PUBLIC ARMY APTS
February 1, 2025 at 03:46 PM
"జనంలోకి జనసేన" కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.
సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభనిర్వహిస్తారు..
ఈ సభలో జనసేన పార్టీ కాన్ ప్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్, ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్, తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చిత్తూరు జిల్లా నాయకులు, పుంగనూరు నియోజకవర్గం నాయకులు పాల్గొననున్నారు.