Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
February 14, 2025 at 09:54 AM
పులివెందుల పట్టణం, గాడి చర్ల వారి వీధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజన పథకం ఆహార నాణ్యతను తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులకు పెట్టే కోడిగుడ్లు సైజు తక్కువ ఉండడంతో వాటి బరువు చూడడం జరిగింది. 50 గ్రాములు ఉండాల్సిన ఒక్కొక్క కోడిగుడ్డు 38 నుంచి 40 గ్రాముల లోపు ఉండడంతో కోడిగుడ్లు సప్లై చేసే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. పాఠశాలలోని మరిన్ని సమస్యలు ఉపాధ్యాయులు చెప్పడంతో వీటిని వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సి గారు చెప్పడం జరిగింది.

Comments