Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
February 10, 2025 at 09:54 AM
జిల్లా పోలీస్ కార్యాలయం సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 10-02-2025, *• సంగారెడ్డి జిల్లా పోలీసుల సంక్షేమమే ధ్యేయంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కేఫ్టేరియా/ కాంటీన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్. గారు.* ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. కార్యాలయ సిబ్బంది పని ఒత్తిడి నుండి సేదతీరడానికి కార్యాలయ ఆవరణలో కేఫ్టేరియా/ కాంటీన్ ను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల నుండి కార్యాలయానికి వచ్చిన సిబ్బంది సేదతీరడానికి అనుకూలంగా ఉంటుంది అన్నారు. ఈ క్యాంటీన్ నందు నాణ్యతతో కూడిన ఛాయ్, స్నాక్స్ అందుబాటులో ఉంటాయని, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు కార్యాలయాన్ని సందర్శించిన విజిటర్స్ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు.ఎస్పీ ఎ.సంజీవ రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, సైబర్ సెల్ డియస్పీ వేణుగోపాల్ రెడ్డి, డీటీసీ డియస్పీ సురేందర్ రెడ్డి, ఎ.ఆర్. డియస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఐ.టి సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఆర్.ఐ లు రామరావ్ (క్యాంటిన్ ఇంచార్జ్), రాజశేఖర్, కాంటీన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments