Pastor. Timothy Tirupati ॥ గాస్పల్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ॥ హెర్మోను ప్రార్ధనా మందిరము ॥ తిరుపతి⛪🏨🌐🏪
80 subscribers
About Pastor. Timothy Tirupati ॥ గాస్పల్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ॥ హెర్మోను ప్రార్ధనా మందిరము ॥ తిరుపతి⛪🏨🌐🏪
పాస్టర్. తిమోతి అతి చిన్న వయస్సులోనే భయంకరమైన వ్యాధిగ్రస్తుడై మరణ పడకలో పడియున్నప్పుడు దేవుని సేవకులు మరియు తన తల్లి యొక్క ప్రార్ధనలో యేసుక్రీస్తు కృప ద్వారా దర్శించబడి అద్భుతమైన స్వస్థతను పొందారు. తల్లి దేవుని దగ్గర చేసిన మ్రొక్క బడి కారణంగా అలాగే పెద్దలైన సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పిలుపు మేరకు అతి చిన్న వయస్సులోనే గాస్పల్ సోల్జర్స్ మినిస్ట్రీస్, హెర్మోను ప్రార్ధనా మందిరము, దైవజనులు పాస్టర్. సురేష్ బాబు గారి నాయకత్వంలో సంపూర్ణ దేవుని సేవకు సమర్పించుకోవడం జరిగింది. అక్కడ మినిస్ట్రీస్ లో ఉన్న దేవుని సేవకుల దగ్గర కొన్ని సంవత్సరాలు సేవా తర్ఫీదు మరియు శారీరక, మానసిక, ఆత్మీయంగా అనేకమైన పరీక్షలతో సువార్త, సంఘసేవ, పరిచర్య క్రమ విధానాలలో ఉత్తీర్ణత పొంది మినిస్ట్రీస్ తరుపున కొన్ని స్థలాల్లో దేవుని సేవ చేసి ప్రస్తుతం తిరుపతి పట్టణంలో గాస్పల్ సోల్జర్స్ మినిస్ట్రీస్, హెర్మోను ప్రార్ధనా మందిరం వారి తరుపున దేవుని సంఘ కాపరిగా, దేవుని సువార్తకునిగా, దేవుని పరిచారకునిగా దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి అనేకమైన విధానాలలో దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ దేవుని సేవకుని ద్వారా మీకు ప్రోత్సాహం కలిగించే దేవుని పరిచర్యలు వాటి సమాచారాలు, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్ధించవలసిన అంశాలు, మీ ఆత్మీయ, మానసిక, శారీరక జీవితాలను బలపరచే దేవుని వాక్యాలు, మిమ్మును ముందుకు నడిపే దేవుని వాగ్దానాలు, మిమ్మును ఉత్తేజపరచే మహనీయులు పలికిన గొప్ప పలుకులు, మీరు బహుమతులను గెలుచుకునే వివిధ రకములైన బైబిల్ క్విజ్ లు మీకు జ్ఞానాన్ని కలిగించే టెక్స్ట్ మెసేజ్ లు ఇలా ఎన్నో ఆథ్యాత్మిక అణిముత్యాలు ఈ వాట్సాప్ చానల్ లో మీ కోసం పోస్ట్ చేయబడుతాయి. ఆసక్తి ఉన్నవారు ఈ వాట్సాప్ చానల్ ను ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మును దీవించును గాక.
Similar Channels
Swipe to see more
Posts