Vedic chants
Vedic chants
March 1, 2025 at 02:35 AM
*కాలం - అనుకూలం* ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 01 2025 🌟 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము శుక్ల పక్షం తిథి: *శుద్ద పాడ్యమి ఉ.7.05 కు * తదుపరి *విదియ 2 తె.4.55 కు* వారం: *స్థిరవారము (శనివారం)* నక్షత్రం: *పూర్వాభాద్ర మ.1.46 కు * తదుపరి *ఉత్తరాభాద్ర 2 మ.12.17 కు* యోగం: *సాధ్య సా.4.24 కు* తదుపరి *శుభ 2 మ.12.39 కు* కరణం: *బాలవ మ.1.43 కు* తదుపరి *కౌలవ రా.12:09 కు* రాహుకాలం: *ఉ. 09.00 - 10.30 కు* దుర్ముహూర్తం: *ఉ.08:11 - 08:58 కు* వర్జ్యం: *రా.10.46-12.16 కు* అమృతకాలం: *తె.04:40 - 06:06 కు* సూర్యోదయం: *ఉ. 6:25 కు* సూర్యాస్తమయం: *సా. 6:01 కు* 🕉️*శ్రీ రామకృష్ణపరమహంస జయంతి*🕉️ *గురుబోధ:* దుఃఖానికి మూలం జీవులు చేసే పాపాలు. పాపాలు కర్మను అనుసరిస్తాయి. మరలా మరలా కర్మలు చేసేలా జీవుడ్ని ప్రేరేపిస్తాయి. ఈ కర్మల నుండి బయటపడడం అంత తేలికకాదు. ఎన్ని జన్మలు ఎత్తినా కర్మబంధాల నుండి మాత్రం బయటపడలేక జీవులు నానాయాతనలు పడుతుంటారు. ఈ కర్మఫలాలు తొలగించి సకలదుఃఖవినాశనం చేసే దివ్య మాసం ఫాల్గుణ మాసం .

Comments