Kadapa Heart Beats WhatsApp Channel

Kadapa Heart Beats

476 subscribers

About Kadapa Heart Beats

"A Platform to Express Your Feels"

Similar Channels

Swipe to see more

Posts

Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/20/2025, 12:44:32 PM

*రాష్ట్ర క్రీడాపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు* కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో 4, 5వ తరగతుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తుల తేదీని ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పొడిగించామని శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పొడిగించిన తేదీని గమనించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెల్ప్ డెస్క్ కోసం క్రీడా శాఖ వెబ్సైట్ https://apysrsportsschool.in/ చూడవచ్చని సూచించారు.

Post image
Image
Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/20/2025, 9:34:16 AM

*30 నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్* * ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు క్యాంపస్లు ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ఎంపికైన విద్యా ర్థుల జాబితా 23వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆర్జీయూకేటీ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య సండ్ర అమ రేంద్ర కుమార్ తెలిపారు. * నూజివీడు క్యాంపస్ కు ఎంపికైన విద్యార్థులకు జూన్ 30, జులై 1న నూజివీడు క్యాంపస్ లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఆర్కేవ్యాలీకి ఎంపికైన విద్యార్థులకు జూన్ 30, జులై 1న, శ్రీకాకుళం క్యాంపస్ కు ఎంపికైన వారికి జులై 2, 3 తేదీల్లో, ఒంగోలు క్యాంపస్కు జులై 4, 5 తేదీల్లో నూజివీడు క్యాంపస్ లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు జులై 14వ తేదీ నాటికి వారికి కేటాయించిన క్యాంపస్ లలో రిపోర్టు చేయాలని ప్రవేశాల కన్వీనర్ తెలిపారు.

Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/20/2025, 4:53:55 PM

విశాఖలో రేపు 'యోగాంధ్ర'... ఏర్పాట్లు మామూలుగా లేవు మరి! విశాఖలో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం హాజరుకానున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సాగర తీరంలో 5 లక్షల మందితో యోగాసనాలు, ప్రపంచ రికార్డు లక్ష్యం ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 34 కిలోమీటర్ల మేర కార్యక్రమం రూ.62 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు, పటిష్ట భద్రతా చర్యలు వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం సిద్ధం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని "యోగాంధ్ర 2025" కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జూన్ 21వ తేదీన (శనివారం) విశాఖ సాగర తీరంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా యోగాసనాలు వేయనున్నారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. *సాగర తీరం వెంబడి అపూర్వ ఘట్టం* ఈ మెగా ఈవెంట్ కోసం విశాఖ ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 34 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని యోగా వేదికగా తీర్చిదిద్దారు. బీచ్ రోడ్డులో మొత్తం 326 కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను నిర్మించారు. ఈ ఏర్పాట్ల దృష్ట్యా, శుక్రవారం (జూన్ 20) నుంచే బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ప్రతిఒక్కరికీ ఉచితంగా యోగా మ్యాట్, టీ షర్టులు అందజేస్తారు. *రూ.62 కోట్లతో విస్తృత ఏర్పాట్లు* సుమారు 62 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాల్గొనేవారి సౌకర్యార్థం 3 వేల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఐదు కంపార్ట్‌మెంట్‌లకు ఒక వైద్య శిబిరాన్ని, ప్రధాన వేదిక వద్ద పది పడకల తాత్కాలిక ఆసుపత్రిని సిద్ధం చేశారు. ప్రజల తరలింపు కోసం 3,600 ఆర్టీసీ బస్సులతో పాటు 7,295 ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. *వర్షం వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు* ఒకవేళ శనివారం వర్షం కురిస్తే, కార్యక్రమానికి అంతరాయం కలగకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మైదానంలో సుమారు 20 వేల మంది గిరిజన విద్యార్థులతో ప్రత్యేక యోగా కార్యక్రమం కూడా జరగనుంది. ఇక్కడ కూడా పది పడకల ఆసుపత్రిని నిర్మించారు. *భద్రత, పర్యవేక్షణ* ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, బీచ్ రోడ్డు వెంబడి 2 వేల సీసీ కెమెరాలను అమర్చారు. కార్యక్రమ పర్యవేక్షణకు 26 మంది ప్రముఖ యోగా గురువులు, 1500 మంది శిక్షకులు, 6300 మంది వాలంటీర్లు సేవలందించనున్నారు. తూర్పు నౌకాదళం కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది; వారి ఆధ్వర్యంలో 11 యుద్ధ నౌకలపై యోగా సాధన చేయనున్నారు. ప్రధాని మోదీ కాన్వాయ్ కోసం ఐఎన్‌ఎస్ డేగ నుంచి కమాండ్ గెస్ట్ హౌస్ వరకు పోలీసులు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, యోగా కార్యక్రమం కోసం బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచామని ఆయన వివరించారు. ఈ అపూర్వ ఘట్టం ద్వారా యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/20/2025, 4:50:08 PM

కడప జిల్లాలో ఖాళీ అయిన ఒంటిమిట్ట పులివెందుల, జడ్పిటిసిల ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/20/2025, 9:32:36 AM

*Israel-Iran war: బాంబుల వర్షం...ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్* *ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి* *టెహ్రాన్ లో భయానక పరిస్థితులు..నగరాన్ని వీడుతున్న జనం* *జీ7 నుంచి అర్ధంతరంగా వచ్చేసిన ట్రంప్...కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం.. ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్యజ* *ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు...* *మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి* *ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు* *సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు* టెహ్రాన్, టెల్ అవీవ్, దుబాయ్, వాషింగ్టన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాల దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదో రోజైన మంగళవారం పరస్పరం జరుపుకొన్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. ఇజ్రాయెల్ లోని మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడిచేసిన ఇరాన్.. డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నగరాన్ని వీడుతున్నారు. ఇక జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధంతరంగా వాషింగ్టన్ వచ్చేశారు. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని బట్టి ఏదో జరగబోతోందని అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్లో చిక్కుకున్న కొంత మంది భారత విద్యార్థులు మంగళవారం సరిహద్దులు దాటి ఆర్మేనియాలోకి వచ్చారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సలహాదారు అయిన అలీ షాధ్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. గతంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో సీనియర్ సైనికాధికారి అలీ రషీద్ మృతి చెందడంతో.. అలీ షాద్మానీని ఇటీవల సాయుధ దళాలకు నూతన నాయకుడిగా ఖమేనీ నియమించారు. టెహ్రాన్ డౌన్జన్కు సమీపంలోని 3,30,000 మంది ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. కోటి మంది జనాభా ఉండే ఈ నగరం నుంచి పలువురు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 224 మంది మరణించారు. 1,277 మంది గాయపడ్డారు. టెహ్రాన్ గగన తలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. 120 క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశామని తెలిపింది. టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అక్కడున్న రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. దాడుల్లో ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం కుడ్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ బ్యాంకులపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లపై ఇరాన్ పాక్షిక బ్యాన్ విధించింది. *మొస్సాద్ కు దెబ్బ* ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్పై ప్రయోగించడంతో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. పలు భవనాలు, వాహనాలపై క్షిపణులు పడడంతో మంటలు ఎగసిపడుతున్నట్లు తెలిసింది. మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైనా ఇరాన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లో మొస్సాద్ ఏర్పాటు చేసుకున్న డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. గ్లిలాట్లోని ఇజ్రాయెల్ సైనిక నిఘా కాంప్లెక్పైనా క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ఇప్పటిదాకా 370 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ లో 24 మంది మరణించగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. సోమవారం ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ లోని హైఫాలోని చమురు శుద్ధి కేంద్రం ధ్వంసమైంది. అంతకు మించి.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని అమెరికా చేరుకున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం ఆయన కెనడాలోనే పర్యటించాల్సి ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్లడం ప్రాధాన్యంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ హడావుడిగా సిచువేషన్ రూమ్ను సిద్ధం చేయించి.. వాషింగ్టన్కు వచ్చారు. రాగానే రక్షణ మంత్రి హెగ్సెత్తో భేటీ అయ్యారు. దీంతో ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ తో అమెరికా చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సిందే. ఇది సుమారు 13,600 కిలోల బరువుంటుంది. దీనిని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయిన బి-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాల పశ్చిమాసియా సమీపంలోని డీగో గార్సియా బేస్కు అమెరికా చేర్చింది. రీప్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలనూ పశ్చిమాసియాకు తరలిస్తోంది. బ్రిటన్ తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండటం ఉద్రిక్తతను పెంచుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి విట్కాఫ్ను ఇరాన్తో చర్చల కోసం పంపుతానని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్కే తమ మద్దతు ఉంటుందని జీ7 దేశాల కూటమి ప్రకటించింది. ఇరాన్ ఉగ్రవాద శక్తులను పెంచి పోషిస్తూ పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమవుతోందని ఆరోపించింది. హర్మూజ్ జల సంధిలోని ఇరాన్, ఒమన్ తీరాల సమీపంలో మూడు నౌకలు తగలబడుతున్నట్లు సమాచారం. అర్మేనియా చేరుకున్న భారతీయ విద్యార్థులు ఇరాన్ చిక్కుకుపోయిన 110 మంది భారతీయ విద్యార్థులు అర్మేనియా చేరుకున్నారని విదేశాంగశాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం వారు ఢిల్లీకి రానున్నారని వెల్లడించింది. మరోవైపు టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని వీడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారత రాయబార కార్యాలయం మరో అడ్వైజరీ జారీ చేసింది. ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు: ట్రంప్ వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని సూచించారు. 'ఖమేనీ మాకు సులభమైన లక్ష్యమే. అయితే ఆయనను ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదు. ప్రజలపైనా, అమెరికా సైనికులపైనా క్షిపణులను ప్రయోగించడాన్ని కోరుకోవడంలేదు' అని తన ట్రూత్ సోషల్ మీడియా వేదికలో ట్రంప్ ప్రకటించారు.

Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/20/2025, 9:33:13 AM

*_Narendra Modi : ఈనెల మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..!!_* ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఈనెల 20, 21 తేదీల్లో బిజీగా ఉండనున్నారు. బీహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లలో ఆయన పర్యటనలు నిర్వహించనున్నారు. ప్రధాని కార్యాలయం అధికారికంగా ఈ వివరాలు ప్రకటించింది.జూన్ 20న మోదీ బీహార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇది కీలక దశగా భావిస్తున్నారు.ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ఇది ఆయా రాష్ట్రాల్లో మోదీ ప్రజాకానెక్ట్‌ను బలోపేతం చేస్తోంది. *_విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం_* జూన్ 21న విశాఖపట్నంలో యోగా దినోత్సవం జరగనుంది. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడం విశేషం. ప్రధాని మోదీ (Narendra Modi) స్వయంగా ఇందులో పాల్గొనబోతున్నారు.విశాఖ బీచ్ రోడ్డులో ప్రజల మధ్యలో మోదీ యోగా చేస్తారు. ఉదయం 6.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం మోదీ ప్రసంగించనున్నారు. *_ఐదు లక్షల మందికి పైగా హాజరు_* ఈ యోగా వేడుకకు 5 లక్షల మందికి

Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/20/2025, 9:31:56 AM

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు.. భీమవరంలో నడిరోడ్డుపై వీరంగం... కాలేజీ బస్సులో విద్యార్థిపై గుంపుగా దాడి బస్సును వెంబడిస్తూ అసభ్య చేష్టలు భయభ్రాంతులకు గురైన వాహనదారులు ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. భీమవరంలో శుక్రవారం కొందరు యువకులు మద్యం సేవించి వీరంగం సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ కాలేజీ బస్సులోని విద్యార్థిపై ఈ యువకులు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారని ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింత రెచ్చిపోయి అతనిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. బాధితుడైన విద్యార్థి ప్రయాణిస్తున్న కాలేజీ బస్సును ఆ యువకులు కొంత దూరం వెంబడించారు. బస్సు వెంట పడుతూ అసభ్యకరమైన చేష్టలు చేయడంతో పాటు నడిరోడ్డుపై డ్యాన్సులు చేస్తూ అలజడి సృష్టించారు. వారి ప్రవర్తనతో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కొందరు చిత్రీకరించడంతో అవి సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post image
Image
Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/15/2025, 3:13:07 PM

*ఐదుకు చేరిన గోదావరి మృతుల సంఖ్య* *కుత్బుల్లాపూర్:* బాసర వద్ద గోదావరి నది విషాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన వారిలో ఐదుగురు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజస్థాన్ కు చెందిన 3 కుటుంబాలు హైదరాబాద్ లోని చింతల్, కాచిగూడ ప్రాంతాల్లో స్థిర పడ్డారు. ఈ క్రమంలో ఆయా కుటుంబాలకు చెందిన 18 మంది అమ్మవారి దర్శనానికి వచ్చారు. పుణ్య స్నానాల కోసం గోదావరి నదికి చేరుకున్నారు. ఇసుక మేటలు వేసిన ప్రాంతంలోకి వెళ్లి స్నానాలు చేస్తుండగా అక్కడక్కడ ఉన్న లోతైన ప్రాంతంలో ఐదుగురు యువకులు మునిగి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యుల కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే సరికి నీట మునిగి పోయారు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహలను బయటకు వెలికి తీశారు. మృతులను రాకేష్ ( 17 ) , వినోద్ ( 18 ) , రుతిక్ , మదన్ ( 18 ), భరత్ (19) గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచి వేశాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/15/2025, 3:13:31 PM

*రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.* *21న యోగా డే ఏర్పాట్లపై సమీక్షించనున్న చంద్రబాబు.* *ప్రధాని మోదీ పర్యటన, యోగా వేడుకలపై మంత్రుల కమిటీ, అధికారులతో చర్చించనున్న చంద్రబాబు.* *బీచ్ రోడ్‌లో ఏర్పాట్లను పరిశీలించనున్న చంద్రబాబు.*

Kadapa Heart Beats
Kadapa Heart Beats
6/15/2025, 3:11:08 PM

బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష శాసనభలో బిల్లు ప్రవేశపెట్టిన తమిళనాడు ప్రభుత్వం, ఆమోదించిన గవర్నర్ ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని తెలిపిన తమిళనాడు ప్రభుత్వం ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన తమిళనాడు ప్రభుత్వం రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని పేర్కొన్న స్టాలిన్ ప్రభుత్వం

🙏 1
Link copied to clipboard!