PUBLIC ARMY APTS
January 31, 2025 at 01:44 PM
నందమిల్లిపాడు గ్రామస్తులకు ముఖ్యగమనిక
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పలు పాఠశాలలో కొన్ని అప్గ్రేడ్ చేస్తూ, మరికొన్ని పాఠశాలలు విలీనం చేస్తూ కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం,
ఈ ప్రక్రియలో భాగంగా రాబోయే రోజుల్లో మన నందమిల్లిపాడు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3,4,5 తరగతుల పిల్లలను సిద్దాపురం ప్రాథమిక పాఠశాలకు పంపవలెను కేవలం 2వ తరగతి వరకే నందమిల్లిపాడు పాఠశాల పరిమితం చేయాలని ,అఫ్ గ్రేడ్ లిస్ట్ లో సిద్ధాపురం ప్రాథమిక పాఠశాల ఉంది అనే విషయాన్ని తెలుసుకుని
రేపు అనగా
1/2/2025 ఉదయం 9:30 గంటలకు నందమిల్లిపాడు ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం జరుగును కావున తల్లిదండ్రులు గ్రామ పెద్దలు తప్పకుండా ఈ సమావేశమునకు హాజరు కావలసిందిగా తెలియజేయుచున్నాము.
ఎందుకు అంటే మన నందమిల్లిపాడు పాఠశాల యధావిధిగా 5వ తరగతి వరకూ కొనసాగించాలని తదితర అంశాలపై చర్చలు జరుపబడతాయి,
ప్రాథమిక పాఠశాల నందమిల్లిపాడులో 5వలకూ యదావిధిగా ఎందుకు ఉండాలంటే,
1, చిన్నవయసు పిల్లలు 1,3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు, మేయిన్ రోడ్ లో నిత్యం వాహనాలు రద్దీ మద్య 3,4,5వ తరగతి చిన్న పిల్లలు ఆ రోడ్ లో నిత్యం రాకపోకలు అంత శ్రేయస్కరం కాదు.
2, తరచూ ఎఫ్ సి ఐ గోడౌన్స్ వ్యాగన్స్ వస్తుంటాయి రోడ్లపై పెద్ద వాళ్ళే వాహనాలు నడపలేని పరిస్థితి ఇంచుమించు 1,3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దాపురం ప్రాథమిక పాఠశాలకు 3,4,5 తరగతుల చిన్న పిల్లలను ఎలా పంపుతారు? ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు?
3,చిన్న పిల్లలు 3,4,5వ తరగతులవారిని సిద్ధాపురం ప్రాథమిక పాఠశాలకు పంపాలి అంటే మార్గం మధ్యలో మేయిన్ రోడ్ ప్రక్కన బ్రాంది షాప్ ఉంటుంది అక్కడ ఎవరైనా తాగిన మైకంలో పిల్లలకు ఏదైనా హాని చేస్తే అది కాకుండా,పిల్లలకు చిన్నవయసులోనే ప్రతిరోజూ ఏం సందేశం ఇస్తు బ్రాందిషాపు చూసుకుంటూ పాఠశాలకు పంపుతారు ?
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నందమిల్లిపాడు ప్రాథమిక పాఠశాల మార్పు అవసరములేదు , యదావిధిగా మునుపటిలా 5వరకూ కొనసాగించాలి అనే అనేక విషయాలు పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మాట్లాడుకుని తదుపరి కార్యాచరణ ఈ చర్చలో ప్రజాబీప్రాయం కొరకు ఈ మీటింగ్ లో అందుబాటులో ఉన్న అందరూ హాజరు కావాలని మనవి చేస్తున్నాను 🙏
(గమనిక సిద్దాపురం ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి అఫ్ గ్రేడ్ కు నా పూర్తి మద్దతు జనసేన పార్టీ తరపున తెలియజేస్తూన్నాను,
నందమిల్లిపాడు పాఠశాల కూడా 5వ తరగతి వరకూ యధావిధిగా కొనసాగిస్తూ అభివృద్ధి దిశగా ఆలోచన చేయాలనేది మా ప్రజల కోరిక)
*మన పాఠశాల మన కుటుంబ భవిష్యత్తు ✊*
కందాల దుర్గా ప్రసాద్
సిద్దాపురం జనసేన పార్టీ గ్రామ అద్యక్షులు 🙏