
Kadapa Heart Beats
February 2, 2025 at 11:21 AM
*ఏపీలో ఇకనుంచి వాట్సాప్లో బస్ టికెట్లు బుక్ చేసుకున్న వారిని అనుమతించండి - రాష్ట్ర ప్రభుత్వం*
అమరావతి :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూరప్రాంత బస్ సర్వీసులు అన్నింటా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది.