TTD UPDATES
                                
                            
                            
                    
                                
                                
                                February 18, 2025 at 04:38 AM
                               
                            
                        
                            *తిరుమల :*
*నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా విడుదల*
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల,  అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఫిబ్రవరి ఇవ్వాళ (18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం నేటి (ఫిబ్రవరి 18) నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        1