BSFI - Bahujan Students' Federation Of India WhatsApp Channel

BSFI - Bahujan Students' Federation Of India

188 subscribers

About BSFI - Bahujan Students' Federation Of India

ఎందుకు ఈ Bahujan Students' Federation Of India !?     -Karunakar bahujan ఒక సారి పూర్తిగా చదవండి.. మనం స్వయం పరిశీలన చేసుకుంటే మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. 80 % పైగా ఉన్న బహుజన సమాజానికి, ఆ భావజాలంతో ఒక్కటంటే ఒక్కటి జాతీయ స్థాయి విద్యార్థి సంఘము లేదు విద్యార్థుల సమస్యలు తీర్చడానికి వారి వెన్నంటి ఉండడానికి ఒక నాయకుడు లేడు. దేశంలో  అత్యధిక శాతం విద్యార్థులుగా ఉన్న బహుజన సమాజంలో ఆ సమాజం నుండి నాయకుల తయారు చేసే కర్మాగారం లేకపోవడం చాలా విచారకరం ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం గుర్తు చేసుకుంటే  జాతీయ స్థాయిలో ఉన్న యూనివర్సిటీలు రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ లలో ఒక యూనివర్సిటీ కి మరొక్క యూనివర్సిటీ కి అనుసంధానం చేసే ఒక్క విద్యార్థి యూనియన్ లేక పోగా  బహుజన సమాజానికి విరుద్ధ భావజాలం కలిగిన   లెఫ్ట్ - రైట్ విద్యార్థి విభాగాల్లో ఇదే బహుజన సమాజము బలమైన కార్యకర్తలుగా ఆ సంఘాలకు ఊడిగం ఎట్టి చేసే స్థితిలో ప్రతి యూనివర్సిటీ లలో జరుగుతుంది.. చాలా కాలం నుండి పై విషయం తో పాటు మిగతావి మనం పరిశీలిస్తే ప్రతి యూనివర్సిటీ లో కుల సంఘాలుగా విద్యార్థి సంఘలు తయారై అసలు ఐక్యత సాధ్యం గాని అంతర్గత యుద్దాలు జరుపుతున్నారు, తెలంగాణ లో ఇగ మామూలు గా లేదు తెలంగాణ ఉద్యమ చైతన్యం వో ఇంకా ఏందో కానీ ఆ అపార మేధావితానం అంత కులనికో విద్యార్థి సంఘము తీర్చిదిద్దారు. దేశంలో ఉన్న లెఫ్ట్,రైట్ స్టూడెంట్ యూనియనల్లే యూనివర్సిటీ లో విజయం సాధిస్తాయి అది ఎలా అంటే ప్రస్తుతం పాలకవర్గాలు ఏ సమాజము నుండీ ఉన్నాయో అలాగే ఏ కులాలు ఉన్నాయే ఇసుమంతా కూడా మార్పు లేకుండా అలానే యూనివర్సిటీ లలో ఉన్నాయి, పాలక వర్గాలకు ఆధిపత్య కులాలు బహుజన సమాజం నుండి ఉన్న చెంచాల కు చిన్న చిన్న  పదవులు ఇచ్చినట్లై వారికి ఊడిగం చేయించుకున్నట్లే  యూనివర్సిటీ లలో బీసీ,ఎస్సీ& ఎస్టీ,మైనార్టీ విద్యార్ధి పరిస్థితులు అలానే ఉన్నాయి. బాబాసాహెబ్ రాబోయే 21 శతాబ్దం నా  అమాయక సమాజం కోసం ఆ సమాజం నుండి వచ్చిన విద్యార్థులు,యువకులు  త్యాగం చేసి నూతన నాయకత్వంగా ఏర్పడి ప్రజల కష్టాల కడలిని దాటించి సుపరిపాలన చేస్తారని చెప్పాడు, కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రస్తుతం కొనసాగుతుంది. అందుకే BSF-INDIA ఫూలే,అంబేద్కర్ & కాన్షీరామ్ గార్లు కలలు గన్న సుపరిపాలనకొరకు, స్వయంపాలన కొరకు విద్యార్థిని విద్యార్థులలో నాయకత్వాన్ని తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యం.. Bahujan students' federation of india  #teambsfi 8008113294

Similar Channels

Swipe to see more

Posts

BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
5/29/2025, 6:51:13 AM

దయచేసి మీరు కూడా మీ ఆఫీసులో మీ ఇంట్లో మీరే టాయిలెట్ కడిగి ఓ వీడియో పోస్ట్ చేయండి, చూసి ఎలా కడగాలో పిల్లలు మేము నేర్చుకుంటాం... #teambsfi

Post image
👍 1
Image
BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
5/26/2025, 4:15:58 PM

ది.26.05.25 కృష్ణా విశ్వవిద్యాలయం, మచిలీపట్నం. చారిత్రాత్మక మచిలీపట్నం లో కృష్ణా విశ్వవిద్యాలయం ను ఏర్పాటు చేసి ఏప్రిల్ 28, 2025 నాటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 వ ఏడాది లోకి ప్రవేశించింది. పుష్కర కాలం పాటు ఆంధ్ర జాతీయ కళాశాల లో కాలం వెళ్లదీసి 5 ఏళ్ల క్రితం నూతన (సొంత) ప్రాంగణం లో కి ప్రవేశించడం సంతోషకరమైన అంశం. విశ్వవిద్యాలయం స్థాపించి 17 ఏళ్లు అయినా, సొంత ప్రాంగణం లో కి చేరి 5 ఏళ్లు గడిచినా ఇంకా బాలారిష్టాలు దాటకపోవడం శోచనీయం. ఆధిపత్య కులాలకు చెందిన వారు ఉపకులపతులుగా, రిజిస్ట్రార్ లు గా ఎక్కువ కాలం పనిచేయడం ఇందుకు కారణమని స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు బాలబాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధులు ఉన్నత విద్య కు దూరం చేయబడ్డారు. ఇది ఆధిపత్య కులాలకు చెందిన ఉపకులపతులు, రిజిస్ట్రార్లు కుట్ర గా భావించాల్సి వుంటుంది. 16 సంవత్సరాలు తరువాత తొలిసారి బహుజన వర్గానికి చెందిన తమరు ఉపకులపతి గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషకరం. సమస్యల పరిష్కారం లో మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. పునాది దశలో నిలిచిపోయిన బాలుర వసతి గృహం నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించాలి. విశ్వవిద్యాలయ ప్రాంగణం లో క్రీడా ప్రాంగణం ను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలి. కార్లు, ద్విచక్ర వాహనాలు నిలుపుటకు అధ్యాపకులకు, విద్యార్ధులకు విడివిడిగా స్టాండ్లు నిర్మించాలి. విశ్వవిద్యాలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద బస్ షెల్టర్ నిర్మించాలి అని బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా డిమాండ్ చేస్తుంది

Post image
Image
BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
6/2/2025, 4:41:03 AM

భౌగోళిక తెలంగాణ ఆంధ్ర ఆధిపత్య కులాల నుండి మాత్రమే విముక్తి పొంది, తెలంగాణ లో ఉన్న ఆధిపత్య కుల పార్టీల కబంధ హస్తాలలోకి వెళ్ళింది, తెలంగాణ ! భౌగోళిక తెలంగాణ గా విముక్తి చెందితే సరిపోదు., యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈ ఆధిపత్య కులాల నుండి విముక్తి పొందాలి, అదే అసలైన .... ప్రజల తెలంగాణగా., విముక్తి పొందిన తెలంగాణ! ప్రత్యేక తెలంగాణ! #teambsfi

BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
5/31/2025, 3:53:22 AM

"మనువాద రాజకీయ పార్టీలు/ సమూహాల్లో లాగా నాయకుడు అనే అనవసర హోదాని నేను నమ్మను. ఇక్కడ (మన మిషన్ లో)ఎవరూ నాయకులు లేరు. అందరూ కార్యకర్తలే ఒకరు చిన్న కార్యకర్త ,మరొకరు పెద్ద కార్యకర్త. నేనుకూడా మీలాగే ఒక కార్యకర్తనను అయితే కొంచెం పెద్ద కార్యకర్తను" -మాన్యవర్ దాదాసాహబ్ కాన్షీరామ్ #teambsfi

🙏 1
BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
5/25/2025, 2:05:17 PM

బహుజన సమాజ్ పార్టీ లో క్రమశిక్షణతో కూడిన క్యాడర్ ఉంటది.. 👉🏿 నువ్ ఎంత తురుమ్ అయినా క్యాడర్ మొట్టికాయ వేస్తుంది. 👉🏿 తప్పటడుగులు వేస్తే పక్కకెళ్ళి ఆడుకోండని స్పష్టంగా బయటకు పంపిస్తుంది... 👉🏿 నాకు పార్టీ కేడర్ గా, చాలా ప్రశ్నలు ఉన్నాయి..! పార్టీ నుండి బయటకి వెళ్లిన వాళ్లు లేదా వాళ్ల తరఫున వకాలత్ పుచ్చుకున్న ఎవరైనా సమాధానాలు చెప్పొచ్చు.. 1 , అసలు మీరు అనుకునే నాయకుడు ఎప్పుడైనా ఒక ప్రొడక్టివ్ బాబాసాహెబ్ అనుకున్న క్యాడర్ ని తయారు చేయాలనుకున్నాడా ?? 2 , పార్టీ లైన్లో కనీసం తెలంగాణ/ఆంధ్రా లో ప్రోటోకాల్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా !? 3 , ఎందుకు లోప్రొఫైల్లో క్యాడర్ తయారు చేసే ప్రయత్నం చేయలేరూ!?ఒకవేళ చేస్తే ఎక్కడ చేశారు కాస్త వివరించండి ! 4 , ఎంతసేపు సోషల్ మీడియా కవరేజ్ లు హంగు హార్భాటాలుగా కార్యక్రమాలు తప్ప, కనీసం చిన్న చిన్న లక్ష్యాలను కూడా అధిగమించారా (సాహెబ్ కాన్షిరామ్ గారి పనిలో)!? 5 , ఎంత క్యాడర్ బేస్డ్ మూమెంట్ చేశారు, ఎంత క్యాడర్ మీ తయారుచేసి పార్టీ నీ బలోపేతం చేశారు !? 6 , ఎన్ని వందల మండల స్థాయి కార్యక్రమాలు జరిపారు !? 7, అసలు ఎన్నిసార్లు బాబాసాహెబ్ మిషన్ కు సంబంధించిన ఒక మిషన్ బేస్ స్పీచ్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పి రాజకీయతర ఉద్యమానికి మరియు రాజకీయ ఉద్యమానికి సంసిద్ధం చేశారు! 8 , సామాజిక ఉద్యమ పరివర్తన ముచ్చట్లు ఎక్కడ కూడా చర్చలోకి రానివ్వలేదు వస్తే ఒకటి రెండు చెప్పండి. 9 , ఎంతసేపు ఆధిపత్యకుల పార్టీ పోకడలను సొంత పార్టీలో రుద్ది సీనియర్ల మాటలు వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరు ఎంత దూరం పార్టీని దిగజార్చాలని చూసారో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్పష్టంగా గమనిస్తూనే ఉంది. 10 , వెరసి బాబాసాహెబ్ త్యాగాన్ని,ఉద్యమాన్ని కాన్షిరామ్ గారి పని విధానంలో కొనసాగించకుండా మీ సొంత నిర్ణయాలు ఊహాగానాలు తప్ప ఏం అభివృద్ధి చేశారు తెలియజేయండి.. ఇప్పుడు ఎవరెవరు పార్టీ నుండి ఏ ఏ కారణాలతోని బయటకు వెళ్లారు ! ఎందుకు పార్టీ బయటికి మీ మీ నాయకులను పంపించిందో వీటికి సమాధానాలు చెప్పిన తర్వాత ఆధారాలతో కూడిన అన్ని విషయాలు చర్చిద్దాం.... జై భీమ్ Karunakar Bahujan #teambsfi

👍 ❤️ 5
BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
6/1/2025, 3:39:27 PM

Date: 31/05/25, విద్యా హక్కు చట్టం RTE 12(1)(C) ద్వారా అన్ని ప్రయివేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ లో ఉచిత అడ్మిషన్లు అయ్యేలా చొరవ తీసుకోవాలి. పాఠ్యపుస్తకాలు,స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదు. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్ ఐఐటి ఒలంపి యాడ్,కాన్సెప్ట్,ఈటెక్నో అనే తోకలు తగిలించినవి,తొలగించాలి.. అలాంటి తోకలు ఉంటే వాటి గుర్తింపును రద్దు చేయండి.. అని జనగాం జిల్లా DEO నీ కలిసిన bsfi నాయకులు. #teambsfi

Post image
❤️ 2
Image
BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
6/2/2025, 3:02:56 PM

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం రాజ్యాంగబద్ధంగా మొట్టమొదటిసారి పార్లమెంట్లో బహుజన సమాజ్ పార్టీ బహెన్ కుమారి మాయావతి గారు మాట్లాడారు...

❤️ 1
Video
BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
6/2/2025, 4:41:12 AM

Geographical Telangana may have been liberated from the dominance of Andhra’s ruling castes, but it has now fallen into the grip of Telangana’s own dominant caste parties. Telangana! Mere geographical liberation is not enough. True freedom lies in the liberation of all the people of Telangana from the chains of caste hierarchy and oppression. Only then will we witness the birth of the real dream— A People’s Telangana. A truly liberated Telangana. A distinct, just, and dignified Telangana #teambsfi

BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
5/26/2025, 1:19:50 PM

అమాయక దళిత, మైనారిటీల యువకులపై తెనాలి ఐతానగర్ నడిరోడ్డులో అందరూ చూస్తుండగా పోలీసుల జులుం! భయభ్రాంతులకు గురవుతున్న తెనాలి ఐతానగర్ ప్రజలు! ఆలస్యంగా ఆధారాలతో వెలుగులోకి వచ్చిన వీడియో! కంప్లైంట్ ఇచ్చిన పోలీసు కానిస్టేబుల్ కన్నా చిరంజీవి PC: 6068 : కన్నా చిరంజీవి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి 2 టౌన్ కి సంబంధం లేదు. పోలీసు కానిస్టేబుల్ PC: 6068 కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని లేకపోతే మీ మీద అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ CI రమేష్ బాబు గారు చెప్పమన్నారని బెదిరించగా వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఎక్కడ అతని యొక్క అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి ఈ యొక్క యువకులపై అబద్ధపు కేసు పెట్టినాడు. ఈ విధంగా 2 టౌన్ నకు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు గురిచేసినారు. Cr.No: 52/2025 గా నమోదు చేసి 3 రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేసినారు. ది. 25-04-2025 నే ముద్దాయిలను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టి వీధి వీదులు తిప్పుతూ తెనాలి, ఐతానగర్ ప్రధాన కూడళ్ళలో రోడ్డులపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండంగా విచక్షణారహితంగా తెనాలి 2 టౌన్ రాముల నాయక్ మరియు 3 టౌన్ CI రమేష్ బాబు లు దాష్టీకం ప్రదర్శించారు. చేబ్రోలు జాన్ విక్టర్ S/O ఇజ్రాయెల్, 25 సంవత్సరాలు, మాల, చెంచుపేట, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా. షేక్ బాబులాల్ @ కరిముల్లా @ కల్లా S/O అమీర్ భాషా, 21 సంవత్సరాలు, ముస్లిమ్, తిప్పర్ల బజార్ మంగళగిరి, గుంటూరు జిల్లా. దోమా రాకేష్ S/O వాసు, 25 సంవత్సరాలు, మాల ఐతానగర్, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా. అను వారలపై, వీరు ఇద్దరు మాల కులం, ఒకరు ముస్లిమ్ కమ్యూనిటీకి చెందిన యువకులపై తెనాలి 2 టౌన్ CI రాములు నాయక్ మరియు 3 టౌన్ CI రమేష్ బాబు లు అతిక్రూరంగా బహిరంగంగా రోడ్లు మీదకు తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టినారు. దోమ రాకేష్ అను అతనికి చేతులలో కాళ్ళలో రాడ్లు ఉన్నాయని చెప్పి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా 2 టౌన్ CI రాములు నాయక్ అతి కర్కశంగా అతని కాళ్ళపై ఎక్కి తొక్కి పెట్టగా 3 టౌన్ CI రమేష్ బాబు అతికిరాతకంగా అతనికి అలుపు వచ్చే వరకు విచక్షణారహితంగా కొట్టినారు. పోలీసు స్టేషన్ లో ముద్దాయిలను కొడతారని చంపుతారని తెలుసుగాని ఈ విధంగా బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా రోడ్ల మీదకు తీసుకొచ్చి వాళ్ళయొక్క పోలీసు దాష్టీకం ప్రదర్శించి చుట్టుప్రక్కల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినారు. నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి గాని, ఇంత క్రూరంగా ప్రజలు చూస్తూ ఉండగా కొట్టాల్సిన అవసరం లేదు. గౌరవ న్యాయస్థానాలు ముద్దాయిలను ఈ విధంగా శిక్షించవద్దు. ఈ విధంగా కొట్టవద్దు. కొట్టే హక్కు మీకు లేదు అని చెప్పిననూ పెడచెవిన పెట్టి ఈ విధంగా ప్రజలపై తెనాలి పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ విషయం మీద తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడితే ఇంకా వారికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి మాట్లాడినా మీపైన కూడా కేసులు పెడతామని వాపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకుని పోలీసులు జులుం చూపిస్తున్నారు. ఈ విధమైన దాష్టీకం కేవలం దళితుల మీదే చూపిస్తున్నారు. 2 టౌన్ CI రాముల నాయక్ ఐతనగర్ కు చెందిన వారిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. అమాయకపు వ్యక్తులపై అబద్ధపు మరియు అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా కర్కశత్వం చూపిస్తున్నారు. 3 టౌన్ CI రమేష్ బాబు నకు ఏ సంబంధం లేకపోయినా ఐతానగర్ 2 టౌన్ కు సంబంధం లేని 3 టౌన్ CI ఈ 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఎక్కడా ముద్దాయిలను కొట్టవలసిన అవసరం పని లేదు. ఈ చర్యలపై ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి బాధితులు వెళ్ళడానికి కూడా భయపడేలా చేస్తున్నారు. ఒకవైపు గౌరవ న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ జరపమని చెప్తున్నా ఎక్కడన్నా కూడా అటువంటి పరిస్థితులు కనబడడం లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రబలంగా వున్నా కూడా పోలీసు వారు బహిరంగంగా ముద్దాయిలను తీసుకువచ్చి కొడుతున్నారు అంటే కేవలం ఒక తెనాలి ఐతానగర్ ప్రదేశాన్ని ఎన్నుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోటే ఇలాంటి చర్యలకు గురిచేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు మీ పైఅధికారుల మరియు రాజకీయ నాయకుల మెప్పులు పొందడానికి అమాయకమైన దళిత, మైనారిటీలపై మీ జులుం చూపిస్తున్నారు. వేరే అగ్రకుల లేక రాజకీయ నాయకులకు లోబడి ఉన్న వ్యక్తులను యదేచ్ఛగా వదిలేస్తున్నారు. వారు చేసే అక్రమాలకు మీరు తోడ్పడుతున్నారు. ఒక దళితులు, మైనారిటీల పైనే పోలీసులు జులం సాగిస్తున్నారు. ఈ విధంగా కానిస్టేబుల్స్ వారికి ఇష్టమైన వారి చేత గంజాయి, మత్తు పదార్థాలు యదేచ్ఛగా కానిస్టేబుల్స్ కనుసన్నలలో అక్రమ రవాణా విక్రయాలు జరుగుతున్నాయి! పేకాట, జూదం, వ్యభిచారం, గంజాయి వీరి కనుసన్నలలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ పైఅధికారులకు తెలుసు. వీరు కేవలం డబ్బులు ఇచ్చుకోలేని అమాయక ప్రజలపై అక్రమ కేసులు, అబద్దపు కేసులు బనాయించి విచక్షణారహితంగా కొట్టుచున్నారు. ఈ విషయం మీద మీరు మీ చర్యలు మానుకుని ప్రజలకు దగ్గరగా ఉండి స్నేహపూర్వకంగా వ్యవహరించమని ప్రజలు కోరుతున్నారు. దీని మీద ప్రజా సంఘాలు, మైనారిటీ సంఘాలు, కుల సంఘాలు అంతా కూడా పెద్దయెత్తున ప్రతిఘటించగలరు!

Video
BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
5/24/2025, 3:39:09 PM

BSFI జెండా ఆవిష్కరణ ఆంధ్ర యూనివర్సిటీ #teambsfi

Post image
❤️ 🙏 5
Image
Link copied to clipboard!