
Kadapa Heart Beats
February 10, 2025 at 04:45 PM
అక్కడ బర్డ్ ఫ్లూ.. చికెన్ తినడం తగ్గించండి: కలెక్టర్
తూ.గో జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల మృతిపై కలెక్టర్ ప్రశాంతి స్పందించారు.
పెరవలి(M) కానూరులోని ఓ పౌల్ట్రీఫామ్ శాంపిల్స్ను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయిందని తెలిపారు.
కానూరు చుట్టూ 10KM పరిధిలోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు క్లోజ్ చేయాలని, కోళ్లు, గుడ్లను పూడ్చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలపై సర్వే చేయాలన్నారు.
కొన్నిరోజులు ప్రజలు చికెన్ తినడం తగ్గించాలని సూచించారు.