BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
February 8, 2025 at 03:27 AM
‘‘విద్యార్థి,యువకులకు నా విజ్ఞాపన ఏమంటే, చదువు పూర్తి కాగానే వారందరూ ఏదో ఓ ఉద్యోగం చూసుకోకుండా,వారి గ్రామ ప్రజలకు,స్థానికులకు సేవ చేయాలి. అజ్ఞానం వలన ఉత్పన్నం అవుతున్న దోపిడీని, అన్యాయాన్ని తద్వారా అరికట్టగలుగుతాం.మీ విముక్తి సమాజ విముక్తిపై ఆధారపడి ఉంది. నా పరిస్థితి ఇప్పుడు ఒక పెద్ద డేరాని నిలబెడుతున్న గుంజ లాంటిది. ఆ గుంజ ఉండని పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆవేదన నాకున్నది.నా ఆరోగ్యం అంతగా బాగాలేదు. మీ నుంచి నేను ఎప్పుడు వెళ్లిపోతానో తెలియదు.నిస్సహాయులైన, భరోసాలేని ఈ కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడే యువకులు నాకు కనపడటం లేదు.ఆ బాధ్యతలు స్వీకరించడానికి ఎవరైనా యువకుడు ముందుకు వస్తే నేను నిశ్చింతగా వెళ్లిపోతాను’’ అని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. ఆయన ఆకాంక్ష నేటికీ నెరవేరకుండానే మిగిలిపోయింది. అలా అని, ఆయన మాటలను ఆదర్శంగా తీసుకొని పనిచేసిన యువకులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు అసలే లేరని కాదు.కానీ అట్టడుగు బహుజన జాతి శాశ్వత విముక్తి ఇంకా కల గానే మిగిలింది.పైగా అంబేడ్కర్ ఉద్యమ విజయ ఫలాలు ఒక్కటొక్కటిగా చేయి జారిపోతున్నాయి. ఇంతవరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ల పట్ల సమాజం చూపుతున్న వివక్ష నేడు ద్వేషంగా మారిపోయింది.కాబట్టే ఎన్ని చట్టాలు వచ్చినా అమలుకు నోచుకోని దుస్థితి నెలకొన్నది ... అందుకే బహుజన సమాజం రాజకియ అధికారంలోకి రావాలి #teambsfi

Comments