
Pastor. Timothy Tirupati ॥ గాస్పల్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ॥ హెర్మోను ప్రార్ధనా మందిరము ॥ తిరుపతి⛪🏨🌐🏪
February 26, 2025 at 01:50 AM
*🤯బెదిరించే వాళ్ళు విషయంలో తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మీరేం నేర్పగలరు?*
• 😡బెదిరించేవాళ్ళు అవతలి వ్యక్తిని బలహీనపరచి, తాము బలవంతులుగా కనపరచుకోవటానికి ప్రయత్నిస్తారని పిల్లలకు వివరించాలి.
• నిజమైన స్నేహంలో వ్యక్తులు ఇతరులపట్ల దయతో ప్రవర్తిస్తూ, మెరుగైన స్నేహితులకోసం తమ మాట నిలబెట్టుకుంటారని మీ బిడ్డకు నేర్పించాలి.
🥶అవతల వ్యక్తులు మీ పిల్లలను బెదిరించినప్పుడు
పిల్లలు తమ మనస్సులో నెమ్మదిగా చెప్పుకోవడానికి ఈ మాటలు వారికి చెప్పండి;
*ఉదాహరణకు:-*
*"బాతు మీద నీరు ఎలా నిలవదో, వీళ్ళ బెదరింపులు నన్నేమీ చెయ్యలేవు"
"నువ్వు చేస్తున్నది నీకు బానే ఉండొచ్చు. కాని నువ్వు తప్పు చేస్తున్నావని నేను అనుకుంటున్నాను.”*
🤦లేకపోతే, ఆ సమయంలో అక్కడున్న పెద్దవాళ్లకు వినిపించేలా "ఆపు! నాకిష్టం లేదిది” అని చెపితే వారు నీకు సాయం చేయగలరు. ఈలాంటి మాటలు బెదిరించేవారిదగ్గర చెప్పమని మీ బిడ్డకు చెప్పండి.
🥺“ఇదేదో సరదాగా ఉంది. నేను కూడా మీతో కలిసి చేయనా?” “ఇది నాకు అంత బాగాలేదు. మరొకటి చేద్దామా?” “మీరు నన్ను బాధపెడుతున్నారు, దయచేసి నన్ను ఒంటరిగా వదలి పెట్టండి." "నాపట్ల నిర్దయతో అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు." "నేను మిమ్మల్ని బాధపెడితే నన్ను క్షమించండి. నేనెలా మిమ్మల్ని బాధపెట్టానో చెపుతారా?" అని బెదిరించే వారిని దయాహృదయంతో అడుగమని మీ బిడ్డకు నేర్పండి.
*🙏తరువాయి భాగంలో మరలా కలుద్దాం,......*
*దేవుడు ఈ మాటలతో మనలను దీవించును గాక!*
*💥ఈ మెసేజ్ లను ఇతరులకు ఫార్వడ్ చేసి దేవుని పనిలో పాలుబాగస్తులు అవ్వండి.*
🙏
3