
CMTV COMMON MAN జర్నలిజం మా ఇజం
February 17, 2025 at 10:23 AM
నరసరావుపేట అంజిరెడ్డి హాస్పటల్లో శస్త్ర చికిత్స వికటించి బాలుడు మృతి
కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి మూడేళ్ల బాలుడు మృతి
మాకు అంజిరెడ్డి హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా.. గతంలో మా ఆయన విషయంలో మోసపోయాం.. గత్యంతరం లేక మా మనవడిని ఆసుపత్రిలో చేర్పించాం... అంటూ సంతమాగులూరు కు చెందిన సుధాకర్, లక్ష్మి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో అంజిరెడ్డి హాస్పిటల్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి మూడేళ్ల బాలుడు విక్రమ ఆదిత్య ఆదివారం మృతి చెందాడు. మృతుడు నాయనమ్మ తాతయ్యలు మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కి ముందు బాలుడు బాగానే ఉన్నాడని అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించి అంతా బాగుందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తామని చెప్పి తమ వద్ద లక్ష యాభై వేలు డిమాండ్ చేసి చివరకు 50వేల రూపాయలు కట్టించుకుని కనీసం రసీదు కూడా ఇవ్వలేదని తెలిపారు. సర్జరీ అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సర్జరీ సక్సెస్ అని బాలుడు మత్తులో ఉన్నాడని చెప్పినట్లు తెలిపారు. నాలుగు గంటల నుండి ప్రతి అరగంటకు ఒకసారి బాలుడికి ఫిట్స్ వచ్చాయని, జ్వరం వచ్చిందని, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని రకరకాలుగా చెప్తూ మభ్యపెడుతూ సాయంత్రం ఏడు గంటలకు బాలుడు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిపారు. గతంలో ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు ఉన్న జిల్లా వైద్యాధికారులు అమ్ముడుపోవటంతో ఆసుపత్రి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనీ ఆసుపత్రి వద్ద పలువురు చర్చించుకుంటున్నారు. ఆసుపత్రి యాజమాన్యం ఆర్థిక, రాజకీయ బలంతో అందరినీ మేనేజ్ చేస్తూ రోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆసుపత్రి వద్ద పలువురు చర్చించుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు ఆసుపత్రి ముందు బైఠాయించిన తీరు పలువురుని కన్నీరు పెట్టించింది.