Vedic chants WhatsApp Channel

Vedic chants

124 subscribers

About Vedic chants

All Hindu religious rituals Conducted ( Including of Puja, Homas and other activities). These activities are extended global wide through virtual mode. We also undertaking veda and sloka classes. Kindly do reach out below. Phone number: 9841012755 Email ID: [email protected]

Similar Channels

Swipe to see more

Posts

Vedic chants
Vedic chants
5/26/2025, 2:28:58 AM

*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 26 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం తిథి: *చతుర్దశి మ.12.57 కు* తదుపరి *వైశాఖ అమావాస్య 27 ఉ.10.34 కు* వారం: *ఇందువారము (సోమవారం)* నక్షత్రం: *భరణి ఉ.7.36 కు* తదుపరి *కృత్తిక 27 ఉ.5.58 తదుపరి 28 రోహిణి తె.4.17 కు* యోగం: *శోభన ఉ.7:01 కు* తదుపరి *అతిగండ రా. 02:54 కు* కరణం: *శకుని మ.12.12 కు* తదుపరి *చతుష్పాద రా.10.21 కు* రాహుకాలం: *ఉ. 07.30 - 09.00 కు* దుర్ముహూర్తం: *12:39-1:30 కు, మ. 3:14-4:05 కు* వర్జ్యం: *రా.6.47-8.17 కు* అమృతకాలం: *తె. 03:25 - 04:50 కు* సూర్యోదయం: *ఉ. 5:31 కు* సూర్యాస్తమయం: *సా. 6:21 కు* 🕉️ *సోమవతీ అమావాస్య* 🕉️ *గురుబోధ:* సోమవారం నాడు అమావాస్య తిథి వస్తే దానిని సోమవతీ అమావాస్య అంటారు. పూర్వం నిరీశ్వర యాగమైన దక్షయజ్ఞానికి వెళ్ళిన చంద్రుడు వీరభద్రునిచే శిక్షింపబడి, ఆరోగ్యం కోసం సోమవతీ అమావాస్య నాడే ఈశ్వరాభిషేకం చేసుకొని సంపూర్ణ అరోగ్యం పొందాడు. ఈ రోజున పంచారామాలను దర్శించుకున్నవారు, అభిషేకం చేయించుకున్నవారు సంపూర్ణ అరోగ్యవంతులవుతారు. కుల, లింగ, వయో భేదాలు లేకుండా అందరూ సూర్యోదయానికి ముందే లేచి రాహుకాలం (ఉ.7.30 నుండి 9.00)లో శివునికి అభిషేకం చేసుకొని, బిల్వపత్రాలు, తెల్లని, పసుపుపచ్చని పుష్పాలతో పూజించినవారికి పిల్లల భవిష్యత్తు బాగుండి, భార్యాభర్తల మధ్య ఐకమత్యం సిద్ధిస్తుంది. శివపురాణం ప్రకారం ఈరోజు అశ్వత్థవృక్షానికి (రావిచెట్టుకి) చేసే ప్రదక్షిణ, పూజ వలన సకల శుభాలు పొందుతారు. శివపంచక్షరీ స్తోత్రం ఈరోజు పఠిస్తే ఎంతో మంచిది, ఈశ్వరకటాక్షం పొందుతారు. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. పితృ దేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్య నాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి.

Vedic chants
Vedic chants
5/25/2025, 12:50:35 AM

*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 25 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం తిథి: *త్రయోదశి మ.3.25 కు* తదుపరి *చతుర్దశి 26 మ.12.57 కు* వారం: *భానువారము (ఆదివారం)* నక్షత్రం: *అశ్వని ఉ.9.17 కు* తదుపరి *భరణి 26 ఉ.7.36 కు* యోగం: *సౌభాగ్య ఉ.11:06 కు* తదుపరి *శోభన 26 ఉ.7:01 కు* కరణం: *వణిజ సా.5:51 కు* తదుపరి *విష్టి రా.2.02 కు* రాహుకాలం: *సా. 04.30 - 06.00 కు* దుర్ముహూర్తం: *సా.4:57-5:48 కు* వర్జ్యం: *ఉ.5.33-7.03 కు, రా.6.12-7.42 కు* అమృతకాలం: *తె. 04:09 - 05:34 కు* సూర్యోదయం: *ఉ. 5:31 కు* సూర్యాస్తమయం: *సా. 6:21 కు* 🕉️ *మాసశివరాత్రి* 🕉️ *గురుబోధ:* మారేడుచెట్టు శివుని స్వరూపమే. శివునికీ, బిల్వవృక్షానికీ తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతిభక్తితో స్తుతిస్తారు. ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో అవన్నీ మారేడుచెట్టు మూలంలో (వ్రేళ్ళలో) ఉంటాయి. మారేడుచెట్టు మూలంలో లింగం ఒకదానిని కాని లేదా అనేక లింగాలను కాని ఉంచి పూజించినవాడు పరమపుణ్యాత్ముడౌతాడు. శివుని సన్నిధిని పొందగలుగుతాడు. మారేడుచెట్టు క్రింద స్నానం చేసినవాడు, సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలం పొంది, పవిత్రుడౌతాడు. గంధపుష్పాదులతో మారేడుచెట్టు మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. మారేడుచెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడై, తత్త్వజ్ఞానం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు. అందునా, కార్తిక మాసం లోనూ, మాఘ మాసం లోనూ, ప్రతి మాసశివరాత్రికీ, మారేడు దగ్గర ఆవునేతి దీపం వెలిగించినవాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది.

Vedic chants
Vedic chants
5/28/2025, 2:10:24 AM

*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 28 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం తిథి: *జ్యేష్ట శుద్ధ పాడ్యమి ఉ.8.25 కు* తదుపరి *విదియ 29 ఉ.6.20* వారం: *సౌమ్యవారము (బుధవారం)* నక్షత్రం: *మృగశిర రా.3.12 కు * తదుపరి *ఆరుద్ర 29 రా.2.15 కు* యోగం: *ధృతి సా.7:08 కు* తదుపరి *శూల 29 సా.3:46 కు* కరణం: *బాలవ సా.6:45 కు* తదుపరి *కౌలవ రా.1.25 కు* రాహుకాలం: *మ. 12.00 - 01.30 కు* దుర్ముహూర్తం: *ఉ.11:47-12:39 కు* వర్జ్యం: *ఉ.9.22-10.52 కు* అమృతకాలం: *సా. 4.33-5:59 కు* సూర్యోదయం: *ఉ. 5:29 కు* సూర్యాస్తమయం: *సా. 6:25 కు* *గురుబోధ:* శ్లో. కరవీర!వృషావాస! నమస్తే భానువల్లభ       దంభోళి మృడ దుర్గాది దేవానాం సతతం ప్రియం! జ్యేష్ఠ శుక్ల పాడ్యమినాడు దేవాలయ సంబంధమైన ప్రాంతంలో పూచిన గన్నేరు పువ్వును గంధం, కుంకుమ జల్లి భక్తితో నమస్కరించి ఈ పై శ్లోకం చదువుకోవాలి. ఇలా పలికి, ఆ పుష్పాన్ని ఆ ప్రాంగణమునకు చెందిన అర్చకులకు లేక పురోహితులకు దానం చెయ్యాలి. ఇలా చేసిన వారికి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం, జ్ఞాపక శక్తి లభిస్తాయి.

Vedic chants
Vedic chants
5/26/2025, 2:30:26 AM

*📿శుభోదయం*📿 ఒక మనిషి ఎంత నిజాయితీ పరుడో అతని ఆనందాన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఎందుకంటే నిజాయితీగా జీవించడo అనేది ఆనందానికి పర్యాయపదం. అందం కన్నా మనిషి మాటతీరే ప్రధానం.తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు. 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

🌼 1
Vedic chants
Vedic chants
5/23/2025, 11:58:59 PM

*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 24 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం తిథి: *ద్వాదశి సా.5.54 కు* తదుపరి *త్రయోదశి 25 మ.3.25 కు* వారం: *స్థిరవారము (శనివారం)* నక్షత్రం: *రేవతి ఉ.10.56 కు* తదుపరి *అశ్వని 25 ఉ.9.17 కు* యోగం: *ఆయుష్మాన్ సా.3:00 కు* తదుపరి *సౌభాగ్య 25 ఉ.11:06 కు* కరణం: *కౌలవ ఉ.8.58 కు* తదుపరి *తైతుల రా.7.20 కు* రాహుకాలం: *ఉ. 09.00 - 10.30 కు* దుర్ముహూర్తం: *ఉ.7:29-8:20 కు* వర్జ్యం: *లేదు* అమృతకాలం: *ఉ.11:37-01:04 కు* సూర్యోదయం: *ఉ. 5:31 కు* సూర్యాస్తమయం: *సా. 6:21 కు* ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చెయ్యాలి. *గురుబోధ:* ఎన్నో వేలజన్మల సంస్కారం, పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసే భాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్య ప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపగించుకోవడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకుపడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఏదో ఒక నామ, జప, పారాయణం, పురాణ శ్రవణంతో కాలం గడపాలి. తీర్థయాత్రలు చేయడం కుదరనప్పుడు తీర్థయాత్రలు చేసేవారికి ధన, వస్తు రూపములో ఎంతో కొంత సహాయం చేసినవారికి కూడా ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం కొంత వస్తుంది.

Vedic chants
Vedic chants
5/27/2025, 12:41:12 AM

*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 27 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం తిథి: *వైశాఖ అమావాస్య ఉ.10.34 కు* తదుపరి *జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి 28 ఉ.8.25 కు* వారం: *భౌమవారము (మంగళవారం)* నక్షత్రం: *కృత్తిక ఉ.5.58 కు తదుపరి రోహిణి 28 తె.4.17 కు* తదుపరి *మృగశిర 29 రా.3.12 కు* యోగం: *సుకర్మ రా.10:53 కు* తదుపరి *ధృతి 28 సా.7:08 కు* కరణం: *నాగ ఉ.8.32 కు* తదుపరి *కింస్తుఘ్న సా.6:45 కు* రాహుకాలం: *మ. 03.00 - 04.30 కు* దుర్ముహూర్తం: *ఉ.8:20-9:12 కు, మ. 11:06-11:51 కు* వర్జ్యం: *రా.8.54-10.24 కు* అమృతకాలం: *రా.12.00-1.25 కు* సూర్యోదయం: *ఉ. 5:31 కు* సూర్యాస్తమయం: *సా. 6:21 కు* 🕉️ *శనైశ్చర జన్మతిథి, హనుమంతుడు బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి వరము పొందిన రోజు* 🕉️ *గురుబోధ:* పూర్వం సూర్యభగవానుడికి, ఛాయాదేవికి శనైశ్చరుడు వైశాఖమాసం అమావాస్య నాడు జన్మించాడు. అందుకే వైశాఖ అమావాస్య శనైశ్చర జన్మ తిథి అని పిలవబడుతుంది. ఈ రోజు నవగ్రహాలయానికి వెళ్ళడం, అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వడం లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని (శనైశ్చరుడుకి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటు పక్క గాని ఇటు పక్క గాని కూర్చొని) అనగా కోణంలో కూర్చుని, శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం | ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం || అనే శ్లోకాన్ని చదువుకోవాలి. వైశాఖమాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడ్ని పట్టుకోవడానికి ఆకాశానికి ఎగిరాడు, బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి అనేక వరములు పొందాడు కాబట్టి ఏదైనా హనుమంతుని స్తోత్రము చదువుకొని, కథ వినాలి.

Vedic chants
Vedic chants
5/30/2025, 1:44:07 AM

*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 30 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం తిథి: *చతుర్థి రా.3.27 కు* తదుపరి *పంచమి 31 రా.2.16 కు* వారం: *భృగువారము (శుక్రవారం)* నక్షత్రం: *పునర్వసు రా.1.35 కు* తదుపరి *పుష్యమి 31 రా.1.23 కు* యోగం: *గండ సా.12:56 కు* తదుపరి *వృద్ధి 31 ఉ.10:43 కు* కరణం: *వణిజ ఉ. 10:15 కు* తదుపరి *విష్టి రా.8.23 కు* రాహుకాలం: *ఉ. 10.30 - 12.00 కు* దుర్ముహూర్తం: *ఉ.8:20-9:12 కు, మ. 12:39-1:31 కు* వర్జ్యం: *ఉ.1.55-3.15 కు* అమృతకాలం: *రా. 07.12 - 08.43 కు* సూర్యోదయం: *ఉ. 5:29 కు* సూర్యాస్తమయం: *సా. 6:26 కు* *గురుబోధ:* జ్యేష్ఠమాసానికి శ్రేష్ఠమాసం అని పేరు ఎందువలన వచ్చిందంటే జ్యేష్ఠమాసం ఉత్తరాయణ కాలంలో సుముహూర్తాలు ఉండే మాసములలో చివరి మాసం (మూఢమి వస్తే లెక్కలోకి రాదు). దేవాలయాల ప్రతిష్ఠలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతున్న చిట్టచివరి మాసం అని భీష్ముని వంటి వారు చెప్పారు. అటువంటి అపూర్వమాసంలో శ్రీమన్నారాయణుడిని, పరమశివుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. యథాశక్తి దానధర్మాలు చేయడం సకల పాపహరం.

Vedic chants
Vedic chants
5/29/2025, 1:44:35 AM

*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 29 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం తిథి: *విదియ ఉ.6.20 కు* తదుపరి *తదియ 30 తె.4.33 కు* వారం: *బృహస్పతివారము (గురువారం)* నక్షత్రం: *ఆరుద్ర రా.2.15 కు* తదుపరి *పునర్వసు 30 రా.1.35 కు* యోగం: *శూల మ.3:46 కు* తదుపరి *గండ మ.12:56 కు* కరణం: *తైతుల మ.12.32 కు* తదుపరి *గరజి రా.11.18 కు* రాహుకాలం: *మ. 01.30 - 03.00 కు* దుర్ముహూర్తం: *ఉ.10:04-10:55 కు, మ. 3:14-4:06 కు* వర్జ్యం: *ఉ.1.47-1.17 కు* అమృతకాలం: *మ. 01.24 - 02.53 కు* సూర్యోదయం: *ఉ. 5:29 కు* సూర్యాస్తమయం: *సా. 6:25 కు* *మహారాణాప్రతాప్ జయంతి* *గురుబోధ:* జ్యేష్ఠ శుక్ల విదియ నాడు సూర్యుని పూజిస్తే ఆరోగ్యం, వ్యాకరణ పాండిత్యం లభిస్తాయి. సూర్యభగవానుని ప్రీత్యర్థం ఆదిత్యస్తవము లేదా ఆదిత్య హృదయం పారాయణం కానీ శ్రవణం కానీ చేయడం వలన అన్నింటా విజయం లభిస్తుంది, సకలశుభప్రదం.

Vedic chants
Vedic chants
5/25/2025, 12:50:18 AM

இன்றைய பூஜா சங்கல்பம் : 25/05/25 . வைகாசி : 11 . ஞாயிற்று கிழமை . ஸூர்ய உதயம் : காலை 05--52. ஸூர்ய அஸ்தமனம் : மாலை 06--27. இன்று சம ↔️ நோக்கு நாள். ---------------------------------------- மேல் ⬆️நோக்கு நாள் : நகை,வீடு,மனை வாங்க, கட்டடம் எழுப்ப, பத்திரம் பதிய, ஒப்பந்தம் செய்ய. ************************ சம நோக்கு நாள் : ↔️. வாகனம் வாங்க , தளம் அமைக்க , வயலில் உழ. ************************* கீழ் நோக்கு நாள் :🔽. போர்வெல், பூமிக்கு கீழே செய்யும் வேலை, கிழங்கு பயிரிட. ---------------------------------------- இன்றைய திதி : திரியோதஸி ( பிற்பகல் 01--56 மணி வரை ) , பிறகு சதுர்த்தஸி.. . சிரார்த்த திதி : கிருஷ்ண- திதித்வயம் . நக்ஷத்திரம் : அஸ்வினி காலை 09--14 மணி வரை பிறகு அபபரணி நட்சத்திரம். பஷம் : கிருஷ்ண-- பஷம்.. நேத்திரம் : இன்று முழுவதும் குருட்டு : 0. ஜீவன் : இன்று காலை 09--10 மணி வரை அரை அரை வாழ்க்கை : 1/2, பிறகு பிற்பகல் 02--21 மணி வரை உயிறற்றவை : 0 , பிறகு அரை வாழ்க்கை: 1/2. அமிர்தாதி-யோகம் : இன்று முழுவதும் சித்தயோகம் . சூலம் : மேற்கு. பரிகாரம் : வெல்லம் . பிறை : தேய்பிறை 🌛 இன்றைய விஸேஷம் : *********************** மாத சிவராத்ரி. திதித்வயம். த்யாஜ்யம் : 03:05 , 30:46 [ 04:42 , 34:47_த்ருக் ]. சந்த்ராஷ்டமம் : ++++++++++++++ கன்னி 26--05--25 மதியம் 01--40 மணி வரை.. .... கௌரி நல்ல நேரம் : '''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' காலை:10--30~~11--30. பகல்: 01--30~~02--30. நல்ல நேரம் : காலை:06--00~~07--00. மாலை:03--30~~04--30. ராகு காலம்: மாலை:04--30~~06--00. எமகண்டம்: பகல்: 12--00~~01--30. குளிகை: மாலை:03--00~~04--30. ************************* ஸங்கல்பம் : """"""""""""""""""""" ஶுக்லாம்ப³ரத⁴ரம் விஷ்ணும் ஶஶிவர்ணம் சதுர்பு⁴ஜம் ப்ரஸன்ன வத³னம் த்⁴யாயேத் ஸர்வ விக்⁴னோபஶாந்தயே மமோபாத்த ஸமஸ்த து³ரிதக்ஷயத்³வார ஶ்ரீ பரமேஶ்வர ப்ரீத்யர்த²ம் ததே³வ லக்³னம் ஶுதி³னம்ʼ ததே³வ தாராப³லம் சந்த்³ர ப³லம் ததே³வ வித்³யாப³லம் தை³வப³லம் ததே³வ அங்க்³ரியுக³ம் ஸ்மராமி ஶுபே⁴ ஶோப⁴னே முஹூர்த அத்³யப்³ரஹ்மண꞉ த்³விதீய பரார்தே² ஶ்வேதவராஹகல்பே வைவஸ்வத மன்வந்தரே அஷ்டா²விம்ஶதிதமே கலியுகே³ ப்ரத²மேபாதே³ ஜம்பூ³த்³தீ⁴பே பா⁴ரதவர்ஷே ப⁴ரதக²ண்டே³ மேரோ꞉ த³க்ஷிணேபார்ஶ்வே ஶகாப்³தே³ அஸ்மின் வர்தமானே வ்யாவஹாரிகே ப்ரப⁴வாதி³ ஷஷ்டி² ஸம்வத்ஸராணாம் மத்⁴யே *விஸ்வாவஸு* நாம ஸம்வத்ஸரே *உத்தராயணே வஸந்த - ருதௌ* மேஷ ( வைஸாக ) மாஸே *கிருஷ்ண-பக்ஷே அத்₃ய திரியோதஸ்யாம் ( பிற்பகல் 01--56 மணி வரை பிறகு ) ததுபரி சதுர்த்தஸ்யாம் ஶுப₄திதௌ₂ *வாஸர வாஸரஸ்து பானு வாஸர ₄ யுக்தாயாம் அஸ்வினீ ( காலை 09--14 மணி வரை பிறகு ) ததுபரி அபபரணீ நக்ஷத்ர யுக்தாயாம்ʼ சௌபாக்கியம் ( காலை 09--27 மணி வரை பிறகு ) ததுபரி ஸோபனம் நாம யோக யுக்தாயாம்ʼ கரசை ( அதிகாலை 03--09 மணி வரை பிறகு ) ததுபரி வணிசை ( பகல் 01--56 மணி வரை பிறகு ) ததுபரி பத்திரை நாம கரண யுக்தாயாம்ʼ ஏவங்கு₃ண விஸேஷண விஶிஷ்டாயாம் வர்த்தமானாயாம் திரியோதஸ்யாம் ( பிற்பகல் 01--56 மணி வரை பிறகு ) ததுபரி சதுர்த்தஸ்யாம் ஶுப₄திதௌ₂ மம ஸக குடும்பானாம் ஸர்வாபிஷ்டா ஸித்தியர்த்தம் கிருஹஸ்ய ஆர்த்தியமான தேவதா ப்ரசாத ஸித்தியர்த்தம் நித்ய பூஜாம் அத்ய கரிஷ்யே... ஸௌரமான சிராத்த திதி : ரிஷப_கிருஷ்ண_ திரியோதஸி, _சதுர்த்தசி . சாந்த்ரமான சிராத்த திதி: வைஸாக_பஹுள_ திரியோதஸி , சதுர்த்தசி.. [ ஷண்ணவதி ஸ்ராத்தம் 26--05--25 திங்கள் ஸர்வ அமாவாஸை. 05--06--25 வியாழன் வ்யதீபாதம். சுபம்.

Vedic chants
Vedic chants
5/23/2025, 2:45:40 AM

L*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 23 2025 🌟 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం తిథి: *ఏకాదశి రా.8.16 కు* తదుపరి *ద్వాదశి 24 సా.5.54 కు* వారం: *భృగువారము (శుక్రవారం)* నక్షత్రం: *ఉత్తరాభాద్ర మ.12.27 కు* తదుపరి *రేవతి 24 ఉ.10.56 కు* యోగం: *ప్రీతి సా.6:36 కు* తదుపరి *ఆయుష్మాన్ 24 సా.3:00 కు* కరణం: *బవ ఉ.11.55 కు* తదుపరి *బాలవ రా.10.30 కు* రాహుకాలం: *ఉ. 10.30 - 12.00 కు* దుర్ముహూర్తం: *ఉ.8:20-9:12 కు, మ. 12:38-1:30 కు* వర్జ్యం: *రా.11.41-1.11 కు* అమృతకాలం: *ఉ.11:35-01:04 కు* సూర్యోదయం: *ఉ. 5:31 కు* సూర్యాస్తమయం: *సా. 6:21 కు* 🕉️ *వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి* 🕉️ ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణం రేపు చేయాలి. *గురుబోధ:* 1) వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి ‘వరూధిని’ అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. 2) ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి. తరువాత హరి పూజ చేయాలి. హరి పూజ చేయని ఏకాదశి వ్రతం వృథా. 3) ఈరోజు విష్ణువుకు ప్రత్యేకంగా గంధమును అరగదీసి, విష్ణు విగ్రహం పైన లేదా సాలగ్రామం పైన పూయాలి. గంధం పూసాక షోడశోపచారపూజ చేయాలి. అలా చేస్తే భయంకర పాపాలు తొలగి మహా పుణ్యం లభిస్తుంది. అనంతరం పుష్పములతో కానీ తులసి దళములతో కానీ బిల్వదళములతో కానీ విష్ణు లేదా కృష్ణ అష్టోత్తరశతనామాలతో పూజించాలి. పురుష సూక్తం, శ్రీ సూక్తం చదవాలి. ఏదైనా ఒక తీపి పదార్ధం నివేదించాలి.

Link copied to clipboard!