
Pastor. Timothy Tirupati ॥ గాస్పల్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ॥ హెర్మోను ప్రార్ధనా మందిరము ॥ తిరుపతి⛪🏨🌐🏪
February 27, 2025 at 01:25 AM
*పిల్లలు గమనిస్తున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి!*
పిల్లలు తల్లిదండ్రులను గమనించి చాలా విషయాలు నేర్చుకుంటారు అనే స్ప్రహాతో అడుగులు వేయాలి. పిల్లలు తల్లిదండ్రులు ద్వారా మంచిని నేర్చుకోవచ్చు లేక చెడును కూడా నేర్చుకోవచ్చు. తమ పిల్లలు మంచిని నేర్చుకోవాలా? లేక చెడును నేర్చుకోవాలా? అనేది తల్లిదండ్రులు నడుచుకునే నడతను బట్టి ఉంటుంది.
*ఉదాహరణకు*
కొత్తవాళ్ళతో మాట్లాడే విధానం, ట్రాఫిక్ లో ఆలస్యం అయితే ఎలా కనిపెడతారు, తమ ప్రణాళికలు నెరవేరకపోతే ఎలా స్పందిస్తారు,
ఏం చేస్తారు. అనుకున్న విషయాలు విఫలమయితే మళ్ళీ ముందుకు ఎలా కొనసాగుతారు ఇలా అనేక విషయాలు పిల్లలు తల్లిదండ్రులు దగ్గర గమనిస్తారు.
*ఉదాహరణకు ఈ స్టోరీని గమనించండి;*
నరేష్ తన నాలుగు సంవత్సరాల కొడుకు శామ్యూల్ నేల మీద జావను పోస్తే నరేష్ మౌనంగా ఉండి “దీని విషయంలో శామ్యూల్ మనం ఏమైనా చేయాలి" అని కొడుకుతో అన్నాడు. తరువాత నరేష్ ఒక బ్రష్, చెత్త చేట తెచ్చి వంగి ఏం చేయాలో చెప్పాడు. “చేట ఇలా పట్టుకొని క్రిందపడిన జావను ఇలా తుడవాలి" అని చెప్పాడు.
శామ్యూల్ సైతం క్రిందకు వంగి బ్రష్ ని చేటని చేత్తో పట్టుకొని, మళ్ళీ నేలను శుభ్రం చేస్తూ తన తప్పును సరిదిద్దుకున్నాడు. నరేష్ మొదట తన కొడుకును శిక్షించటం కాని, కోపపడటం కాని చేయలేదు, తన ప్రవర్తనతో శిక్షణ ఇచ్చాడు; తన కొడుకు శామ్యూల్ తన తప్పును సరిదిద్దుకోవటం నేర్చుకున్నాడు. శామ్యూల్ మరెప్పుడైనా ఏదైన క్రింద చల్లితే ఏం చేయాలో తనకి తెలుసు. పిల్లలు సక్రమంగా ఎన్ని పనులు చేయగలుగుతారో అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. మన పిల్లల సమస్యలను మనమే పరిష్కరిస్తే, తమ బాధ్యతను తెలుసుకునే అవకాశం లేకుండ మనం చేసినవాళ్లమవుతాం. గనుక పిల్లలు కొన్నిసార్లు *తమ సమస్యలను తామే మంచిగా పరిష్కరించుకునే విధంగా తల్లిదండ్రులు తమ నడవడికతో నేర్పించాలి.*
*🙏తరువాయి భాగంలో మరలా కలుద్దాం,......*
*దేవుడు ఈ మాటలతో మనలను దీవించును గాక!*
*💥ఈ మెసేజ్ లను ఇతరులకు ఫార్వడ్ చేసి దేవుని పనిలో పాలుబాగస్తులు అవ్వండి.*
🙏
2