సేల్
టాటా గ్రూప్ యాజమాన్యంలో విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ఆదివారం 'నమస్తే వరల్డ్' పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. రానున్న వేసవి సెలవుల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఫ్లైట్ టికెట్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి టికెట్లపైన భారీ తగ్గింపు ఇవ్వనున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపింది. నమస్తే వరల్డ్ సేల్ ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉంటుందని, ఫిబ్రవరి 21 నుంచి అక్టోబర్ 31 మధ్య ప్రయాణాలకు టికెట్లను ఎంచుకోవచ్చని వివరించింది. ప్రత్యేక సేల్‌లో భాగంగా దేశీయంగా వన్-వే రూట్‌లో ఎకానమీ ఛార్జీలను రూ. 1,499 నుంచి, బిజినెస్ క్లాస్ రూ. 9,999 నుంచి అందిస్తోంది, అదే అంతర్జాతీయ ఎకానమీ ప్రయాణాల ఛార్జీలు రూ. 12,577, బిజినెస్ క్లాస్ రూ.20,870 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేక సేల్ ద్వారా రానున్న సెలవుల్లో తమ కస్టమర్లు ప్రయోజనాలు పొందుతారని ఎయిర్ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ అన్నారు. సేల్ ఆఫర్ల సందర్భంగా ఎయిర్ఇండియా అధికారిక వెబ్‌సైట్, యాప్ నుంచి బుక్ చేసుకునే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టికెట్లపై ఎలాంటి కన్వినియన్స్ ఛార్జీలను వసూలు చేయమని ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై అదనపు ఆఫర్లు కూడా ఉంటాయని కంపెనీ పేర్కొంది.