Vedic chants
Vedic chants
February 21, 2025 at 01:36 AM
*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 21 2025 🌟 శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణ పక్షం తిథి: *అష్టమి ఉ.8.38 కు* తదుపరి *నవమి 22 ఉ.9.43* వారం: *భృగువారం (శుక్రవారం)* నక్షత్రం: *అనూరాధ మ.12.46 కు* తదుపరి *జ్యేష్ఠ 22 మ.2.30 కు* యోగం: *వ్యాఘాత ఉ.11:58 కు* తదుపరి *హర్షణ 22 ఉ.11:55 కు* కరణం: *కౌలవ ఉ.11:58 కు* తదుపరి *తైతుల రా.12.44 కు* రాహుకాలం: *ఉ. 10.30 - 12.00 కు* దుర్ముహూర్తం: *ఉ. 09.04 - 09.47 కు, మ. 12.52 కు - 01.38 కు* వర్జ్యం: *సా.6.46-8.28 కు* అమృతకాలం: *లేదు* సూర్యోదయం: *ఉ. 6:31 కు* సూర్యాస్తమయం: *సా. 5:51 కు* *గురుబోధ:* బ్రహ్మ, విష్ణువుల ఇద్దరి మధ్య యుద్ధం ఆపడం కోసం మాఘమాసంలో లోకశ్రేయస్సు కోసం ఈశ్వరుడు ఒక అగ్నిస్తంభరూపం ధరించాడు. ఇది శివలింగం అని పిలువబడుతుంది. ఈ లింగమునకు రూపము ఉంది. రూపము లేదు. ఆకారము ఉంటుంది కాబట్టి లింగం ఇటు సగుణము, నిర్గుణము కూడా. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగ రూపం ధరించాను, కనుక ఈ కాలమును లింగోద్భవకాలము అని అంటారు. ఈ లింగోద్భవకాలములో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు. వారికున్న ఈతి బాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు.

Comments