
PUBLIC ARMY APTS
January 31, 2025 at 08:54 AM
ప్రధానమంత్రి సూర్య ఘర్ - ఉచిత విద్యుత్ పథకం
సబ్సిడీ ద్వారా నివాస గృహాలకు సోలార్ విద్యుత్ వెలుగులు
👉 ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు 'ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన' (PM Surya Ghar yojana)* పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ ఇస్తోంది.
👉 పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం (PM Surya Ghar Muft Bijli Yojana) రాయితీ కింద ఒక్కో కిలోవాట్‌కు రూ.30వేలు సబ్సిడీని కేంద్రం అందిస్తుంది. రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు అయితే రూ.78 వేలు సబ్సిడీ లభిస్తుంది. మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేకుండా తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు పొందొచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
📌 Step 1: ముందుగా పీఎం సూర్యఘర్ (pmsuryaghar. gov.in) పోర్టల్‌లో పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.
📌 Step 2: కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. అక్కడ 'రూఫ్ టాప్ సోలార్’ కోసం అప్లయ్ చేసుకోవాలి.
📌 Step 3: దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
📌 Step 4: ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
📌 Step 5: నెట్ మీటర్‌ను ఇన్స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
📌 Step 6: ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.
#pmsuryaghar
#solarpanelsloan
#houseloan #janasenaforbettersociety #janasenapartyoffice #janasena #pawankalyan #nagababukonidela #kandaladurgaprasad #publicarmyapts #janasenaforbettersociety #janasenapartyoffice #ndaalliance #nda