
Manchodu Mani Media
February 18, 2025 at 02:58 AM
*ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సూక్ష్మ సేద్య పరికరాలు*
*ఇతర అన్ని వర్గాల సన్న, చిన్నకారు రైతులకు 90% రాయితీ*
*ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*
అంధ్రప్రదేశ్: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100 శాతం రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠంగా అయిదెకరాల వరకు.. రూ.2.18 లక్షలు మించకుండా ఈ పథకాన్ని అమలు చేస్తారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై)లో భాగంగా సూక్ష్మ సేద్య ప్రాజెక్టు కింద బిందు, తుంపర సేద్య రాయితీ వివరాలపై వ్యవసాయ, సహకార శాఖ ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.